అయితే ఓకే..! ఏపీలోనూ ఆ శాఖల ఉద్యోగులకు పూర్తి జీతాలు..!

తెలంగాణ సీఎం కేసీఆర్ పోలీసులు, వైద్య, ఆరోగ్య , పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తి జీతాలు ఇవ్వాలని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో పోలీసులు, వైద్య ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బంది కష్టపడి పని చేస్తున్నారని వారందరికీ పూర్తి జీతాలివ్వాలని… శనివారం ఉదయం నిర్వహించిన సమీక్షలో అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల జీతాల విషయంలో.. ఏపీ సీఎం.. పూర్తి స్థాయిలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఫాలో అవుతున్నారు. తెలంగాణ సీఎం ఉద్యోగుల జీతాలను… సగానికి మేర కోత విధించాలని నిర్ణయించినట్లుగా ప్రకటించిన వెంటనే.. ఏపీలోనూ అదే నిర్ణయం తీసుకున్నారు. నిజానికి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నది మార్చి 30వ తేదీన. అప్పటికే ఏపీలో శాలరీ బిల్లుల ప్రాసెస్ పూర్తయిపోయింది.

అయినా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నందున … తాము కూడా అలాగే తీసుకోవాలన్నట్లుగా.. ఆ బిల్లులన్నింటినీ నిలుపుదల చేసి.. ఉద్యోగులకు సగం జీతాలు కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ బిల్లుల ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో.. ఉద్యోగులకు జీతాలు అందలేదు. అయితే.. ఈ లోపు కేసీఆర్ కు.. వైద్య, ఆరోగ్య, పోలీసు శాఖల నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చాయి. ప్రస్తుత సంక్షోభ సమయంలో… ఎక్కువగా కష్టపడుతోంది… వైద్య, ఆరోగ్య, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందేనని.. వారికి జీతాల కోత విధించడం సరి కాదన్న వినతులు వెళ్లాయి.

దీన్ని పరిశీలించిన కేసీఆర్… వారందరికీ పూర్తి స్థాయి జీతాలు చెల్లించడంతో పాటు ఇన్సెంటివ్ చెల్లించాలని నిర్ణయించారు. ఇన్సెంటివ్స్ గురించి ఇప్పుడు చెప్పనప్పటికీ… పూర్తి జీతాలు చెల్లించాలని.. శుక్రవారం ఆదే్శాలు జారీ చేశారు. ఏపీలో శనివారం ముఖ్యమంత్రి సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మిగతాఅన్ని విభాగాలు.. పెన్షనర్లకు జీతాల కోత అమలవుతుంది. ఇన్సెంటివ్స్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ .. నిర్ణయం తీసుకున్న తర్వాత ఏపీ సీఎం కూడా.. దానిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ సినిమాలో ర‌కుల్ లేదు

మోహ‌న్‌బాబు క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న చిత్రం.. సన్నాఫ్ ఇండియా. డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌కుడు. ఇళ‌య‌రాజా సంగీత అందిస్తున్నారు. ఎం.ధ‌ర్మ‌రాజు ఎం.ఏ, పుణ్య‌భూమి నాదేశం త‌ర‌హాలో సాగే క్యారెక్ట‌రైజేష‌న్ ఈ సినిమాలో క‌నిపించ‌బోతోంద‌ట‌. మ‌ళ్లీ ఆ...

రివ్యూ: అంధ‌కారం

హార‌ర్‌, థ్రిల్ల‌ర్ సినిమాల్ని చూసి.. విసుగొచ్చేసింది. అన్నీ ఒక ఫార్మెట్‌లోనే సాగుతుంటాయి. హార‌ర్ అన‌గానే... భ‌యంక‌రమైన రీ సౌండ్లు, ఓ ఇల్లు, అందులో కొన్ని పాత్ర‌లు విచిత్రంగా ప్ర‌వ‌ర్తించ‌డం.. ఇవే క‌నిపిస్తాయి. థ్రిల్ల‌ర్లూ...

పెంచుకుంటూ పోయే ప్రక్రియలో ఈ సారి ఆస్తి పన్ను..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్నులు పెంచుకుటూ పోతోంది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ.. అవకాశం లేకపోయినా స్పేస్ చూసుకుని మరీ పెంచుకుటూ పోతోంది. పెట్రోలో నుంచి టోల్ చార్జీల వరకూ కొత్త కొత్త ఆలోచనలు...

జనసేనను ప్లాన్డ్‌గా తొక్కేస్తున్న బీజేపీ..!?

భారతీయ జనతా పార్టీ వ్యూహం .. జనసేనను ప్లాన్డ్‌గా..తొక్కేయడమేనని పెద్దగా ఆలోచించకుండా జనసైనికులకు ఆర్థం అవుతోంది. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లను బీజేపీ తెచ్చుకుంది. ఆరు శాతం ఓట్లను వైసీపీ...

HOT NEWS

[X] Close
[X] Close