ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జగన్ కి మద్దతు పలకడం వెనుక..

రిపబ్లిక్ డే సినిమా ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఉపన్యాసానికి సంబంధించిన ప్రకంపనలు అటు సినీ పరిశ్రమలోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అయితే శనివారం పవన్ కళ్యాణ్ ప్రభుత్వం సినీ పరిశ్రమని ఇబ్బందులు పడుతున్న తీరు గురించి వ్యాఖ్యలు చేయగానే ఆదివారానికంతా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి మరీ తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు, ప్రభుత్వాలు పరిశ్రమకు ఇతోధికంగా చేయూత ని అందిస్తున్నాయి అంటూ ప్రకటించింది. అయితే ఇంత హఠాత్తుగా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించడానికి, ఆ విధంగా ప్రకటన జారీ చేయడానికి, జగన్ కి మద్దతు పలికేలా ప్రెస్ నోట్ డిజైన్ చేయడానికి వెనుక బలమైన కారణాలే ఉన్నట్లు తెలుస్తోంది.

లేఖ విడుదల చేసిన నారాయణ దాస్ సినిమా ప్రస్తుతం థియేటర్లో ఉంది:

గతంలో ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేరిట ఉన్న సంస్థ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గా పేరు మార్చుకుంది. ప్రస్తుతం ఈ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న నారాయణ దాస్ నారంగ్ ఎవరో కాదు- ఇటీవల విడుదలై దియేటర్లలో నడుస్తున్న లవ్ స్టోరీ సినిమా నిర్మాతే. అయితే పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇచ్చిన మర్నాడు పేర్ని నాని పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ఇచ్చిన సమయంలోనే, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నారాయణదాస్ కాసేపట్లోనే స్పందిస్తాడని, ఆయనతో తాము ఇప్పటికే ఫోన్లో మాట్లాడామని, ఆయన ఎలా స్పందిస్తాడో చూద్దామని అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఫిలిం నగర్ లో – థియేటర్లో సినిమా నడుస్తున్న ప్రొడ్యూసర్ కాబట్టి ఆయనను భయ పెట్టో, మరో రకంగానూ వై ఎస్ ఆర్ సి పి పెద్దలు తమ దారిలోకి తెచ్చుకుని ఉంటారని, కాబట్టి ఆయన స్పందన వైఎస్ఆర్సీపీకి అనుకూలంగానే ఉండే అవకాశం ఉందని రూమర్లు వినిపించాయి. ఫిలింనగర్ లో వినిపించిన ఆ రూమర్లకు అనుగుణంగానే ఆయన లేఖ జగన్ కి మద్దతు ఇచ్చేలా ఉండడం గమనార్హం. ఇటీవలే సినీ పరిశ్రమకు చెందిన కొందరు వేరువేరు వేదికలపై పరిశ్రమ సమస్యలను ఏకరువు పెడుతూ మాట్లాడిన సంగతులు, వారి ఆవేదన తమకు తెలిసిందని అయితే ఇది పరిశ్రమ మొత్తానికి చెందిన అభిప్రాయంగా తీసుకోరాదని ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లేఖ లో ప్రత్యేకంగా ప్రస్తావించడం చూస్తుంటే వైఎస్సార్సీపీ పెద్దల ఒత్తిడి మేరకే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఈ లేఖ రాశారనే అభిప్రాయం విస్తృతంగా వినిపిస్తోంది.

సమస్యపై మాట్లాడితే మూలాల పై దాడి- వై ఎస్ ఆర్ సి పీ విధానం:

ఏది ఏమైనా ఒక సమస్య ప్రస్తావించబడినప్పుడు, సమస్య పరిష్కారానికి చొరవ చూపడం కంటే సమస్య లేవనెత్తిన వారి పై మాటల దాడికి, ఆర్ధిక మూలాల దాడికే వైయస్సార్ సిపి నేతలు చొరవ చూపుతారు అనే అభిప్రాయం చాలా కాలంగా ఉంది. గతంలో రోడ్లు దారుణంగా ఉండడం పై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ని ప్రశ్నించిన యువకుడు కొద్ది రోజులకే ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే వైన్ షాపుల్లో చీప్ క్వాలిటీ మద్యాన్ని అధిక ధరలకు అమ్ముతున్నారని వైన్ షాప్ ఎదురుగా సెల్ఫీ వీడియో తో తన ఆవేదన వ్యక్తం చేసిన మరొక యువకుడు అతి కొద్ది రోజుల్లోనే చనిపోయాడు. ఈ రెండు సంఘటనల సమయంలో వైఎస్ఆర్ సీపీ నేతల ఒత్తిడి వల్లే వీరు చనిపోయారన్న ఆరోపణలు వినిపించాయి. ఇలాంటి సంఘటనల కారణంగా, వైఎస్ఆర్సిపి నేతలను ఎవరు ప్రశ్నించినా సమస్య కి పరిష్కారం చూపడానికి బదులు వై ఎస్ ఆర్ సి పి నేతల నుండి ఒత్తిడులు దాడులు ఎదుర్కోవలసి వస్తుంది అన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. తాజాగా సినీ పరిశ్రమ సమస్యలపై గళమెత్తిన పవన్ కళ్యాణ్ పై కూడా వైఎస్సార్సీపీ నేతలు ముప్పేట దాడి చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా ఉన్న నారాయణ దాస్ సినిమా లవ్ స్టోరీ ప్రస్తుతం థియేటర్లలో నడుస్తూ ఉండగా, గతంలో వకీల్ సాబ్ సినిమా సమయంలో జగన్ ప్రభుత్వం ఆ సినిమాను అణచివేయడానికి తీసుకున్న చర్యలు కళ్ళముందు కనిపిస్తూ ఉండగా, నారాయణ దాస్ జగన్ కి మద్దతుగా ఆ లేఖ రాయడానికి వెనుక ఏం జరిగి ఉంటుంది అన్న విషయంపై తెలుగు ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉన్నట్లు గానే కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయ ఇన్నింగ్స్ !?

హైదరాబాద్ వెరీ వెరీ స్పెషల్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనతో తాము ఇప్పటికే సంప్రదింపులు జరిపామని చేరేందుకు అంగీకరించారని అంటున్నారు. సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి,...

ఆఫీసర్ “మమత” అంటే మజాకానా ?

తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాల్లోని ముఖ్య నేతలు టీఆర్ఎస్‌లో చేరి పదవులు అందుకున్న తర్వాత ఉద్యోగ సంఘాల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వం వచ్చింది. అలాంటి వారిలో టీజీవో అధ్యక్షురాలిగా ఉన్న మమత...

గంజాయి పట్టుకుంటున్న ఇతర రాష్ట్రాల పోలీసులు కుట్రదారులా !?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలే తేడాగా ఉంటోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ పోలీసుల్ని నమ్ముకుని అక్కడ డేటా చోరీ అంటూ అనేక రకాల కేసులు పెట్టించి ఏపీ అధికార పక్షాన్ని ఓ ఆట...

హైకోర్టులో జగన్ అండ్ కో పిటిషన్ల రోజువారీ విచారణ!

అక్రమాస్తుల కేసుల విచారణను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారంటూ జగన్ తో పాటు ఆయన సహ నిందితులపై చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరు కింది కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు...

HOT NEWS

[X] Close
[X] Close