రివ్యూ : ‘ఫర్జి’ వెబ్ సిరీస్

Farzi webseries review

ప్రపంచంలోనే తొలి పూరాతన వృత్తి వ్యభిచారం. రెండవది నకిలీ డబ్బు. ‘ఫర్జి’ వెబ్ సిరీస్ లో వినిపించిన డైలాగ్ ఇది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ తో ఒరిజినల్ వెబ్ సిరిస్ మేకర్స్ గా పేరు తెచ్చుకున్న రాజ్ అండ్ డీకే ఇప్పుడు ‘ఫర్జీ’ తో నకిలీ డబ్బు చుట్టూ ఎనిమిది ఎపిసోడ్ ల వెబ్ సిరిస్ ని రూపొందించారు. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, కె.కె. మీనన్, అమోల్ పాలేకర్ లాంటి స్టార్లు నటించిన ఈ వెబ్ సిరిస్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలైయింది. నకిలీ డబ్బు నేపధ్యంలో సాగిన ఈ వెబ్ సిరిస్ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది? ఈ రెండో పూరాతన వృత్తిని ఎంత కొత్త ప్రజంట్ చేశారు ? ఆ ప్రయాణం ఎంత ఆసక్తికరంగా సాగింది?

సందీప్‌ అలియాస్‌ సన్నీ (షాహిద్‌కపూర్‌) మంచి ఆర్టిస్ట్. ఎలాంటి పెయింటింగ్ చూసినా దాన్ని అచ్చు ఒరిజినల్ గా దించేస్తాడు. లక్షలు ఖరీదు చేసే పెయిటింగ్స్.. సన్నీ దగ్గర వందకు వెయ్యికి దొరుకుతాయి. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో తాత(అమోల్‌ పాలేకర్‌) సన్నీని పెంచుతాడు. సన్నీ తాతయ్య ‘క్రాంతి’ అనే పత్రికను నడుపుతుంటాడు. ఎన్నో ఆదర్శ భావాలు గల ఆయన రాసే రాతలు ఎవరికీ పట్టవు. కానీ ఎక్కడా నిరాశ చెందకుండా అప్పులు చేసిమరీ పత్రికని నడుపుతాడు. చివరకు ప్రెస్ అప్పులు వాళ్లు స్వాధీనం చేసుకునే పరిస్థితి నెలకొంటుంది. సన్నీకి తాత నడిపే ప్రెస్ తో ఎంతో అనుబంధం వుంటుంది. ఎలాగైనా డబ్బు సంపాదించి ప్రెస్ ని తాతకు తిరిగి ఇవ్వాలనుకుంటాడు సన్నీ. అయితే సన్నికి డబ్బు సంపాయించే మార్గం కనిపించదు. దీంతో తనలోని ఆర్టిస్ట్ ని మరో విధంగా వాడుకోవాలని నిర్ణయానికి వస్తాడు. డూప్లికేట్ పెయింట్లు గీసి డబ్బులు సంపాయించడం కాదు.. ఏకంగా నోట్లనే డూప్లికేట్ చేసేయాలని భావిస్తాడు. బాల్య స్నేహితుడు ఫిరోజ్‌ (భువన్‌ అరోరా)తో కలిసి ‘క్రాంతి’ ప్రెస్ లోనే దొంగనోట్లను సక్సెస్ ఫుల్ గా ప్రింట్ చేస్తారు. లోకల్ గా ఓ ముఠా సాయంతో ఆ దొంగనోట్లను మార్చి డబ్బు సంపాయించి తాత నడిపే పత్రికని కాపాడగలుగుతాడు సన్నీ.

కట్ చేస్తే.. దొంగ నోట్ల చలామణీ చేయడంలో కింగ్ పిన్ మన్సూర్‌ దలాల్‌ (కేకే మేనన్‌). నేపాల్, బంగ్లాదేశ్ కేంద్రంగా అతడి ముఠాలు పనిచేస్తుంటాయి. అయితే నకిలీ నోట్లుని గుర్తించే మిషన్ లో మన్సూర్ ప్రింట్ చేసే నోట్లు దొరికిపోతాయి. ఇదే సమయంలో మన్సూర్ చేతికి సన్నీ ప్రింట్ చేసిన నోటి దొరుకుతుంది. సన్నీ ముద్రించిన నోట్లను బ్యాంకులు, మిషన్ లు కూడా గుర్తించలేవు. ఈ క్రమంలోనే సన్నీ గురించి తెలుసుకున్న మన్సూర్‌ ఏం చేశాడు ? ఈ ఇద్దరూ కలసి ఎలాంటి నేరాలకు పాల్పడ్డారు ? మన్సూర్ ని పట్టుకోవడానికి రంగంలో దిగిన మైఖేల్ (విజయ్ సేతుపతి) అద్వర్యంలో స్పెషల్ టాస్క్ ఎలాంటి ఆపరేషన్ చేసింది ? సన్ని, మన్సూర్ లని మైఖేల్ పట్టుకున్నాడా లేదా ? అనేది మిగతా కథ.

పాత్రలని సృష్టించడంలో రాజ్ అండ్ డీకే లది ప్రత్యేకమైన శైలి. వాళ్ళు రాసుకునే పాత్రలలో విలన్, హీరోలు అంటూ ప్రత్యేకంగా వుండరు. పరిస్థితులు, భాద్యతలు, అవసరాలు మాత్రమే వుంటాయి. అలాంటి విలక్షణమైన పాత్రలతోనే ఎంగేజింగా కథని నడుపుతారు. ‘ఫర్జి’ లో కూడా అదే జరిగింది. సందీప్ దొంగనోట్లు తయారూ చేస్తుంటాడు. ఇది ఇల్లీగల్. మైఖేల్ దొంగనోట్ల తయారూ చేసే ముఠాని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇది అతని డ్యూటీ. అంతేగానీ దేశంలో ఒక్క దొంగ నోటు కూడా ఉండకూడదనే కంకణం లాంటిది కట్టుకోడు. పైగా దొంగనోట్లతో వస్తువులు కొనుక్కోవడానికి ఎలాంటి గిల్ట్ ఫీలవ్వడు మైఖేల్. స్వాధీనం చేసుకున్న దొంగనోట్లతో కొడుక్కి ఐఫోన్ బహుమతిగా ఇస్తాడు. మంత్రి గారి ప్రైవేట్ ఫోటోలతో మంత్రిగారినే తన అవసరం కోసం బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. ఇలాంటి ఆసక్తికరమైన పాత్రలు క్రియేట్ చేసి ఫర్జిని ఆద్యంతం రక్తికట్టించారు.

సందీప్ ని మన్సూర్ గ్యాంగ్ కిడ్నాప్ చేయడంతో కథ మొదలౌతుంది. సందీప్ బాల్యం టచ్చింగా వుంటుంది. సందీప్, ఫిరోజ్ ల స్నేహాన్ని చక్కగా ఎస్టాబ్లెస్ చేశారు. ఫిరోజ్ పాత్రని సెకండ్ ఎపిసోడ్ లో గన్ తో కాల్చినట్లు చూపిస్తారు. ఫిరోజ్ లేకపోతే అసలు సిరిస్ అనవసరం అనే ఫీలింగ్ ప్రేక్షకుడిలో కలుగుతుదంటే… ఆ పాత్రని, వాళ్ళ మధ్య ఎమోషన్ ని అంత బలంగా తీర్చిదిద్దడమే కారణం. సందీప్ లవ్ ట్రాక్ వేదంలో అల్లు అర్జున్ ఎపిసోడ్ ని గుర్తు చేసినప్పటికీ దాన్ని మరీ సాగదీయకుండా దొంగ నోట్ల ప్రిటింగ్ ఎపిసోడ్ కథని చకచకగా నడిపారు. దొంగనోట్లు తయారూ చేయడం, వాటి గుర్తుపడుతున్నారా లేదా అని వైన్ షాప్ లో పరీక్షించడం .. ఇవన్నీ ఆసక్తిగానే సాగుతాయి. దొంగ నోట్లని ఎలా తయారూ చేస్తారు? ఒక నోట్ లో ఎలాంటి ఆర్ట్ వుంటుంది ? దాన్ని కాపీ చేయాలంటే ఎలాంటి స్కిల్ కావాలి ? ఇలా చాల డిటేయిల్ గా చూపించారు. ఇంత వివరంగా చూపించడం కొంతమందికి బోరింగ్ అనిపించినా.. వెబ్ సిరిస్ లోని అసలు కిక్కు అదే. రచయిత, దర్శకుడు చాలా రిసెర్చ్ చేసి కంటెంట్ తయారు చేస్తేనే ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లగలుగుతారు. ప్రపంచంలోని బెస్ట్ వెబ్ సిరిస్ లో ఒకటైన ‘బ్రేకింగ్ బాడ్’ ఒక కెమిస్ట్రీ పాఠంలా వుంటుంది. డ్రగ్స్ ని ఎలా తయారూ చేస్తారు, ఎలాంటి ఫార్ములా వాడుతారు ఇవన్నీ వివరంగా చూపిస్తారు. అదే ఆ కంటెంట్ కి సహజత్వాన్ని తీసుకొస్తుంది. ఫర్జిలో కూడా దొంగనోట్ల తయారీ విషయంలో కూడా దర్శక రచయితలు బాగా రీసెర్చ్ చేసినట్లే కనిపిస్తుంది.

తన అవసరాలు తీరిపోయిన తర్వాత దొంగనోట్ల దందాని ఆపేయాలని అనుకుంటాడు సన్నీ. అయితే మన్సూర్, సన్నీ జీవితంలోకి వచ్చిన తర్వాత కథ మరో మలపు తీసుకుంటుంది. మానవ నైజంలోని ‘అత్యాశ’ తెరపైకి వస్తుంది. మరోవైపు మైఖల్ తన టీమ్ తో కలసి మన్సూర్ ని పట్టుకునే మిషన్ లో వుంటాడు. ఈ క్రమంలో నడిచే దొంగా పోలీసు ఆట అంత ఆసక్తిగా వుండదు కానీ ఎక్కడా బోర్ కొట్టదు. ఈ సిరిస్ లో చివరి రెండు ఎపిసోడ్లు చాలా ఆసక్తికరంగా మలిచారు. దొంగ నోట్లని షిఫ్ లో రవాణా చేయడం, సన్నీ, ఫిరోజ్ నోట్లని రోడ్డు పై విసిరేసి తప్పించుకోవడం, మన్సూర్ ముఠా క్రాంతి ప్రెస్ ని తగలబెట్టడం, దానికి రివెంజ్ గా సన్నీ చేసిన యాక్ట్.. ‘అన్బిలీవబుల్’.

ఫర్జీని ఎంగేజింగా నిలబెట్టింది పాత్రలు, పాత్రదారులు నటన. షాహిద్ కపూర్ సన్ని పాత్రని దాటి రాలేదు. చాలా కన్సిస్టెంట్ గా పెర్ఫారమ్ చేశాడు. బూతద్దం పెట్టి వెదికినా ఒక్క హీరోయిజం షాట్ కనిపించదు. అదే ఆ పాత్రకు గొప్ప మేలు చేసింది. మైఖేల్ పాత్ర విజయ్ సేతుపతి బాడీ లాంగ్వేజ్ కి యాప్ట్. టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ అని మైఖేల్ కి ప్రత్యేకమైన పవర్స్ ఏమీ వుండవు. రాజ్ డీకే ఆ పాత్రని చాలా సహజంగా రాశారు. విజయ్ కూడా అంతే సహజంగా చేశాడు. ఇందులో మైఖేల్ ఫ్యామిలీ కోణం కూడా చూపించారు. మైఖేల్ భార్య రేఖ ( రెజీనా). మైఖేల్ నుంచి విడిపోవాలని కోర్టులో విడాకులని కోరుతుంది. ఆ ఎపిసోడ్ కు ఫర్జీ కథకు సంబంధం లేదు. దీంతో ఆ ట్రాక్ కాస్త బోరింగా అనిపిస్తుంది. అయితే విజయ్ నటన చూడముచ్చటగా వుండటం వలన ఆ ట్రాక్ తో సంబంధం లేకుండా పాత్రతో ట్రావెల్ అవుతాం. విజయ్ సొంతగా డబ్బింగ్ చెప్పడం ఫర్జీ కి ప్రధాన ఆకర్షణ. మైఖేల్ పాత్రకు తెలుగు తమిళ మూలాలు వుండటం వలన..హిందీ, ఇంగ్లీష్ తో కలుపుకొని మొత్తం నాలుగు భాషల్లో డైలాగులు చెబుతుంటే భలే ముచ్చటగా వుంటుంది. ముఖ్యంగా మంత్రిగారితో (జాకీర్ హుస్సేన్) తో మైఖేల్ సంభాషణలు హిలేరియస్ గా వుంటాయి. ఆర్బిఐ టీంలో మేఘన (రాశిఖన్నా) పాత్ర మొదట్లో బలంగా కనిపించినా.. చివర్లో ఆ పాత్రని రొటీన్ గా వుంచేశారనే భావన కలుగుతుంది. తాతయ్య పాత్రలో అమోల్‌ పాలేకర్‌ హుందాగా కనిపించారు. సన్ని, తాతయ్య మధ్య వచ్చే సన్నివేశాలు ఎమోషనల్ టచ్ ఇచ్చాయి. ఫిరోజ్ పాత్రలో భువన్‌ అరోరా గుర్తిండిపోతాడు. కేకే మీనన్ గురించి ప్రత్యేకంగా చుప్పుకోవాలి. ఆ పాత్ర రొటీన్ గానే వుంటుంది. కానీ తన నటనతో మన్సూర్ ని ప్రత్యేకంగా మలిచారు.

కెమరాపనితనం, మ్యూజిక్ బాగా కుదిరింది. ముంబైతో పాటు బంగ్లాదేశ్ నేపాల్ లో షూటింగ్ చేయడంతో ఫ్రెష్ లుక్ వచ్చింది. రాజ్ అండ్ డీకె ల రైటింగ్ బ్రిలియంట్ గా వుంది. షాహిద్, విజయ్ సేతుపతి లాంటి స్టార్లు వున్నారని ఎక్కడా నేలవిడిచి సాము చేయలేదు. ఒక్క బిల్డప్ షాట్, ఎలివేషన్, స్లో మోషన్ కనిపించదు. కంటెంట్ పైనే ద్రుష్టి పెట్టారు. క్యాచి సింగెల్ లైనర్స్ రాశారు. కొన్ని వినగానే నవ్విస్తాయి,ఇంకొన్ని అలోచింపజేస్తాయి. అలాగే సెన్సార్ చేయాల్సిన బోలెడు డైలాగులు ఇందులో వున్నాయి. ఇందులో మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు వున్నాయి. ఒకొక్క ఎపిసోడ్ నిడివి యాభై నిమిషాలకు పైనే వుంటుంది. ఇంత నిడివి ఉన్నప్పటికీ ఈ సీజన్ లో కథకి ఒక ముగింపు ఇవ్వలేదు. ఒక ఇంటర్వెల్ బాంగ్ లానే వదిలేశారు. వెంటనే రెండో సీజన్ చూడాలనే ఆసక్తిని మాత్రం కలిగించారు. ఒక ఎపిసోడ్ చూసిన తర్వాత గ్యాంగ్ లేకుండా మొత్తం సిరిస్ చేసేయాలనే ఆసక్తిని కలిగించడం.. మంచి వెబ్ సిరిస్ కి ఉండాల్సిన లక్షణం. ఈ విషయంలో ఫర్జీకి ఫుల్ మార్కులు పడిపోతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=Eou1oqvFa9COa1uy విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close