వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో తనను చేర్చాలని ప్రయత్నిస్తున్నారని.. పోలీసులు ఇలా చేయడం బాధాకరం అంటూ చెప్పుకొచ్చారు. లిక్కర్ కేసుతో సంబంధం లేని తనను ఇబ్బంది పెట్టి సంతోషపడాలని చూస్తున్నారన్నారు.
గతంలో తన గన్ మెన్ గా పని చేసిన గిరి అనే వ్యక్తిని పోలీసులు బలవంతంగా విచారిస్తున్నారని..తన పాత్ర గురించి తప్పుడు సాక్ష్యం చెప్పాలని బెదిరిస్తున్నారని చెవిరెడ్డి ఆరోపించారు. తనను అరెస్ట్ చేయాలనుకుంటే తానే సిట్ ఆఫీసుకు వస్తానని ప్రకటించారు.
అయితే , తనను పోలీసులు అరెస్ట్ చేయాలనుకుంటున్నారని చెవిరెడ్డి వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఈ లిక్కర్ కేసుతో ఏమాత్రం సంబంధం లేకుంటే ఆయన ఇంతలా హైరానా పడాల్సిన అవసరం లేదు. కానీ , కొద్ది రోజులుగా ఒకటే కంగారు పడిపోతున్నారు.
నెక్స్ట్ తనను అరెస్ట్ చేస్తారని ఆందోళన చెందుతున్నారు. కేసులో తనను అరెస్ట్ చేసినా చట్టబద్దంగా ఎదుర్కొంటానని ఎక్కడా చెప్పడం లేదు. పైగా, తానే సిట్ ఆఫీసుకు వస్తానని సిట్ అధికారులకు ఆఫర్ ఇవ్వడంపై చెవిరెడ్డి పాత్రపై ఆయనే ఓ క్లారిటీ ఇచ్చినట్లుగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.