ద‌ర్శ‌కులు భ‌లే పిసినారులు

ఈ వారం మూడు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. వాటి టాక్ ఎలా ఉన్నా, శివ‌రాత్రి రోజున విడుద‌ల కావ‌డం ప్ల‌స్ అయ్యింది. మూడు సినిమాల‌కూ టికెట్లు బాగానే తెగుతున్నాయి. అయితే… గాలి సంప‌త్‌, జాతిర‌త్నాలు సినిమాల మేకింగ్ చాలా లో క్వాలిటీలో ఉన్నాయ‌న్న సంగ‌తి ప్రేక్ష‌కులు క‌నిపెట్టేశారు. గాలి సంప‌త్ కి ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి నిర్మాత‌. జాతి ర‌త్నాలు అయితే.. `మ‌హాన‌టి`, `ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం` తీసిన నాగ అశ్విన్ నిర్మాత‌. ఇద్ద‌రూ.. మంచి ద‌ర్శ‌కులే. కానీ నిర్మాత‌లుగా మారాక‌.. త‌మ పిసినారి త‌నం చూపించారు. నిజానికి త‌క్కువ బ‌డ్జెట్ లో పూర్త‌యిపోయే క‌థ‌ల‌నే ఇద్ద‌రూ ఎంచుకున్నారు. అలాంట‌ప్పుడు కూడా… తెర‌పై క్వాలిటీ ఉండేలా జాగ్ర‌త్త ప‌డ‌లేక‌పోయారు.చాలా స‌న్నివేశాల్ని.. అక్క‌డ‌క్క‌డే తిప్పేసిన‌ట్టు క‌నిపించింది. `జాతిర‌త్నాలు`లో అయితే మ‌రీనూ. లొకేష‌న్లు, కాస్ట్యూమ్స్‌.. ఇలా అన్ని విష‌యాల్లోనూ పిసినారి త‌నం చూపించారు. కాక‌పోతే… నిర్మాత‌లుగా ఇద్ద‌రూ స‌క్సెసే. జాతి ర‌త్నాలు ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే లాభాలు గ‌డించేశారు. గాలి సంప‌త్ దీ అదే త‌ర‌హా. నిర్మాత‌లెవ‌రికైనా స‌రే, త‌మ సినిమాల‌తో లాభాలు రావ‌డ‌మే అంతిమ ధ్యేయం. ఆ విష‌యంలో ఈ ఇద్ద‌రు నిర్మాత‌లూ స‌క్సెస్ అయిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎగ్జిట్ పోల్స్ : గుజరాత్‌లో మళ్లీ బీజేపీ – హిమాచల్‌లో టఫ్ ఫైట్ !

రెండు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకే మొగ్గు కనిపిస్తోందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. హిమాచల్ ప్రదేశ్‌లో పోలింగ్ నెలకిందటే ముగిసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంది. గుజరాత్...

రోజాకు ఇంత అవమానమా !

మంత్రి రోజా అంటే ఫైర్ బ్రాండ్. నోరు తెరిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. ఆ నోరుకు భయపడే మంత్రి పదవి ఇచ్చారనే టాక్ కూడా ఉంది అది వేరే విషయం. కానీ మంత్రి...

3 రాజధానులు కాదు 3 రాష్ట్రాలు చేయాలన్న పయ్యావుల !

రాయలసీమ గర్జన పేరుతో వైసీపీ నిర్వహించిన సభ ద్వారా ప్రజల మూడ్ ఏమిటో వైసీపీ పెద్దలకు అర్థమయ్యే ఉంటుందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సెటైర్ వేశారు. సీమ గర్జన పేరుతో...

విజయ్ ఫ్యామిలీతో జాన్వీ కపూర్ బాండింగ్

విజయ్‌ దేవరకొండ కి బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ వుంది. లైగర్ సినిమాకి ముందే విజయ్ అక్కడ క్రేజ్ తెచ్చుకున్నాడు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా విజయ్ అంటే ఇష్టపడతారు. జాన్వీ కపూర్ కి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close