ముగ్గురు ఎన్టీఆర్‌లు.. ఐదుగురు హీరోయిన్లు

జై ల‌వ‌కుశ‌లో ఎన్టీఆర్ తొలి సారి త్రిపాత్రాభినయం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ముగ్గురు ఎన్టీఆర్‌లు కాబ‌ట్టి ముగ్గురు హీరోయిన్లు ఉండాల్సిందే అనేది లెక్క‌. అయితే ముగ్గురు కాదు… ఈ సినిమాలో మొత్తం న‌లుగురు హీరోయిన్లు ఉన్నారు. ఇప్ప‌టికే ఓ క‌థానాయిక‌గా రాశీఖ‌న్నాని తీసుకొన్నారు. రెండో క‌థానాయిక ఛాన్స్ నివేదా ధామ‌స్ కి ద‌క్కింది. పొడుగు కాళ్ల సుంద‌రి హంసానందిని మ‌రో క‌థానాయిక‌గా క‌నిపించ‌నుంద‌ట‌. వీళ్ల‌తో పాటు ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ ఫేమ్ నందిత ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ద‌ని తెలుస్తోంది. నందిత‌ది చిన్న పాత్రే అని.. గెస్ట్ అప్పీరియ‌న్స్ అని స‌మాచారం. అంతే కాదు.. ఓ ప్ర‌త్యేక గీతంలో మ‌రో క‌థానాయిక మెర‌వ‌బోతోంద‌ట‌. అంటే… ముగ్గురు ఎన్టీఆర్‌ల‌కు ఐదుగురు హీరోయిన్ల‌న్న‌మాట‌.

అన్న‌ట్టు ఈ సినిమాలో స‌మంత‌ని క‌థానాయిక‌గా ఎంచుకొన్నార‌న్న ప్ర‌చారం జోరుగా సాగింది. కొంద‌రైతే… స‌మంత‌ది ఇందులో నెగిటీవ్ ట‌చ్ ఉన్న పాత్ర అని, ఎన్టీఆర్‌తో ఓ ఆట ఆడేసుకొంటుంద‌ని కూడా రాశారు. అయితే అదంతా తూచ్ అని తెలుస్తోంది. ఈసినిమాలో అస‌లు స‌మంత‌నే లేద‌ని, ఆమెను ఎవ్వ‌రూ సంప్ర‌దించ‌లేద‌ని `జై ల‌వ‌కుశ‌` టీమ్ చెబుతోంది. సో.. ఎన్టీఆర్ – స‌మంత కాంబోని `జై ల‌వ‌కుశ‌`లో చూసే అవ‌కాశం లేద‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com