‘సైరా’లో అన్నీ ‘ఆటైపు’ పాట‌లే!

‘సైరా న‌ర‌సింహారెడ్డి’ టీజ‌ర్‌తో మెగా ఫ్యాన్స్‌లో పూన‌కాలు మొద‌లైపోయాయి. టీజ‌రే ఇలా ఉంటే.. సినిమా ఇంకా ఏ రేంజులో ఉంటుందో అంటూ ఊహ‌ల ప‌ల్ల‌కిలో ఊరేగుతున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అది… `సైరా` సంగీతం గురించి. ఇందులో పాట‌లు చాలా త‌క్కువ‌గా ఉంటాయ‌ని తెలుస్తోంది. ఉన్న పాట‌లు కూడా పూర్తిగా జాన‌ప‌ద శైలిలో సాగుతాయ‌ని స‌మాచారం. రాయ‌ల‌సీమ మాండ‌లికంలో ఓ పాట ఉంటుంద‌ని, ఓ పాట పూర్తిగా ఫోక్ బీట్ తో సాగుతుంద‌ని, నేప‌థ్య గీతాల‌కు త‌ప్ప‌.. దాదాపుగా బృంద గానాల‌కు ఎక్క‌డా చోటు లేద‌ని తెలుస్తోంది. అత‌నికి ఇద్ద‌రు భార్య‌లు. ఈ నేప‌థ్యంలో ఓ ప్రేమ గీతానికీ చోటు ద‌క్కుతుంద‌ని స‌మాచారం. బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు అమిత్ త్రివేదీ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే ట్యూన్లు సిద్ధ‌మైపోయాయ‌ని స‌మాచారం. నేప‌థ్య సంగీతానికి చాలా స్కోప్ ఉన్న సినిమా ఇది. ఆ విష‌యంలో ఆరితేరిపోయినందుకే అమిత్ త్రివేదిని ఈ సినిమా కోసం ఎంచుకున్నార్ట‌. సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి ఓ పాట‌ని రాస్తున్నారు. అది పూర్తిగా జాన‌ప‌ద శైలిలో సాగుతుంద‌ని తెలుస్తోంది. మొత్తానికి చిరు నుంచి వ‌చ్చే ఓ విభిన్న‌మైన ఆల్బ‌మ్ `సైరా`. మ‌రి ఆ పాట‌లెలా ఉంటాయో తెలియాలంటే.. ఇంకొన్నాళ్లు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

ఖమ్మం సీటు రిస్క్ లో పడేసుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close