కోవిడ్ -19 కన్నా డేంజర్ ఫేక్ న్యూస్ వైరస్ ..!

కోవిడ్ -19పై నిజాలు ఒక్క శాతమే సోషల్ మీడియాలో వస్తున్నాయి. 99 శాతం అవాస్తవాలే వైరల్ అవుతున్నాయి. ఈ కోవలో కోవిడ్‌-19 వైరస్‌ కు కొన్ని లక్షల మంది మందు కనిపెట్టారు. అందులో ఆవుమూత్రం దగ్గర్నుంచి అల్లంవెల్లుల్లి పేస్ట్ వరకూ అన్ని రకాల ఉన్నాయి. ప్రపంచంలోని అనేక భాషల్లో వచ్చిన సినిమాల్లో నుంచి సామాహికంగా మనుషుల్ని ఖననం చేసే దృశ్యాలు తీసుకొచ్చి.. కోవిడ్ -19 బారిన పడిన దేశాలకు అన్వయిస్తూ.. విషాద గీతాలు ఆలపించేస్తున్నారు. ఇష్టం లేని సెలబ్రిటీలందరికీ కోవిడ్ -19ని అంటించేస్తూ.. పోస్టులు వైరల్ చేస్తున్నారు. అభిమాన హీరో విరాళం ప్రకటించకపోయినా వందల కోట్లు ఇచ్చేశారని.. పోస్టులు పెట్టి ఆనందం పొందుతున్నారు.

సినిమాల్లో సీన్లను చూపించి రియల్ అంటూ ఫేకింగ్ న్యూస్..!

ఇటలీలో కుప్పలు తెప్పలుగా శవాలను పూడ్చిపెడుతున్నారని.. రష్యాలో సింహాలను వీధుల్లోకి వదిలారని, స్పెయిన్‌లో మూకమ్మడిగా మృతదేహాలను కాల్చేస్తున్నారంటూ.. కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. నిజానికి అవన్నీ ఫేక్. ఇటలీలో కరోనా కారణంగా చనిపోయిన వారిని పెద్ద ఎత్తున వాహనాల్లో తరలించి గుట్టలుగా పోస్తున్నారని ఓ వీడియో హైలెట్ అయింది. 2016లో వచ్చిన పాండమిక్‌ అనే సైన్స్‌ఫిక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రంలోనిది ఆ వీడియో. ఇలాంటి ఎన్నో సినిమాల వీడియోలను.. సర్క్యూలేట్ చేస్తూ.. ఫేకర్లు ఆనందం పొందుతున్నారు. అయితే ఇవి ఫేకో కాదో..తెలుసుకునేంత సమయం నెటిజన్లకు ఉండటం లేదు. గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఇలాంటి వారిలో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇలా నమ్మి రెండు ట్వీట్లు చేసిన పవన్ కల్యాణ్, రజనీకాంత్ లకు ట్విట్టర్ షాకిచ్చింది. వారి ట్వీట్లను డిలీట్ చేసింది.

సెలబ్రిటీలవంటూ ఆడియో టేపులు సర్క్యూలేట్..!

సోషల్ మీడియాలో కరోనాపై సాగుతున్న ఫేక్ ప్రచారాలు ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఫలితంగా ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించని సమాచారాన్ని విచ్చలవిడిగా ప్రచారం చేసేస్తున్నారు. కొంత మంది పని గట్టుకుని మరీ ఈ ఫేకింగ్ న్యూస్ వ్యాపారం చేస్తున్నారు. ప్రత్యేకంగా ఆడియో టేపుల్ని కూడా విడుదల చేస్తున్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాణ పేరుతో.. ఆ ఆడియోను.. కొంత మంది క్రియేట్ చేసి హైలెట్ చేశారు. అలాగే… అపోలో హాస్పిటల్ డాక్టర్, ఓ రిపోర్టర్ సంభాషణ అంటూ.. ఓ ఆడియో కూడా… అందరికీ చేరిపోయింది. ఇదంతా ఫేక్ అని అపోలో యాజమాన్యం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. జేడీ లక్ష్మి నారాయణకు కూడా అది తను మాట్లాడిన ఆడియో కాదన్నారు.

నెటిజన్లను వైరస్‌లా పట్టేసుకున్న ఫేక్ కోవిడ్-19 న్యూస్..!

రాజకీయాల్లో ఈ సోషల్ మీడియా ఫేక్ పైత్యం మరింత ముదిరిపోతోంది. ప్రభుత్వాలు కీలకమైన సమాచారాన్ని దాచి పెడుతున్నాయని… కొన్ని వేల మంది కరోనా కేసులు వెలుగు చూసినా చెప్పడం లేదని… సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అత్యంత భయంకరంగా ఉండేలా ఈ పోస్టులు ఉంటున్నాయి. ప్రభుత్వాలను తప్పు పట్టేలా ఉంటున్నాయి. దీనిపై.. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా స్పందించారు. ఇలాంటి ప్రచారాలు చేసే వారిని ఎంత భయంకరంగా శిక్షిస్తానో మీరే చూస్తారంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇలా ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిక కరోనా రావాలంటూ శాపం కూడా పెట్టారు. ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు చేసినా… ఎన్ని శిక్షలు విధిస్తామని హెచ్చరించినా.. సోషల్ మీడియాలో మాత్రం.. కంట్రోల్‌లోకి రావడం లేదు. ధృవీకరించని సమాచారం.. విస్తృతంగా వైరల్ అవుతూనే ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే వరకూ రమేష్‌కుమార్ బాధ్యతలు తీసుకోకూడదట..!

స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ బాధ్యతలు తీసుకున్నట్లుగా ప్రకటించుకుని.. సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం చట్ట విరుద్ధమని తాజాగా ఏపీ ప్రభుత్వం వాదన వినిపించడం ప్రారంభించింది. సోమవారం.. ఎస్‌ఈసీగా రమేష్...

అన్‌లాక్ 1 : 8వ తేదీ నుంచి హోటళ్లు, ఆలయాలు ఓపెన్..!

దేశంలో లాక్‌డౌన్‌ను కంటెన్మెంట్‌జోన్లకే పరిమితం చేస్తూ... కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్‌ ముగింపు కోసం.. అన్‌లాక్ పాలసీని ప్రకటించింది. దీనిలో భాగంగా జూన్ ఎనిమిదో తేదీ నుంచి ఆలయాలు, హోటళ్లు,...

ఇన్ సైడ్ న్యూస్: సొంత పత్రిక , ఛానల్ ప్రారంభించడం కోసం జనసేన కసరత్తు

త్వరలోనే సొంత పత్రిక, టీవి ఛానల్ ప్రారంభించాలనే యోచన తో జనసేన పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. ఈ మేరకు పార్టీలో క్యాడర్ నుంచే కాకుండా, పార్టీ ముఖ్య నేతల...

మోడీ సాధించే స్వావలంబనపై పవన్‌కు ఎంతో నమ్మకం..!

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీతో దేశం స్వయం స్వావలంబన సాధిస్తుందని.. ప్రధానమంత్రి మోడీ, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ తరవాత గట్టిగా నమ్ముతున్న వ్యక్తి జనసేన అధినేత పవన్...

HOT NEWS

[X] Close
[X] Close