ఏపీ లిక్కర్ స్కాంలో ఇప్పటి వరకూ పెద్దగా వినిపించని పేరు నారాయణ స్వామి. పేరుకు ఎక్సైజ్ మంత్రే అయిన చేతుల్లో ఏమీ ఉండేది కాదని అందరికీ తెలుసు. అందుకే సిట్ అధికారులు ఇప్పటి వరకూ పట్టించుకోలేదు. కానీ సాక్షిగా అయినా వాంగ్మూలం కీలకం కాబట్టి నోటీసులు జారీ చేశారు.కానీ నారాయణ స్వామి తనకు హెల్త్ బాలేదని డుమ్మకొట్టారు.కానీ పోలీసుల్ని ఇంటికి పంపించి.. వీడియో క్వాల్ ద్వారా ఆయనను సిట్ అధికారులు ప్రశ్నించారు. వారు ఏం అడిగారో.. నారాయణ ఏం చేప్పాడో కానీ.. వెంటనే ఆయనకు ఆరోగ్యం బాగైపోయింది.
మంగళవారం ప్రెస్ మీట్ పెట్టి.. తనను ఈ కేసులో ఇరికించేందుకు ఇద్దరు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సిట్ విచారణకు సహకరిస్తానన్నారు. డిజిటల్ లావాదేవీలు మద్యం దుకాణాల్లో వద్దని చెప్పిన మాట నిజమేనని అంగీకరించారు. ఈ స్కాంలో చాలా మంది డబ్బులు సంపాదించుకుని ఉండవచ్చు కానీ తాను మాత్రం నిజాయితీగా వ్యవహరించానని చెబుతున్నారు. నారాయణ స్వామి సిట్ ముందు హాజరు కావడానికి కంగారు పడి మీడియా ముందు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారన్నది సస్పెన్స్ గా మారింది.
జగన్ రెడ్డి , పెద్దిరెడ్డి రాజకీయంపై అవగాహన ఉన్న నారాయణ స్వామి .. ఎక్సైజ్ మంత్రిగా తనను బలి చేసి అందరూ బయటపడే ప్రమాదం ఉందన్న అనుమానంలో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే తనను ఇరికించాలని వైసీపీ నేతలే ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కేసులు పెడితే.. నారాయణ స్వామి ప్రధానంగా బలవ్వాల్సి ఉంటుంది. అందుకే ఆయన కంగారు పడుతున్నట్లుగా కనిపిస్తోంది.