నిండా మునిగింది రాజధానికి భూములు ఇచ్చిన రైతులే..!

ఓ ప్రాజెక్ట్ కడదామంటే.. వెయ్యి ఎకరాల భూసేకరణ చేయడానికి ప్రభుత్వాలు పడే తంటాలు అన్నీ ఇన్నీ కావు. గొడవలు.. ధర్నాలు.. కాల్పుల వరకూ పరిస్థితులు వెళ్తాయి. కానీ.. ఏపీ రాజధానికి.. ఎలాంటి గొడవలు లేకుండా 33వేల ఎకరాలు సమకూరాయి. ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టలేదు. భూసమీకరణ అలా అందరిని దృష్టిని ఆకర్షించింది. ఎంతో మంది రెచ్చగొట్టడానికి ప్రయత్నించినా.. రైతులు.. మరో మాట లేకుండా.. రాష్ట్రం కోసం రాజధాని కోసం భూములు ఇచ్చారు. ఇప్పుడు వారే.. అన్ని విధాలుగా నష్టపోతున్నారు.

రాజధాని అమరావతి నిర్మాణం కోసం 33 వేల 567 ఎకరాలను భూ సమీకరణ విధానం కింద ప్రభుత్వానికి ఇచ్చిన రైతులు రోడ్డునపడ్డారు. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాలకు చెందిన రైతులు తమ భూములను రాజధాని అభివృద్ధి కోసం భూ సమీకరణ విధానం కింద ప్రభుత్వానికి ఇచ్చారు. జరీబు గ్రామాల్లో ఎకరానికి వెయ్యి గజాల నివాస స్థలం, 450 గజాలు వాణిజ్య స్థలాన్ని రైతులకిచ్చారు. మెట్ట గ్రామాల్లో వెయ్యి గజాల నివాస స్థలం, 300 గజాలు వాణిజ్య స్థలాన్ని భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం లాటరీ వేసి ప్లాట్లను కేటాయించింది. ఈ ప్లాట్లలో మౌలిక సదుపాయాలైన విద్యుత్, నీరు, రహదారులు, భూగర్భ డ్రైనేజ్, పవర కేబుల్స్, గ్యాస్ లైన్ కూడా వేసి అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం రైతులతో కుదుర్చుకున్న భాగస్వామ్య ఒప్పందంలో పేర్కొంది. ఈ మేరకు ఈ ప్లాట్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఆయా సంస్థలకు కాంట్రాక్ట్ లు కూడా ఇచ్చింది. ఈలోపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వీటన్నిటినీ నిలిపివేసింది.

తమ కళ్ల ముందే రాజధానికిచ్చిన భూముల ధరలు కోట్లాది రూపాయలకు చేరుకోవటం, మరలా అవే భూముల ధరలు పాతాళానికి పడిపోవటాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. భూములను కూడా వెనక్కి ఇవ్వమని కోరినప్పటికీ ఆ అవకాశం కూడా లేకపోవటంతో రైతుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యి అన్న చందంగా మారింది. ఇప్పటికే తమ భూముల్లో వేరేవారికి ప్లాట్లు రావటంతో వాటిని ప్రభుత్వం ప్లాట్లు వచ్చినవారికి రిజిస్ట్రేషన్ కూడా చేసింది. అలా రిజిస్టర్ అయిన ప్లాట్లను రైతులు వేరేవారికి విక్రయించేశారు. ఇప్పటికే రాజధాని రైతులు తమతో ప్రభుత్వం కుదుర్చుకున్న భాగస్వామ్య ఒప్పందాన్ని అమలు జరిపేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ జరపనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close