ఓబుళాపురం మైనింగ్ కేసులో ఏడేళ్ల జైలు శిక్ష ఖరారు కావడంతో కర్ణాటకలోని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధనా రెడ్డి శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తూ అక్కడి అసెంబ్లీ స్పీకర్ గెజిట్ జారీ చేశారు. గంగావతి అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లుగా ప్రకటించారు. ఇప్పుడు ఆ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించనున్నారు.
ఓ ఇన్సూరెన్స్ ఏజెంట్ గా ప్రారంభించి మైనింగ్ లోకి వెళ్లి కొండలు, గుట్టల్ని కొల్లగొట్టి జగన్ తో కలిసి దోపిడీకి పాల్పడిన గాలి జనార్ధన్ రెడ్డి ఇప్పుడు జైలు పాలయ్యారు. సంపాదించిన ఆస్తులన్నీ ఇప్పటికే జప్తు చేశారు. శిక్ష ఖరారు అయింది కాబట్టి ఆ ఆస్తులన్నీ ప్రభుత్వమే జమ చేసుకుంటుంది. ఇప్పుడు పదవి కూడా పోయింది. శిక్ష మరో నాలుగేళ్లకు పూర్తి అయిన తర్వాత మరో ఆరేళ్ల పాటు ఆయన ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు. అంటే రాజకీయంగానూ ఆయన పని అయిపోయినట్లే.
దోచుకున్న డబ్బు ఉందని ఎంతగా ఎగిరెగిరి పడ్డారో అందరికీ గుర్తు ఉంది. డబ్బుతో ఆయన చేయాలనుకున్న రాజకీయానికి చాలా మంది శత్రువులు అయ్యారు. ఇప్పుడు ఎవరూ ఆయనకు కనీసం సానుభూతి చూపించడం లేదు. సోదరులు కూడా దూరమయ్యారు. జడ్జిలకు డబ్బులిచ్చిన కేసులోనూ ఆయనకు శిక్ష ఖరారు కావడం కాయమే. ఎలా చూసినా జగన్ రెడ్డితో కలిసి కాస్త సంపాదించుకున్నారు కానీ.. అంతా పోగొట్టుకున్నారు.