రాబోయే పవన్ పుట్టినరోజుకు ఫ్యాన్స్ ట్విట్టర్ ట్రెండింగ్ ప్రాక్టీస్..!

ఈ రోజు డేట్ ఎంత.. జూలై 15. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు ఎప్పుడు సెప్టెంబర్ రెండో తేదీ. ఈ రెండింటి మధ్య నెలన్నర గ్యాప్ ఉంది. కనీసం.. తర్వాతి రోజో.. తర్వాతి వారమో అయితే.. కనీసం అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే చెప్పుకోవచ్చు. కానీ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాత్రం.. నెలన్నర రోజుల ముందు పవన్ కల్యాణ్ బర్తేడ్ ట్వీట్స్ ట్రెండ్ చేయడం ప్రారంభించారు. అడ్వాన్సుడ్‌ హ్యాపీ బ‌ర్త్ డే ప‌వ‌న్‌క‌ల్యాణ్ అనే హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేసి ట్విట్టర్‌లో ట్రెండ్ చేశారు. 24 గంట‌ల్లోనే ఈ హ్యాష్ ట్యాగ్‌తో 27.3 మిలియ‌న్స్ ట్వీట్స్ వచ్చాయి. ట్విట్స్‌లో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఏ రేంజ్‌ ఉత్సాహంలో ఉంటారో మరోసారి స్పష్టమయింది.

పవన్ కల్యాణ్ ఈ పుట్టిన రోజును.. మెమరబుల్‌గా ప్లాన్ చేయాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారని ఈ ట్రెండింగ్ ప్రాక్టీస్ ద్వారానే అంచనా వేయవచ్చు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పవన్ కల్యాణ్ సినిమాలు మానేశారు. ఇప్పుడు కొత్తగా ఆయన మళ్లీ మేకప్ వేసుకున్నారు. అంతా బాగుంటే.. ఈ పాటికి వకీల్ సాబ్ రిలీజైఉండేది. కానీ కరోనా దెబ్బకొట్టింది. దాంతో.. ఆయన సినిమాలన్నీ.. అలా ప్లానింగ్‌లోనే ఉండిపోయాయి. పవన్ కల్యాణ్ కూడా బయటకు రావడంలేదు. పూర్తిగా కుటుంబానికే సమయం కేటాయిస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం.. ఆయనను ఖుషీ చేయడానికి.. ప్రాక్టీస్ ప్రారంభించారు.

జనసేన సోషల్ మీడియా విభాగం.. చాలా చురుగ్గా ఉంటుంది. ట్విట్టర్‌లో పవన్ కల్యాణ్ న్యూస్ ఏదైనా వస్తే బాగా ట్రెండింగ్ చేస్తారు. పుట్టిన రోజు లాంటి వాటికి.. స్పెషల్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి.. బీభత్సంగా… ట్రెండింగ్ సృష్టిస్తారు. పెద్దగా ఈవెంట్ లేకుండానే.. కేవలం అడ్వాన్స్‌డ్ హ్యాపీ బర్త్ డేకే.. 27 మిలియ‌న్స్ ట్వీట్స్ చూపించారంటూ.. నిజంగా.. సెప్టెంబర్ 2కి ట్విట్టర్ బద్దలు కొట్టేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్చ్…ఇళ్ల పట్టాల పంపిణీ మళ్లీ వాయిదా..!

ఆగస్టు పదిహేనో తేదీన 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలిస్తామన్న ఏపీ సర్కార్ మళ్లీ వాయిదా బాట పట్టింది. కోర్టుల్లో కేసులున్నాయంటూ... మరోసారి ముహుర్తం మార్చింది. ఈ సారి గాంధీ జయంతికి...

అనధికార కేబినెట్ భేటీని నిర్వహించేసిన కేటీఆర్..!

తెలంగాణ సర్కార్‌లో నెంబర్ టూగా ఉంటూ.. సీఎం రేంజ్ పవర్స్ తో పాటు విధులు కూడా నిర్వహిస్తున్న అనధికారికంగా కేబినెట్ భేటీ కూడా నిర్వహించేశారు. ప్రాక్టీస్ కోసం అన్నట్లుగా జరిగిన ఈ కేబినెట్...
video

స‌డ‌క్ 2 పై.. సుశాంత్ అభిమానుల సెగ‌

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య వెనుక‌.. ప్ర‌త్య‌క్షంగానూ ప‌రోక్షంగానూ మ‌హేష్ భ‌ట్ ప్ర‌మేయం ఉంద‌ని సుశాంత్ అభిమానులు న‌మ్ముతున్నారు. చాలా రోజులుగా సుశాంత్ వ‌ర్గం మ‌హేష్ భ‌ట్ ని టార్గెట్ చేస్తోంది....

“చేయూత” డబ్బులతో వ్యాపారం నేర్పిస్తున్న జగన్..!

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారత కోసం.. మరో వినూత్నమైన ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ చేయూత పథకాన్ని తాడేపల్లిలోని ఇంటి నుంచి ప్రారంభించారు. ఏడాదికి రూ. 18,750 ఇచ్చే ఈపథకం...

HOT NEWS

[X] Close
[X] Close