గజేంద్రకు కరోనా.. “అపెక్స్” మళ్లీ డౌట్..!

తెలుగు రాష్ట్రాల మధ్య జల పంచాయతీ తీర్చాలనుకున్న కేంద్రానికి ఏదీ కలసి రావడం లేదు. ఈ నెల ఐదో తేదీన నిర్వహించాలనుకున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశం.. కేసీఆర్ విజ్ఞప్తితో వాయిదా పడింది. అయినప్పటికీ పట్టు వదలకుండా ఇరవై ఐదో తేదీన సమావేశాన్ని ఖరారు చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇక హాజరు కాక తప్పదనుకుంటున్న సమయంలో… మరో అడ్డంకి వచ్చి పడింది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దీంతో ఇరవై ఐదో తేదీన జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది.

అపెక్స్ కౌన్సిల్ భేటీ అంటే.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు…కేంద్ర జలశక్తి మంత్రి కూడా ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. ఆయనే తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న పంచాయతిని తీర్చాల్సి ఉంటుంది. రెండు రాష్ట్రాలు పోటాపోటీగా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. ఒకరి ప్రాజెక్టులు అక్రమం అంటే..మరొకరి ప్రాజెక్టులు అక్రమం అని వాదిస్తున్నాయి. అయితే రెండు రాష్ట్రాలూ… ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఇవ్వడం లేదు. అదే సమయంలో.. పోతిరెడ్డి పాడు నుంచి రోజుకు మూడు టీఎంసీల నీటిని తరలించేందుకు కొత్తప్రాజెక్టుకు.. ఏపీ టెండర్లు ఖరారు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది.

అయితే..ఈ టెండర్లపై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. సాధారణంగా అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కోరిక మేరకు నిర్వహించాల్సి ఉంటుంది. అటువంటి విజ్ఞప్తులు ఏవీ లేకుండానే నిర్వహిస్తున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునేందుకు, డిపిఆర్ లు అనుమతి లేకుండా నిర్మిస్తున్న ప్రాజెక్ట్ ల వివరాలను పొందుపరుస్తూ నివేదికలు సిద్దం చేశారు. ఇప్పుడు గజేంద్ర సింగ్‌కు కరోనా సోకడం వల్ల సమావేశ నిర్వహణపై ఉత్కంఠ ఏర్పడింది. ఆన్ లైన్‌లో జరిగే సమావేశం కాబట్టి.. ఇబ్బంది ఉండదన్న చర్చ కూడా అధికారవర్గాల్లో నడుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close