తెలంగాణ ఉద్యోగులకు ఇక పూర్తి జీతాలు..!

తెలంగాణ ఉద్యోగులకు ఈ నెల నుంచి పూర్తి జీతాలు, పెన్షన్లు చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల ఒకటో తేదీన అందరికీ పూర్తి జీతం అందేలా బిల్లులు పెట్టుకోవాలని అధికారులను ఆదేశించారు. కొద్ది రోజుల క్రితం.. విపత్తు సమయాల్లో జీతాలు కత్తిరించే అవకాశాన్ని కల్పించుకుంటూ.. ఎవరూ ప్రశ్నించకుండా.. ఓ ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం తీసుకు వచ్చింది. దాంతో.. ఈ నెల కూడా సగం జీతమే ఇస్తారన్న ఊహాగానాలు నడిచాయి.

అయితే… గత మూడు నెలలుగా.. కట్ చేసిన సగం జీతాన్ని మళ్లీ అడిగే అవకాశం లేకుండా.. ఆ ఆర్డినెన్స్ తెచ్చినట్లుగా భావిస్తున్నారు. కత్తిరించిన జీతం మళ్లీ ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా ఉద్యోగ సంఘాలు అడగడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కనీసం ఈ నెల నుంచి అయినా పూర్తి స్తాయి జీతం… పెన్షన్లు ఇస్తామన్నందుకు ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల కత్తిరించినా అడిగే పరిస్థితి లేకపోవడమే దీనికి కారణం. ఉద్యోగ సంఘాల నేతలు.. నోరు తెరిచే పరిస్థితి లేదు.

మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత … దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా జీతాలను కత్తిరించడం లేదు. భారీ లోటుతో ఆర్థిక రథాన్ని లాగుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా.. గత నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం జీతం చెల్లించారు. కానీ కేసీఆర్ మాత్రం… మద్యం అమ్మకాలు కూడా ఆదుకోలేదన్న కారణంగా…. గత నెలలో జీతం సగమే చెల్లించారు. ఈ నెల నుంచి ఆ బాధ లేకుండా పోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరు చేప‌ల ఫ్రై.. సూప‌ర్ హిట్టు

లాక్ డౌన్ స‌మ‌యంలోనూ మ‌రింత యాక్టీవ్ గా క‌నిపిస్తున్నారు చిరంజీవి. ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌రుస్తూ చిరు కొన్ని వీడియోలు చేశారు. పోలీసుల పిలుపు మేర‌కు ప్లాస్మా డొనేష‌న్ క్యాంపులో పాల్గొని.. వాళ్ల‌ని ఉత్సాహ...

ఏపీలో కరోనా మరణమృదంగం..! ఆపడానికి ప్రయత్నాల్లేవా..?

ఆంధ్రప్రదేశ్‌లో మరణాలు రెండు వేలు దాటిపోయాయి. గత రెండు రోజులుగా.. రోజుకు కొద్దిగా తక్కువగా వంద మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా వైరస్ అనేది ప్రాణాంతకం కాదని... చికిత్స చేస్తే పోతుందని ప్రభుత్వం...

“అప్పడం వ్యాక్సిన్” కనిపెట్టిన కేంద్రమంత్రికే కరోనా..!

కరోనా వైరస్‌కు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తల దగ్గర్నుంచి భారతీయ జనతా పార్టీ నేతల వరకూ..అందరూ.. మందు కనిపెట్టే పనిలో బిజీగా ఉన్నారు. సైంటిస్టులు ఇంకా కుస్తీలు పడుతున్నారు కానీ.. భారతీయ జనతా పార్టీ...

టీటీడీపై కరోనా పడగ..! బ్రహ్మోత్సవాలు ఎలా..?

తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల్లో 743 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ముగ్గురిలో ఓ అర్చకుడు కూడా ఉన్నారు. అర్చకుల్లో సగం మందికిపైగా వైరస్ బారిన...

HOT NEWS

[X] Close
[X] Close