సరికొత్త వివాదం: “భారత్ మాతాకి జై!”

మహారాష్ట్రలోని ఎం.ఐ.ఎం.(మజ్లీస్ పార్టీ) శాసనసభ సభ్యుడు వారిస్ పఠాన్ శాసనసభలో ‘భారత్ మాతా కి జై’ అని నినదించేందుకు నిరాకరించడంతో అతనిని సభ నుంచి ప్రస్తుత సమావేశాలు పూర్తయ్యేవరకు సస్పెండ్ చేయబడ్డాడు. మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ, “తన పీక మీద కత్తి పెట్టి బలవంతం చేస్తే తను చావనయినా చస్తాను కానీ ‘భారత్ మాతా కి జై’ అని ఎట్టి పరిస్థితులలో అనను,” అని అన్న మాటలపై ఇప్పటికే చాలా వివాదాస్పదంగా మారింది. ఆయనపై అప్పుడే కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అవుతున్నాయి కూడా. తమ పార్టీ అధినేత మార్గంలోనే నడుస్తూ ఇప్పుడు వారిస్ పఠాన్ కూడా అదేవిధంగా మాట్లాడాడు. అందుకు మహారాష్ట్ర శాసనసభలోని అధికార, ప్రతిపక్ష సభ్యులు అందరూ అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. సభ్యుల ఒత్తిడి మేరకు, మహారాష్ట్ర హోం మంత్రి రంజిత్ పాటిల్ అతనిని సభ నుండి సమావేశాలు పూర్తయ్యేవరకు బహిష్కరించాలని తీర్మానం ప్రవేశపెట్టగా దానిని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

అనంతరం ఈ వివాదం గురించి మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే సభలో సభ్యులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “ఈ దేశంలో జీవిస్తున్న వారందరూ ఈ దేశాన్ని ప్రేమిస్తారని, గౌరవిస్తారని అందరం ఆశిస్తాము. అది చాలా సహజం కూడా. బ్రిటిష్ ప్రభుత్వ బానిసత్వ సంకెళ్ళను త్రెంచుకొనేందుకు కుల,మత,ప్రాంత,బాషలకు అతీతంగా దేశ ప్రజలందరూ కలిసిపోరాడారు. ఆనాటి వారి త్యాగాలు, పోరాటాల ఫలితంగా నేడు స్వతంత్ర భారత్ లో జీవించగలుగుతున్నాము. వాక్ స్వాతంత్ర్యం పేరిట వారి పోరాటాలను, త్యాగాలను అవమానించడం సబబు కాదు. ఇటువంటి జాతి విద్వేష భావనలు జె.ఎన్.యు.లో చూసాము అవిప్పుడు చట్ట సభాలోకి కూడా ప్రాకడం మనం చూస్తున్నాము. ఏ వ్యక్తి అయినా ఈవిధంగా వ్యవహరించినట్లయితే ఆ వ్యక్తిని దేశద్రోహిగానే పరిగణించడం మంచిది,” అని అన్నారు.

ఈ తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అబ్దుల్ సత్తార్, రాధాకృష్ణ పాటిల్ ఇద్దరూ కూడా సభ్యులు కూడా మద్దతు ఈయడం విశేషం. “ఇటువంటి వ్యక్తులు అనాలోచితంగా మాట్లాడే ఇటువంటి మాటల వలననే యావత్ ముస్లిం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంటుంది. కనుక వాసిం పఠాన్ న్ని సభ నుంచి బహిష్కరించడాన్ని మేము సమర్దిస్తున్నాము,” అని చెప్పారు.

ఈ పరిణామంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జితేందర్ అవ్హాద్ భిన్నంగా స్పందించారు. “ఇది ఆర్.ఎస్.ఎస్., భాజపా, మజ్లీస్ లు కలిసి మొదలుపెట్టిన మరో కొత్త నాటకం. ఆర్.ఎస్.ఎస్. అధినేత మోహన్ భగవత్ దేశ ప్రజలందరూ ‘భారత్ మాతాకి జై’ అనే నినాదాన్ని తరువాత తరానికి అందించాలని కోరినప్పుడే మళ్ళీ ఏదో కొత్త నాటకం మొదలుపెట్టడానికి సిద్దం అవుతున్నారని మాకు అనుమానం కలిగింది. ఆయన ఆ మాట చెప్పడం వెంటనే మజ్లీస్ అధినేత దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మాట్లాడటంతో ఆ మూడు సంస్థలు కలిసి మరో కొత్త నాటకం ఆరంభించి సరికొత్త వివాదం లేవనెత్తడంతో మా అనుమానం నిజమేనని రుజువయింది. అవి మొదలుపెట్టిన ఈ కొత్త నాటకం వలన దేశంలో ఉన్న రెండు మత వర్గాల ప్రజల మధ్యన ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడుతుంది,” అని అన్నారు.

 

 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close