సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు రావడం కామన్. గతంలో కూడా బాలకృష్ణ, చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుల సినిమాలు బాక్సాఫీసు ముందుకు వచ్చాయి. ఈ యేడాది కూడా బాలకృష్ణ, చిరంజీవి సంక్రాంతి బరిలో దిగుతున్నారు. బాలయ్య వీరసింహా రెడ్డి 12న వస్తుండగా, చిరంజీవి వాల్తేరు వీరయ్య 13న రంగంలో దిగుతుంది. ఇలా రెండు పెద్ద సినిమాలు, అగ్ర కథానాయకుల సినిమాలు ఒకేసారి బాక్సాఫీసు ముందుకు వస్తున్నపుడు ప్రమోషన్స్ లో కూడా వేడి కనిపిస్తుంది. అయితే వీరయ్య, వీరసింహా ప్రమోషన్స్ లో ఆ వేడి లేదు. అంతా ఫ్రెండ్లీ గా, బ్యాలెన్స్ గా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. కారణం.. ఈ రెండు సినిమాలు ఒక నిర్మాణ సంస్థవే. మైత్రీ మూవీ మేకర్స్ చాలా బ్యాలెన్స్ గా ఇరువురి హీరోల ఫ్యాన్స్ ఎక్కడా హార్ట్ అవ్వకుండా తూకం తూచినట్లు ప్రమోషన్స్ ని ప్లాన్ చేసింది.
పాటలని రోజు విడిచి రోజు ఒకొక్కటిగా విడుదల చేశారు. వీరసింహ మనోభావాల పాటని ఫ్యాన్స్ సమక్షంలో విడుదల చేస్తే తర్వాత రోజు వాల్తేరు వీరయ్యలోని పూనకలు లోడింగ్ ని కూడా ఫ్యాన్స్ తోనే విడుదల చేయించారు. అంతకుముందు వీరసింహా టైటిల్ ని కర్నూల్ లో ఒక చిన్న ఈవెంట్ లా నిర్వహించి విడుదల చేశారు. దిన్ని మొన్నటి వాల్తేరు వీరయ్య పోర్ట్ సెట్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ తో బ్యాలెన్స్ చేయించారు. అలాగే రెండు ఫ్యాన్ మీట్లు పెట్టారు. అంతేకాదు.. కొంతమంది సాంకేతిక నిపుణులు ఈ రెండూ సినిమాలకీ పని చేశారు. శేఖర్ మాస్టర్, రామ్ లక్ష్మణ్ లకు కామన్ ప్రమోషన్స్ ఏర్పాటు చేశారు. అలాగే ఈ రెండు సినిమాల్లో కథానాయిక శ్రుతి హసనే. ఆమె ప్రమోషన్స్ కూడా కామన్ గానే వుంటాయి. ఇక నిర్మాతలు కూడా ఒకటి తక్కువ ఎక్కువ అని కాకుండా రెండూ అద్భుతమని చాలా జాగ్రత్తగా పొదుపుగా మాట్లాడి ఎవరి అభిమానులు మనోభాబాలు దెబ్బతినకుండా ఆచితూచి మాట్లాడుతున్నారు. ఇప్పటివరకూ ప్రమోషన్స్ లో మంచి బ్యాలెన్స్ మెంటైంట్ చేసింది మైత్రీ. రెండు ప్రీరిలీజ్ ఈవెంట్లు ఇంతే బ్యాలెన్స్ గా జరిగిపోతే.. ప్రమోషన్స్ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ పెద్ద భారం దిగిపోయినట్లే.