బిహార్ లో ఎవరుగొప్ప ?

(సంభాషణ)

బిహార్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల గందరగోళ సరళిని టివీల్లో చూసిచూసి తలనొప్పి తెచ్చుకున్నాడు జంబులింగం. సరిగా అప్పుడే వచ్చాడు వెంగళప్ప. వస్తూనే…

`బావా, బిహార్ లో ఎవరు గొప్ప ?’ అని అడిగేశాడు.

`అసలే ఎగ్జిట్ పోల్స్ చూసిచూసి నానా టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ ప్రశ్నేమిటిరా వెంగళప్ప’

`అదే బావా. ఇందాక రామాలయం రచ్చబండ దగ్గర మనోళ్లు మాట్లాడుతుంటేనూ…’

`మనోళ్లు అనకు, నాకు చిర్రెత్తుకొస్తుంది. నీ వాళ్లు, నీ మఠా అను. మధ్యలో నన్ను కలపకు’

`సర్లే బావా, నేచెప్పేది కాస్తవిను. ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి కదా, కానీ అక్కడ ఏ పార్టీ నేతల్లో కూడా ఆనందం లేదంటగా…ఎందుకని బావా..? ‘

`ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అలా ఏడ్చాయి మరి. ఏడు న్యూస్ ఛానెల్స్ లో ఏడు రకాలుగా చూపించార్రా. అవన్నీ చూసి నేనో కన్ క్లూజన్ కి వచ్చా ‘

`ఏంటది బావా’

`ఈసారి ఇలాంటివి చూసేటప్పుడు ఓ నాలుగు జండూబామ్ బాటిల్స్ దగ్గరపెట్టుకోవాలని’

`భలే బావా భలే. కాస్త లేటుగా అయినా జ్ఞానోదయం అయింది. పోలింగ్ అనంతర అంచనాలు టీవీల్లో వచ్చేసినా అదేంటీ బావా పాట్నాలోని బిజెపీ కార్యాలయం వద్ద సందడి తగ్గలేదట’

` ఒక్క న్యూస్ చాణక్య తప్ప మిగతావాళ్లంతా ఏదో జట్టుకట్టేసినట్టు ఎన్ డీఏ కూటమికి ఎక్కువ స్థానాలు ఇవ్వలేదుగా. అందుకే మరీ సందడిగా ఉండిఉండదులే. అయినా బీజేపీ వాళ్లలో ఆత్మవిశ్వాసం పూర్తిగా అడుగంటలేదురా ‘

`మరి, లాలూప్రసాద్ నాయకత్వంలోని ఆర్ జెడీ పార్టీ ఆఫీస్ మరీ చీకట్లోనే మగ్గిందటగా, నితీశ్ నడుపుతున్న జేడీయు ఆఫీసు భయంకరమైన నిశ్శబ్దంలో మునిగిపోయిందటగా… నా స్నేహితుడొకడు బిహార్ నుంచి ఫోన్ చేసి చెప్పాడులే…’ తనకు జాతీయస్థాయిలో నెట్ వర్క్ ఉన్నట్లు ఫోజిస్తూ అన్నాడు వెంగళప్ప.

`అబ్బో, నీకు చాలా విషయాలు తెలుస్తున్నాయిరా. మరి దీని అర్థమేమిటంటావూ?’ కుతూహలం ఆపుకోలేక అడిగాడు జంబులింగం.

`ఇంకా నీకు అర్థంకావడంలేదా బావా… ఎగ్జిట్ పోల్స్ మీద పార్టీల వారికి నమ్మకం పోతున్నట్లుంది. పైకి చూస్తున్నప్పుడు లౌకిక మహాకూటమే విజయం సాధిస్తుందని అనిపిస్తున్నా, ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కలిపిచూస్తే ఏదో గందరగోళ పరిస్థితి ఏర్పడినట్లే ఉంది. దీంతో ఎవ్వరికీ ధైర్యం చిక్కడంలేదన్నమాట’ రేపోమాపో టివీలో ఎనలిస్ట్ కావాలనుకుంటున్న వెంగళప్ప గడగడా చెప్పేశాడు.

`అవున్లే… ఎగ్జిట్ పోల్స్ చూసి చిన్నాచితకా నాయకులు స్పందిస్తున్నారేకానీ, ఇటు అమిత్ షా గానీ, అటు నితీశ్ కుమార్ గానీ పెదవి విప్పడంలేదు. ఎవరి అంచనాలు వారికున్నాయి. దింపుడు ఆశ ఉంటుందిగా మరి…’ అన్నాడు జంబులింగం.

`నువ్వు చెప్పింది నిజమే బావా, ఓట్ల లెక్కింపు తర్వాతనే బిజెపీ అధ్యక్షుడు మాట్లాడతారట, ఇక నితీశ్ గారేమో తన మనోభావాలను ఇనప్పెట్టెలో ఉంచి తాళం వేసినట్లున్నారు. లాలూసారే తమ కూటమికి 190దాకా సీట్లు వస్తాయని తనదైన శైలిలో నవ్వుతూ ఈజీగా చెప్పేస్తున్నారట’

`ఆఖరి విడత పోలింగ్ సరళి బిజెపీని గడగడలాడించిందిరా…ఐదవ దశ పోలింగ్ 57 సీట్లకు జరిగితే దాదాపు 60శాతం ఓట్లు పోలయ్యాయి. మిగతా వాటితో పోలిస్తే ఇది ఎక్కువేరా అబ్బీ. నీకో విషయం చెప్పనా…’ తానకూ బిహార్ విశేషాలు తెలుస్తున్నాయన్నట్లు చెప్పబోయాడు జంబులింగం.

`నాకు తెలుసు బావా నువ్వేమి చెబుతావో, రచ్చబండకాడ మనోళ్లు చెప్పుకున్నార్లే. చివరి దశ పోలింగ్ జరిగిన చోట్ల ఎక్కువ మంది ముస్లీంలు, యాదవులు ఉన్నారట. వారిలో ఎక్కువ శాతం మంది మహాకూటమికే ఓటు వేసే అవకాశం ఉండటంతోనే బిజెపీ తోకజాడించిందటగా…’ వెంగళప్ప మరోసారి తన ప్రతాపం చూపించేప్రయత్నం చేశాడు.

`పాపం బిజెపీని చూస్తే జాలేస్తుందిరా వెంగళప్ప. ఆ చాణక్య వాళ్లు కూడా లేకపోతే మోదీగారు ముఖం ఎక్కడ పెట్టుకునేవారో…. ‘

`బావా మావోళ్లు అంటున్నారూ… చాణక్య ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నమ్మలేమని. ‘

`ఎందుకనట్రా…’ ఆతృతగా అడిగాడు జంబులింగం.

`ఆమాత్రం కూడా తెలియదా బావా నీకు. 2012లో చాణక్య సర్వే గ్రూప్ పప్పులో కాలేసింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ ని పైకెత్తేసింది, క్రిందటేడాది జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు 81 సీట్లకు గాను 61 సీట్లు బీజేపీ గెలుచుకుంటుందని లెక్కలేసి చెప్పింది. మిగతావాళ్లేమో పోరు హోరాహోరీగా తేల్చిపారేశారు ‘ వెంగళప్ప విశ్లేషణలో జోరుపెంచాడు.

`అవున్రోయ్. నాకూ గుర్తుకొస్తోంది. ఆ ఎన్నికల్లో బిజెపీ తన మిత్రపక్షాలతో కలిపి ముక్కీమూలిగీ 43సీట్ల తెచ్చుకుంది కదరా.. ‘ జంబులింగం తనకూ తెలుసన్నట్టు చెప్పాడు.

`అవును బావా, సరిగానే చెప్పావు. ఇప్పుడేమో బిహార్ లో ఎన్డీయే కూటమికి 155 సీట్లదాకా రావచ్చని అంటుందిగా చాణక్య . గత అనుభవాల దృష్ట్యా ఇప్పుడు బీజేపీ ఆలోచనలో పడింది బావా ‘ నాకంతా తెలుసన్నట్టు కాలరెగరేశాడు వెంగళప్ప.

`ఛ, అన్నీ తెలిసినప్పుడు నా దగ్గరకు ఎందుకు వచ్చావురా.. నా తలనొప్పి ఇంకాస్త పెంచడానికా…’ చిరాకుపడ్డాడు జంబులింగం.

`అదికాదు బావా, బిహార్ లో ఎవరు గొప్పో తెలుసుకుందామని?’ అంటూ నసుగుతూ, బావని కూల్ చేసే పనిలో పడ్డాడు వెంగళప్ప.

`మళ్లీ అదేమీ తిరకాసురా వెంగళప్ప. నువ్వు చూడటానికి మెతగ్గానే ఉన్నా, నా బుర్ర తింటున్నావు కదరా… ‘

`మూడు నెలల క్రిందటే, అంటే ఎన్నికల ప్రచార సభలు ప్రారంభంకాకముందే ప్రీ -పోల్ సర్వేలు వెలువడ్డాయి కదా…’ గుర్తుచేశాడు వెంగళప్ప.

`అవున్రోయ్. ఈ ఓపీనయన్ పోల్స్ లో ఎక్కవ భాగం హోరాహోరీ పోరు ఉంటందనే తేల్చాయికదా.’ గుర్తుచేసుకుంటూ అన్నాడు జంబులింగం.

`కదా మరి, కొన్నేమో స్వల్ప ఆధిక్యతతో మహాకూటమి గెలుస్తుందని చెబితే, మరికొన్నేమో ఎన్డీయే స్వల్ప ఆధిక్యతతో గట్టెక్కుతుందని చెప్పాయి. మరి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్ని జాగ్రత్తగా చూస్తే ఏమనిపిస్తోంది…? ‘

`ఏముందిరా, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు గడిబిడిగా ఉన్నాయి. చివరకు ఓట్ల లెక్కింపు పూర్తయితేగానీ ఏమీ చెప్పలేమన్నట్లుగా తయారైంది వ్యవహారం’ చెప్పాడు జంబులింగం.

`అంటే, ఓపీనియన్ పోల్సప్పడు పరిస్థితి ఎలా ఉందో, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడైనప్పుడు అలాగే ఉందన్నమాట. ఇస్కా ఆర్థ్ క్యాహై ?’

`ఏడ్చావులే మధ్యలో హిందీఒకటి… ఏముందీ ఓటర్లు మారలేదన్నమాటగే ‘ తేల్చిపారేశాడు జంబులిగం.

`అదే బావా నా ప్రశ్న. బీహార్ లో ఎవరు గొప్ప ? మూడు నెలలుగా అన్ని పార్టీల వాళ్లు ఓటర్ల చెవులు చిల్లులుబడేలా ప్రచారం చేసినా ఓటర్ తన మనసు మార్చుకోలేదనేగా అర్థం.. మరి అలాంటప్పుడు ఎవరుగొప్పంటావు?’ మళ్లీ అడిగాడు వెంగళప్ప.

`ఓరే వెంగళప్పా. చిన్నవాడవైనా మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. నీ బుర్ర పాదరసం. ఇప్పుడర్థమైంది రా నీ ప్రశ్న. బిహార్ లో ఓటరే గొప్ప. వాడే స్మార్ట్ . ఎంతమంది ఎన్ని చెప్పినా వాడి మనసు ఎప్పుడో మూడు నెలల క్రిందటే ఫిక్స్ అయిందన్నమాట.’

`అవును బావా, అంతేకాదు, ఓటర్ల తెలివిని రాజకీయనాయుకులు సరిగా అంచనావేయలేకపోయారు. ఎన్నో ప్రచార అస్త్రాలు తీశారు. గొడ్డుమాంసం అన్నారు. రిజర్వేషన్లని ఊరించారు. కమండలమనీ, పాకిస్తాన్ లో దీపావళనీ, సైతాన్ , డిఎన్ ఏ అనీ దేన్నీ వదిలిపెట్టకుండా వాడేశారు. చివరకు మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలు కూడా ప్రభావితం చూపలేకపోతున్నాయనే అనుకోవాలి. ప్రచారంలో వందలకోట్లు తగలేశారు. మీడియా కూడా కంటిమీద కునుకులేకుండా నానాహడావుడిచేసింది ‘ సూపర్ ఎనలిస్ట్ గా మాట్లాడసాగాడు వెంగళప్ప.

`జన నాడిని అర్థం చేసుకునే విషయంలో నాయకులేకాదు, చివరకు మీడియావాళ్లు, పేరుమోసిన విశ్లేషకులు కూడా బోల్తాపడుతున్నార్రా…’

`అందుకే బిహార్ లో వీరందరికంటే ఓటరే గొప్ప. స్మార్ట్ ఓటర్ కి వందనాలు… ‘ అన్నాడు వెంగళప్ప నడన్ గా లేచినిలబడి ఎటెన్షన్ లోకి వచ్చేశాడు.

`ఆదివారం స్మార్ట్ ఓటర్స్ డే గా ప్రకటిద్దాం, రిజల్ట్స్ వచ్చే రోజు అదేకదా.. ‘ జంబులింగం కూడా రెట్టింపు ఉత్సాహంతో అన్నాడు.

`అవును బావా, ఆరోజు స్మార్ట్ ఓటర్ల దీపావళి. రచ్చబండదగ్గరకు ఆరోజు రా బావా. మనోళ్లంతా…’ అంటూ నాలుక కరచుకుని నెమ్మదిగా అక్కడినుంచి జారుకున్నాడు వెంగళప్ప.

వెంగళప్ప వాగ్దాటి ప్రభావం నుంచి జంబులింగం వెంటనే బయటపడలేకపోయాడు. నోరెళ్లబెట్టి ఏదో ఆలోచనలో పడ్డాడు.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close