పవన్ కళ్యాణ్… ఈ పేరు వినగానే అభిమానుల్లో పూనకాలు. ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’తో ఆయన మళ్ళీ అందరినీ కట్టిపడేశారు.
వీరమల్లు ప్రతి సీన్, ప్రతి డైలాగ్, ప్రతి ఫైటుకి థియేటర్స్ పవర్ స్టార్ స్లొగన్స్ తో మారుమ్రోగుతున్నాయి.
స్వధర్మం నేపధ్యంలో సాగిన కథలోని భావోద్వేగాలు ప్రేక్షకులను అద్భుతంగా అలరిస్తున్నాయి.
పవన్ స్వయంగా కంపోజ్ చేసిన యాక్షన్ బ్లాక్స్ చూసిన ఫ్యాన్స్ ‘ఇదీ మన కళ్యాణ్ బాబు స్వాగ్’ అంటూ విజల్స్ కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.
భారీ కాన్వాస్, గ్రాండ్ విజువల్స్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, వీటన్నింటికి మించి పవన్ నటనతో సినిమా మరోస్థాయి వెళ్ళింది.
ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ మాస్ రాంపేజ్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించింది.
స్వధర్మం నేపథ్యంలోని సన్నివేశాలు సినిమాని మరోస్థాయికి తీసుకెళ్ళాయి.
సనాతన ధర్మ పరిరక్షణకై వీరమల్లు చేసిన పోరాటం ప్రేక్షకులు మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది.