కేసీఆర్‌ని లెక్క చేయకుండా “సౌండ్ పార్టీ”కి గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ పోస్ట్..!

గజ్వేల్ అంటే అందరికీ కేసీఆర్ గుర్తుకు వస్తారు. ఆయన ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గానికే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ పూచిక పుల్ల.. అటు నుంచి ఇటు కదలాలన్నా.. ఆయన అనుమతి ఉండాల్సిందే. కానీ మున్సిపల్ చైర్మన్ పదవి విషయంలో మాత్రం… కేసీఆర్ బహిరంగ ప్రకటనను.. పూచికపుల్లలా తీసి పడేశారు… టీఆర్ఎస్ నేతలు. గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపాలిటీకి ఎన్నికలు జరగక ముందే చైర్మన్ అభ్యర్థిగా వంటేరు నారాయణరెడ్డి అనే టీఆర్ఎస్ నేతను కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ఈ నారాయణరెడ్డి.. మొదటి నుంచి టీఆర్‌ఎస్‌లో ఉన్నారు. ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయన గురించి కేసీఆర్‌కు బాగా తెలుసు కాబట్టి.. ఎన్నికలు జరగకముందే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఖరారు చేశారు. ఎన్నికల్లో ఆయననే చైర్మన్ అభ్యర్థిగా ముందు పెట్టి ప్రచారం చేశారు. 12వ వార్డు నుంచి ఆయన ఘన విజయం సాధించారు.

కేసీఆర్ స్వయంగా చెప్పారు కాబట్టి.. ఆయనే చైర్మన్ అనుకున్నారు. తీరా చైర్మన్ ఎన్నిక హాల్లోకి అడుగు పెట్టే సరికి.. రాజమౌళి అనే వ్యాపారస్తుడి పేరు తెరపైకి వచ్చింది. ఆయననే… టీఆర్ఎస్ పరిశీలకులు… బలపరిచి.. చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టారు. దీంతో వంటేరు నారాయణరెడ్డి హతాశుడవ్వాల్సి వచ్చింది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినా… నారాయణరెడ్డికి పదవి ఇవ్వకపోవడం ఏమిటన్న చర్చ గజ్వేల్‌లో జరుగుతోంది. కేసీఆర్ తరపున గజ్వేల్ నియోజకవర్గాన్ని చూసుకునే ఓ ఎంపీ… మరో మంత్రి ఇలా.. కావాలనే నారాయణరెడ్డికి ఝులక్ ఇచ్చారని అంటున్నారు. రాజమౌళి పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టారని.. ఆయా నేతల్ని సంతృప్తి పరిచారన్న ప్రచారం కూడా జరుగుతోంది. వంటేరు నారాయణరెడ్డి లా …రాజమౌళి టీఆర్ఎస్ లో మొదటి నుంచి లేరు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరారు.

ఈ పరిణామం.. ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం.. చర్చనీయాంశంగా మారింది. ఇది కేసీఆర్‌కు తెలిసే జరిగిందా.. లేక… ఎంపీ, మంత్రి కలిసి గూడుపుఠాణి నడిపారా.. అన్న చర్చ నడుస్తోంది. మొత్తానికి మున్సిపల్ ఎన్నికలను కేసీఆర్ పెద్దగా పట్టించుకోలేదు కానీ.. తన నియోజకవర్గంలో ఇచ్చిన హామీ మేరకు… పార్టీ నేతకు..చైర్మన్ పదవి మాత్రం ఇప్పించలేకపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆదర్శప్రాయ వ్యక్తిగా తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకున్న తమ్మినేని..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. తనను తాను ఆదర్శప్రాయ వ్యక్తిగా సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. ఆదర్శ ప్రాయ వ్యక్తిగా.. స్పీకర్ హోదాలోనే కోర్టులపై కామెంట్లు చేశానని చెప్పుకొచ్చారు. న్యాయవ్యవస్థపై.. తమ్మినేని సీతారాం రెండురోజుల...

ఇక రామ్ చ‌ర‌ణ్… వెబ్ సిరీస్‌

రాబోయే రోజుల్లో వెబ్ సిరీస్‌లు వినోద రంగాన్ని ఆక్ర‌మించ‌బోతున్నాయి. సినిమాల్ని మించిన మేకింగ్‌, కంటెంట్‌తో వెబ్ సిరీస్‌లు ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని అందిస్తున్నాయి. వాటి ప్రాధాన్య‌త‌ని స్టార్లు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. స‌మంత‌, త‌మ‌న్నా లాంటి...

బాల‌య్య‌తో అమ‌లాపాల్‌?

నంద‌మూరి బాల‌కృష్ణ - బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. `మోనార్క్‌` అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. బాల‌య్య పుట్టిన రోజున‌... ఓ ప‌వ‌ర్ ఫుల్ టీజ‌ర్ విడుద‌ల చేశాడు...

అమరావతి విషయంలో ప్రధానిపై భారం వేస్తున్న చంద్రబాబు..!

అమరావతి రైతుల ఉద్యమం ప్రారంభమై రెండు వందల రోజులు పూర్తయిన సందర్భంగా... దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు..వర్గాలు..మేధావుల నుంచి మద్దతు లభిస్తోంది. వర్చవల్ పద్దతిలో అందరూ.. పెద్ద ఎత్తున తమ సంఘిభావం తెలియచేస్తున్నారు....

HOT NEWS

[X] Close
[X] Close