మబ్బుల్లో మహానగరం

ఇంద్రుడి రాజధాని అమరావతి. ఇది మబ్బుల్లో తేలియాడుతూ ఉంటుందని పాత తెలుగు సినిమాలు చూసిన నాబోటివాళ్ల స్ట్రాంగ్ ఫీలింగ్. అయితే నిజంగా మేఘాల్లో తేలియాడుతూ నగరాలు ఆకాశంలో ఎలా నిలిచి ఉంటాయి? అవి క్రిందపడిపోవా…?? భూమ్యాకర్షణ సిద్ధాంతం ఇంద్రుడి నగరానికి వర్తించదా ఏంటీ ? ఇలాంటి డౌట్స్ నాకు చిన్నప్పుడు రాలేదు. కానీ, ఈమధ్య టివీలో ఓ పౌరాణిక చిత్రం చూస్తుంటే ఈ డౌట్సన్నీ హఠాత్తుగా వచ్చేశాయ్. సినిమాలో నారదుడు గాలిలో నడుచుకుంటూ గాలిలో తేలియాడే నగరానికి వెళతాడు. రాజధాని ముఖద్వారం దగ్గర మేఘాలు అటూఇటూ పోతుంటాయి. నారదుడు లోపలకు వెళితే అప్పుడు తెలిసింది…అది ఇంద్రసభ అనీ, ఆ నగరమే అమరావతి అని.

సరే, ఇప్పుడు గాల్లో తేలియాడే అమరావతి నగర ప్రస్తావన తీసుకురాగానే మీకు ఏపీ రాజధాని అమరావతి గుర్తుకొచ్చే ఉంటుంది. నిజానికి నేను ప్లానింగ్ లో ఉన్న అమరావతి గురించి చెప్పడంలేదు. కానీ ఒక లింక్ మాత్రం ఉంది. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి హడావుడి పడుతున్నప్పుడే పొరుగుదేశాల్లో ఒకటైనా చైనాలో ఓ వింత చోటుచేసుకోవడమే ఈ లింక్.

చైనాలోని గాన్గ్ డాంగ్ ప్రావెన్సీలోని ఫోషన్ అనే పట్టణం ఉంది. ఈ నగరం పెరల్ నది వొడ్డున ఉంది. కొద్దిరోజుల క్రిందట అంటే అక్టోబర్ 16న నగరవాసులు ఆకాశంలో ఓ వింత చూసి ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే మేఘాల్లో ఓ నగరం తేలియాడుతూ కనిపించింది. `అరే, ఇదేంటీ, ఆకాశంలో నగరం తేలియాడుతోంది !’ అంటూ తెగ ఆశ్చర్యపోయారు. నమ్మశక్యంగాని విధంగా మేఘాల్లో బహుళ అంతస్థులున్న భవనసముదాయం కనిపించింది. వాటిలో కొన్ని మరీ పెద్దవి, మరికొన్నేమో తక్కువ ఎత్తువి. వెంటనే కొంతమంది ఔత్సాహికులు ఈ తేలియాడే నగరాన్ని తమ కెమేరాల్లో బంధించారు. వీడియోకూడా తీశారు. ఇక నమ్మకేం చేస్తాం. నమ్మితీరాల్సిందే ఎవరైనా. కనిపించింది నిజం. కాకపోతే కారణం ఏమిటన్నదే ఇక ఆలోచించాలి.

విపత్తు

తలెత్తి పైకి చూస్తే, నీలాకాశంలో మేఘాల మాటునుంచి ఒక నగరం కదలివెళ్ళడం నగరవాసులు చూశారు. `ఇదేమీ వింత’ అంటూ ఉలిక్కిపడ్డారు. కొంతమంది కంగారుపడిపోయి మూర్ఛపోయారు. ఏదో పెద్ద విపత్తు రాబోతున్నదని మరికొంతమంది లెక్కలుగట్టి తేల్చిచెప్పారు. ఇదేదో గ్రహాంతరవాసుల పనేనని ఇంకొందరు తేల్చిపారేశారు. అయితే ఈ ఆకాశ నగరం ఎంతోసేపు ఆకాశవీధిలో కనిపించలేదు. కొద్దినిమిషాల తర్వాత ఎలా వచ్చిందో అలా మాయమైపోయింది.

గ్రహాంతవాసుల దాడి

ఫోషన్ నగరవాసులకు ఈ దృగ్గోచరం కొత్తేమోకానీ, చైనాకు మాత్రం ఇది కొత్తేమీకాదు. గతంలో కొన్నిసార్లు ఇలాగే ఆకాశంలో తేలియాడే నగరాలు కనిపించి మాయమైపోయి. ఆకాశంలో ఎక్కడ ఏవింత జరిగినా గ్రహాంతరవాసులమీదనే మన దృష్టిమళ్లుతుంది. చాలాకాలం నుంచి మనభూమిపై గ్రహాంతరవాసులు కన్నేశారని అనుకుంటూనే ఉన్నాం. అందుకుతగ్గట్టుగానే పలుచోట్ల ఫ్లైయింగ్ సాసర్స్ కనిపించడం, విచిత్ర ఆకారాలు గోచరమవడం వంటివి జరిగినట్లు చెప్పుకుంటారు. మరి ఆకాశనగరం కూడా ఇలాంటిదేనా? మన భూమిపై గ్రహాంతరవాసులు నిత్యం నిఘా పెడుతున్నారనీ, అందుకే ఆకాశంలో ఇలాంటి వింతలు జరుగుతున్నాయని కొందరంటున్నారు. ఎప్పుడో అదునుచూసి గ్రహాంతరవాసులు దాడికి దిగుతారన్న అభిప్రాయం బాగా పాతుకుపోయింది.

అమెరికా చేష్టలు

చైనాలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం ముందుగా వారి చూపు అమెరికా వైపే పడుతుంది. చైనాఅంటే గిట్టదుకనుక,అగ్రరాజ్యమైన అమెరికానే ఇలాంటి పనులు చేయిస్తుందన్నది వారి వాదన. నాసావాళ్లు హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ వల్లనే ఇలాంటి వింతలు ఆకాశంలో ఆవిష్కృతమవుతున్నాయనీ అంటున్నారు. నాసా కూడా గ్రహాంతరవాసుల గురించి ఆరాతీస్తూనేఉంది. గ్రహాంతరవాసులకు హెచ్చరికగా ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటుందన్నది కొందరి అభిప్రాయం. మరో వాదనఏమంటే, అమెరికా, గ్రహాంతరవాసులు కలిసి చైనామీద దాడిజరపడానికి ప్రయత్నిస్తున్నారన్నది. ఇంకొంతమందేమో చైనా శాస్త్ర, సాంకేతిక విభాగం వాళ్లు అత్యంత రహస్యంగా ఇలాంటి ప్రయోగాలు వెలగబెడుతుంటారని సర్దిచెప్పుకున్నారు.

అంతా భ్రాంతియేనా…

అయితే, శాస్త్రవేత్తల అభిప్రాయం వేరుగాఉంది. ఆకాశ నగరం ఎర్పడం ఒక ఆప్టికల్ ఇల్యూషన్ (భ్రాంతి) లాంటిదేనట. ఈ తరహా ఇల్యూషన్ ని `ఫాటా మోర్గనా’ అంటారు. ఇది ఎడారిలో నీటిమడుగులున్నట్లు అనిపించడం లాంటిదన్నమాట. ఫాటా మోర్గనా అనే ఈ భ్రాంతి గాఢమైన శీతలగాలులు పైనఉండే వేడిగాలి పొరలతో మిళితమైనప్పుడు ఇలాంటి విచిత్రమైన ఆకారాలు ఏర్పడే అవకాశం ఉంటుంటుంది. ఇలాంటి ఇల్యూషన్స్ నీటిపై తరచూ ఏర్పడుతుంటాయి. సముద్రం, లేదా నది ఒడ్డున నిలబడి చూస్తున్నప్పుడు ఆవల ఏదో నౌక పోతున్నట్లో, లేదా నది మధ్యలో కొండలు ఉన్నట్లో మనకు అనిపించవచ్చు. అయితే ఇదంతా భ్రాంతి మాత్రమే. ఇల్యూషన్ ఎఫెక్ట్ కలిగించే ఫోటోలు ఆ మధ్య మొబైల్ ఫోన్లలో హల్ చల్ చేశాయి. డ్రెస్ బ్లూకలర్ లో ఉన్నదా, వైట్ గా ఉన్నదా అన్నది ప్రశ్న. ఎవరి ఆలోచనలకు తగ్గట్టుగా వారికి ఆ రంగు కనిపిస్తుండటం ఈ ఇల్యూషన్ ఫోటో ప్రత్యేకత. మరో రకంగా చెప్పాలంటే ఇది బ్రెయిన్ ఆడే నాటకంలాంటిది. దీంతో వివిధ ప్రాంతాలవారికి విభిన్నమైన ఆకారాల్లోనూ, రంగుల్లోనూ కనిపించవచ్చు.

అయినప్పటికీ ఇలాంటి దృశ్యాలు కనిపించినప్పడు వదంతులు వ్యాపించడం సహజం. ఎన్నో అనుమానాలు తలెత్తడం అంతకంటే సహజం. చైనాలో ఆకాశ నగర దృగ్గోచరంలోనూ అదే జరిగింది.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పార్టీ మారడం లేదని తేల్చేసిన పర్చూరు ఎమ్మెల్యే..!

వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరిగిన పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎట్టకేలకు స్పందించారు. తన నియోజకవర్గంలోని క్యాంప్ ఆఫీసులో కార్యకర్తలతో సమావేశం అయిన ఆయన.. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు....

జుంబారే… మ‌న‌వ‌డు వాడేశాడురోయ్

సూప‌ర్ హిట్ పాట‌ల్ని రీమిక్స్ చేసి వినిపించ‌డం మ‌న ఇండ‌స్ట్రీకి కొత్తేం కాదు. అయితే ఎక్కువ‌గా స్టార్ల వార‌సుల సినిమాల కోస‌మే ఆ ప్ర‌య‌త్నాలు జ‌రుగుతుంటాయి. సినిమాల ప్ర‌మోష‌న్‌కి ఆ...

బాలయ్య కోసం చిన్నికృష్ణ

నే‌టి ట్రెండ్‌ని... నేటి ప్రేక్ష‌కుల నాడిని ప‌ట్ట‌లేక కెప్టెన్ కుర్చీకి దూర‌మైన సీనియ‌ర్ ద‌ర్శ‌కులు చాలామందే. ఒక‌ప్పుడు అగ్ర ద‌ర్శ‌కులుగా వెలిగిన వాళ్లంతా కూడా ఆ త‌ర్వాత ప్రాభవాన్ని కోల్పోయారు....

ఆంధ్రా నేతలపై వైరల్ అవుతున్న “హరీష్ సాల్వే” వ్యాఖ్యలు..!

భారత దేశంలో అత్యంత ప్రముఖ న్యాయనిపుణుల్లో ఒకరిగా ఉన్న హరీష్ సాల్వే.. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. న్యాయవ్యవస్థను కించ పరుస్తున్న నేతలకు గుణపాఠం నేర్పాల్సిందేనని ఆయన పిలుపునిచ్చారు....

HOT NEWS

[X] Close
[X] Close