క‌మ‌న్‌.. కమాన్‌… డాన్స్ ‘బ్రో’

ఈరోజు ‘బ్రో’ నుంచి తొలి పాట రాబోతోంది. మై డియ‌ర్ మార్కాండేయ అంటూ సాగే గీతాన్ని ఈరోజు సాయింత్రం రిలీజ్ చేయ‌బోతున్నారు. ”క‌మాన్ క‌మాన్ డాన్స్ బ్రో.. జూక్ బాక్స్ ఫుల్ బ్రో ” అంటూ ట్రెండీ ప‌దాల‌తో ఈ లిరిక్ సాగ‌బోతోన్న‌ట్టు టాక్. ఇదే పాట‌లో ఊర్వ‌శీ రౌటాలా కూడా క‌నిపించ‌బోతోంది. సింపుల్ స్టెప్పుల‌తో ప‌వ‌న్‌, తేజ్‌… అభిమానుల్ని అల‌రించ‌డానికి రెడీ అయిపోయారు. త‌మ‌న్ అందించిన ట్యూన్‌, సెట్స్‌, ప‌వ‌న్‌, తేజ్‌ల కాస్ట్యూమ్స్ అన్నీ అదిరిపోయాయ‌ని తెలుస్తోంది. బ్రో సినిమాలో పాట‌ల‌కు ఛాన్స్ చాలా త‌క్కువ‌. ఉన్న‌దాంట్లోనే ప‌వ‌న్ ఫ్యాన్స్ ని ఎలా మెప్పించాలా? అనే దిశ‌గా చిత్ర‌బృందం పెద్ద క‌స‌ర‌త్తులే చేసింది. ప‌బ్ పాటే అయినా, ఊర్వ‌శీ రౌతాలా లాంటి ఐటెమ్ గాళ్ ఉన్నా… ఈ పాట‌ని చాలా ప‌ద్ధ‌తిగానే ప్ర‌జెంట్ చేన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే బ్రో నుంచి టీజ‌ర్ వ‌చ్చేసింది. ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి ఈ టీజ‌ర్ పిచ్చ పిచ్చ‌గా న‌చ్చేసింది. టీజ‌ర్‌తోనే ఈ సినిమాపై అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. ఈ పాట అందుకు మ‌రింత ఊతం ఇవ్వ‌బోయేలా ఉంద‌ని టాక్‌. ఈనెల 28న బ్రో విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే. స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ సంభాష‌ణ‌లు అందించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close