మీడియా ఎదుట తొడలు కొట్టి డైలాగులు చెప్పే మాజీ మంత్రి అనిల్ కుమార్ కనిపించడం లేదు. పోలీసులు ఫోన్ చేసినా.. స్పందించడం లేదు. అసలు ఎవరూ అందుబాటులోకి లేరు. ప్రసన్నకుమార్ రెడ్డి.. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై ఘోరమైన మాటలు మాట్లాడినప్పుడు అనిల్ కూడా ఉన్నారు. ఆయనను ఏ2గా చేర్చారు. ఈ కేసులో ప్రశ్నించడానికి నోటీసులు ఇచ్చారు. అయినా ఆయన కనిపించకుండా పోయారు.
ఏ1గా ఉన్న ప్రసన్నకుమార్ రెడ్డినే పోలీసులు అరెస్టు చేయలేదు. ఏ 2గా ఉన్న అనిల్ కుమార్ ను అరెస్టు చేసే చాన్స్ లేదు. కానీ ఆయన పరారయ్యారు. ఈ కేసులో అరెస్టు చేయవద్దని ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇలాంటి కేసులకు కూడా భయపడితే ఎలా అన్న విస్మయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. అయితే అనిల్ కుమార్ భయం మరొకటి ఉందని అంటున్నారు. క్వార్ట్డ్ తవ్వకాల స్కాంలో ఆయన పీఏ అడ్డంగా దొరికిపోయారు. ఆ బాగోతం అంతా బయటకు వస్తే.. ఈ కేసు పేరుతో నోటీసులు ఇచ్చి అరెస్టు చేస్తారన్న భయంతోనే ఆయన పరారయ్యారని అంటున్నారు.
వైసీపీ నేతలు ఇలా మీడియా ముందు తొడలు కొట్టి..తీరా అసలు కేసులు నమోదయ్యే సరికి కనిపించకుండా పోతున్నారు. కానీ వారికి సుప్రీంకోర్టులోనూ ఊరట లభించకపోయినా రావడం లేదు. పోలీసులు వెళ్లి అరెస్టు చేసి తీసుకు రావాల్సి వస్తోంది. తనను అరెస్టు చేయకుండా కోర్టులో రిలీఫ్ దొరికే వరకూ అనిల్ కుమార్ బయటకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.