అమరావతిపై అసురుల కుట్రలు మాత్రం అన్ లిమిటెడ్. ఎదో ఒకటి చేయకపోతే వారికి మనశ్శాంతిగా ఉండదు. ప్రధాని మోదీ ఓ వైపు అమరావతి ఓ శక్తి అని చెబుతున్న సమయంలో.. ఆయన సభకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పైపులకు దుండగులు నిప్పు పెట్టారు. గడ్డి పరకలు అయితే ఎండకు కాలిపోతాయేమో కానీ పైపులు కాలతాయా?. అదీ కూడా సభ జరుగుతున్న సమయంలో పెద్ద ఎత్తున పొగలు వచ్చేలా కాల్చారు.
పైపులపై పెట్రోల్ పోసి కాల్చేశారని సులువుగానే అర్థమైపోతుంది. ప్రధాని సభకు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఐదు కిలోమీటర్ల వరకూ నిఘా పెట్టారు. అయితే నిఘా లేని చోట.. అమరావతి పైపులు ఉన్న చోట చూసి నిప్పు పెట్టిపోయారు. ఆ మంటలు ఎంత వేగంగా పెరిగాయంటే.. వెంటనే సిబ్బంది వచ్చినా ఆగలేదు. అక్కడే అసలు కుట్ర అర్థమైపోతుంది.
గతంలో అరటితోటలకు నిప్పు పెట్టారు కొందరు. తర్వాత వాళ్లు లీడర్లు అయిపోయారు. ఇప్పుడు నిప్పు పెట్టడానికి అరటి తోటలు లేవని.. అమరావతి నిర్మాణం కోసం తీసుకు వచ్చిన పైపులకు నిప్పు పెట్టారు. రాబోయే రోజుల్లో ఈ అసురులు సొంత రాష్ట్ర రాజధానిపై ఎన్ని కుట్రలు చేస్తారో కానీ.. వారిని ఇప్పుడే నలిపేయకపోతే తర్వాత విశ్వరూపం చూపిస్తారు.