నేడు మంగళగిరిలో ఎయిమ్స్ ఆసుపత్రికి శంఖుస్థాపన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు అయిన ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సస్ (ఎయిమ్స్) ఆసుపత్రికి నేడు గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో శంఖుస్థాపన చేయబోతున్నారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఉదయం 11 గంటలకు శంఖుస్థాపన చేస్తారు. మంగళగిరిలో ఉన్న ప్రభుత్వ టీబీ ఆసుపత్రికి చెందిన 193 ఎకరాలలో దీనిని నిర్మించబోతున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి ఎం. వెంకయ్య నాయుడు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డా.కామినేని శ్రీనివాస్ అనేక మంది రాష్ట్ర మంత్రులు, తెదేపా, బీజేపీలకు చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. శంఖుస్థాపన అనంతరం అక్కడే బహిరంగ సభ జరుగుతుంది. మూడేళ్ళలో ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలనీ లక్ష్యంగా పెట్టుకొన్నట్లు మంత్రి డా. కామినేని శ్రీనివాస్ తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్: నిన్న ఐటీఐఆర్.. ఇవాళ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ..!

ఎమ్మెల్సీ ఎన్నికల పుణ్యమా అని తెలంగాణ రాజకీయాల్లో రోజుకో అంశం హైలెట్ అవుతోంది. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానం గురించి బీజేపీపై విమర్శలు చేసేటప్పుడు ఐటీఐఆర్ ప్రాజెక్టును హైలెట్ చేసిన కేటీఆర్.. వరంగల్‌కు పోయి.....

ఏపీ డీజీపీపై కేంద్ర హోంశాఖ విచారణ చేయిస్తున్న రఘురామరాజు..!

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తన నియోజకవర్గం నర్సాపురం వెళ్తే దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేయించాలని ప్లాన్ చేస్తున్నారని అనుమానిస్తున్నారు. అందుకే ఆయన ఉంటే ఢిల్లీ లేకపోతే హైదరాబాద్‌నే ఎంచుకుంటున్నారు. కానీ నర్సాపురం...

బెజవాడకు టీడీపీ హైకమాండ్ కేశినేనినే..!

బెజవాడకు తానే హైకమాండ్ అని ప్రకటించుకున్న ఎంపీ కేశినేని నాని చివరకు తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసుకుంటున్నారు. తన కుమార్తె శ్వేతను మేయర్ అభ్యర్థిగా ప్రతిపాదించారు. హైకమాండ్ ఆమోదముద్ర వేసేలా చూసుకున్నారు. తాను...

కొత్త త‌ప్పుల్ని చేస్తానేమో.. పాత‌వి రిపీట్ చేయ‌ను – రాజ్ త‌రుణ్‌తో ఇంట‌ర్వ్యూ

ద‌ర్శ‌కుడ‌వ్వాల‌నుకుని వ‌చ్చి - అనుకోకుండా హీరో అయిపోయిన వాడు రాజ్ త‌రుణ్‌. అదే త‌న‌కు బాగా క‌లిసొచ్చింది. ఉయ్యాల జంపాలా, కుమారి 21 ఎఫ్‌, సినిమా చూపిస్త మావ‌.. ఇలా హ్యాట్రిక్ సినిమాల‌తో...

HOT NEWS

[X] Close
[X] Close