ఢిల్లీ సరిహద్దుల్లో రైతులపై సర్జికల్ స్ట్రైక్స్..!

కేంద్రం తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తరాదిలో నిరసనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఆ చట్టాల గురించి దక్షిణాది రైతులు పట్టించుకోలేదు. వాటి వల్ల జరిగే నష్టం తమకే ఎక్కువగా ఉంటుందని ఉత్తరాది రైతులు అనుకుంటున్నారేమో కానీ ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేస్తున్నారు. ఇలా పలు రాష్ట్రాల రైతులు… కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. రైతులు.. వందల్లో ప్రారంభమై.. లక్షలకు చేరుకున్నారు. ఈ రైతు దండును చూసి.. కేంద్రానికి దడపుట్టింది. సరిహద్దుల్లోనే వారిని నిలిపివేశారు. ఫలితంగా ఢిల్లీ సరిహద్దుల్లో గురువారం అంతా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. హర్యానా శివార్లలో అక్కడి ప్రభుత్వం , పోలీసులు రైతులపై దమన కాండ నిర్వహించారు.

పంజాబ్ ముఖ్యమంత్రి అందర్నీ రెచ్చగొడుతున్నారంటూ.. హర్యానా ముఖ్యమంత్రి మండిపడుతున్నారు. నిజానికి హర్యానా రైతులు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కానీ పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది.. హర్యానాలో బీజేపీ సర్కార్ ఉంది. బీజేపీ సీఎం ఖట్టర్… కేంద్ర నిర్ణయాన్ని ఖండించలేరు. అందుకే.. బిల్లు వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేందుకు ఆయన తాపత్రయపడుతున్నారు. అదే విషయాన్ని పంజాబ్ సీఎంతో సవాళ్లు చేస్తున్నారు. రైతులకు నష్టం కలుగుతుందని నిరూపించాలని అంటున్నారు. కానీ రైతుల ఉద్యమం రాజకీయ నేతల చేతుల్లోంచి వెళ్లిపోయింది.

ఆ ప్రభావం ఢిల్లీ శివార్లలో కనిపిస్తోంది. ఇది దేశం మొత్తానికి పాకితే… ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. కరోనా కారణంగా చాలా వరకూ ఉద్యమాలకు పులిస్టాప్ పడినప్పటికీ.. ఇప్పుడు మళ్లీ ఎగసి పడుతున్నాయి. వాటిని అణిచి వేయడానికి సరిహద్దుల్లోనే.. లోపలికి రాకుండా సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది రాజకీయ దుమారానికి కారణం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏకగ్రీవం చేసుకోకపోతే అనర్హతా వేటేస్తారా..!?

పంచాయతీ ఎన్నికల్లోనూ ఏకగ్రీవాల రచ్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. పార్టీ రహితంగా జరుగుతాయి కాబట్టి.. ఊళ్లలోని పెద్దలు కూర్చుని ఏకగ్రీవాలు చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రిపబ్లిక్ డే రోజున వైసీపీ...

ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేతలకు కరోనా భయం పోయింది..!

సుప్రీంకోర్టు తీర్పునైనా ధిక్కరిస్తామని ఒకరు...మా ప్రాణానికి హాని కల్పిస్తే చంపడానికైనా సిద్ధమని మరొకరు.. మమ్మల్ని ఆదేశించడానికి ఎస్ఈసీ ఎవరని మరొకరు.... వరుసగా ఒకరి తర్వాతా ఒకరు మీడియా ముందుకు వచ్చి సర్కస్ ఫీట్లులా...

టీ కాంగ్రెస్ ఎంపీల ఢిల్లీ ఎజెండా కేసీఆర్ ఆవినీతే..!

పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఒకే ఒక్క అజెండా పెట్టుకున్నారు. అది ప్రజాసమస్యలు.. తెలంగాణ ప్రయోజనాలు.. విభజన హామీలులాంటివి కాదు. టీఆర్ఎస్ అవినీతిని... ఢిల్లీలో ప్రచారం చేయడం. టీఆర్ఎస్ అదే...
video

అర్థ శ‌తాబ్దం – మ‌రో ప్ర‌శ్నాస్త్రం

https://www.youtube.com/watch?v=KZlgjWutVys&feature=youtu.be ప్ర‌శ్నించ‌డానికి స‌మాజం, వ్య‌క్తులు, సంఘాలూ, వ్య‌వ‌స్థ‌లూ అవ‌స‌రం లేదు. అప్పుడ‌ప్పుడూ.. సినిమా కూడా ఆ బాధ్య‌త తీసుకుంటుంది. కొన్ని సినిమాలు ప్ర‌శ్నించ‌డానికే పుడుతుంటాయి. `సింధూరం`లా. ఇప్పుడు అలాంటి సినిమా ఒక‌టి వ‌స్తోంది. అదే.....

HOT NEWS

[X] Close
[X] Close