డీజీ టిల్లు ఇచ్చిన జోరుకి జాక్ అడ్డుకట్ట వేసింది. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ నుంచి మరో కొత్త సినిమా ముస్తాబౌతోంది. స్టైలిస్ట్ నీరజా కోన తొలిసారి మెగాఫోన్ పట్టుకుంది. వీరిద్దరి కాంబినేషన్ లో తెలుసు కదా సినిమా రెడీ అవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. థమన్ మ్యూజిక్. తాజాగా ఈ సినిమా నుంచి మల్లికా గంధ పాటని రిలీజ్ చేశారు.
తమన్ మంచి మెలోడీ చేసి చాలా కాలమైయింది. ‘కళావతి’ పాట తర్వాత మళ్ళీ అంతటి వైరల్ మెలోడీ రాలేదు. ఇప్పుడు తెలుసు కదా కోసం ఆ దారిలో ఓ ట్యూన్ ప్రయత్నించాడు. సిద్ శ్రీరామ్ తో పాడించారు. ట్యూన్ క్యాచి గానే వుంది. సిద్ధు, రాశీ ఖన్నా కెమిస్ట్రీ కొత్తగా అనిపించింది.
ఆకాశం అందిందా
నేలంతా నవ్విందా
ఉన్నట్టుండి ఏదో మారిందా
ఎంతెంత చూస్తున్నా
ఇంకాస్త లోతుందా
కన్నుల్లో నింపే వీలుందా
నీ నీతోనే సాగే నక్షత్రాల దారే నచ్చిందే
ఎంత ఎంతో హోరే రేపే నీలా వచ్చిందే
మాంగళ్యం కట్టే సమయం
ఏడడుగులతోనే పయనం
ఈ నిమిషం కోసం మనసే నాదే వేచి ఉన్నది
నచ్చేస్తుందే నచ్చేస్తుందే నీతో ఉండే ప్రతి క్షణమే
నచ్చేస్తుందే నచ్చేస్తుందే అంతేలేని అతిశయమే..
ఇలా సాగింది కృష్ణకాంత్ సాహిత్యం. ఈ రోజుల్లో ప్రమోషన్స్ కి పాటలు కీలకం. ఈ పాటని కాస్త గ్రాండ్ గానే ప్లాన్ చేశారు. పాట జనాల్లోకి వెళ్ళగలిగితే మాత్రం తెలుసుకదా చుట్టూ కొంత బజ్ వస్తుంది. దీపావళికి రిలీజ్ పెట్టుకున్నారు.