బాల‌కృష్ణ ‘గ‌జిని’గా మారాడా?

రూల‌ర్ మ‌రి కొద్ది గంట‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని మ‌లిచారు. యాక్ష‌న్‌కి పెద్ద పీట వేశారు. కె.ఎస్‌.ర‌వికుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఇందులో అల‌వాటు ప్ర‌కారం బాల‌య్య రెండు, మూడు గెట‌ప్పుల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. ఓ గెట‌ప్ స్టైలీష్‌గాఉంటే, మ‌రోటి మాస్ లుక్‌తో డిజైన్ చేశారు. మూడో గెట‌ప్ కూడా ఉంద‌ని బాల‌య్య చెబుతున్నాడు.

ఇందులో బాల‌య్య ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్ సీఈఓగా క‌నిపించ‌బోతున్నాడు. మ‌రో పాత్ర పోలీస్ అధికారిగా. అయితే.. ఈ క‌థ‌లో `గ‌జిని`ల‌క్ష‌ణాలు కొన్ని ఉన్నాయ‌ని తెలుస్తోంది. సీఈఓని చంపాల‌ని కొంత‌మంది ప్ర‌య‌త్నించ‌డం, అందులో భాగంగా ప్ర‌మాదం జ‌రిగి, బాల‌య్య గ‌తాన్ని మ‌ర్చిపోవ‌డం క‌థ‌లో కీల‌క‌మైన అంశ‌మ‌ట‌. బాల‌య్య గ‌తం మ‌ర్చిపోవ‌డం ఇదేం కొత్త కాదు. గ‌తంలో ల‌య‌న్‌లోనూ ఇలాంటి క‌థే వండారు. ఇప్పుడు మ‌ళ్లీ గ‌తం మ‌ర్చిపోవ‌డం, మ‌ళ్లీ గుర్తుకురావ‌డం అనే కాన్సెప్ట్ ప‌ట్టుకున్నారు.నిజానికి గ‌జిని త‌ర‌వాత ఈ టైపు క‌థ‌లు చాలామంది వండి వార్చేశారు. బాల‌య్య మ‌ళ్లీ అదే క‌థ ఎలా ప‌ట్టుకున్నాడో. క‌థ అదే అయినా, ట్రీట్‌మెంట్ వేరుగా ఉంటే జ‌నానికి ప‌ట్టేయొచ్చు. మ‌రి కె.ఎస్‌.ర‌వికుమార్ ఎలా తీశాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close