పవన్ కల్యాణ్‌తో యవ్వారం కాస్త తేడాగానే ఉంటుంది. పవన్ మెల్ట్ అయితే… ఆ దర్శకుడి పని నల్లేరుపై నడకే. తేడా వస్తే.. అంతే సంగతులు. పవన్ మూడ్‌ని బట్టి నడుచుకోవడం ఏ దర్శకుడికైనా కత్తిమీద సాము. సర్దార్ గబ్బర్‌సింగ్ సెట్లో పవన్‌కీ.. ఆ సినిమా కెమెరామెన్‌కీ తరచూ గొడవలయ్యేవి. అందుకే.. షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే సాంకేతిక నిపుణుల్లో మార్పులూ చేర్పులూ జరిగాయి. సేమ్ టూ సేమ్ కాటమరాయుడు సెట్లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతోందన్నది ఇన్సైడ్ న్యూస్. సోమవారం హైదరాబాద్‌లో కాటమరాయుడు షూటింగ్ జరిగింది. సెట్లో దర్శకుడు డాలీకీ, పవన్‌కీ మధ్య ఏదో విషయమై… చిన్న గొడవ వచ్చిందట. దర్శకుడి వైఖరిపై అలిగిన పవన్.. సెట్లోంచి హుటాహుటిన వెళ్లిపోయాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ లేకపోవడంతో… షూటింగ్ కాసేపు ఆగిపోయిందని, ఆ తరవాత పవన్ లేని సీన్లు తీసుకోవాల్సిచ్చిందని తెలుస్తోంది. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న శరత్ మరార్ పవన్‌కి అత్యంత సన్నిహితుడు. దర్శకుడికీ, పవన్‌కీ వాదన జరుగుతున్నప్పుడు సెట్లో శరత్ మరార్ కూడా ఉన్నాడట. అయితే.. పవన్‌ని ఎదిరించే ధైర్యం లేక కామ్‌గా ఉండిపోయాడని, ఆ తరవాత పవన్‌ని సర్దిచెప్పే పనిలో లీనమయ్యాడని తెలుస్తోంది. వపన్ అలిగి వెళ్లిపోవడంతో కాస్త టెన్షన్ పడిన డాలీ.. ఆ తరవాత కుదురుకున్నాడని, ఈ రోజు షూటింగ్ యధావిధిగా జరిగిందని తెలుస్తోంది. డిసెంబరు నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని పవన్ టార్గెట్‌గా పెట్టుకొన్నాడు. ఈలోగా ఇలా చిరుబుర్రులు ఆడి.. అలిగి వెళ్లిపోతుంటే… డిసెంబరు నాటికి పూర్తవ్వడం అసాధ్యమే.