ఈడీ ఆఫీసుకొచ్చి హెచ్చరించి వెళ్లాడట..! దటీజ్ గాలి..!

దేశ వ్యాప్తంగా సంచలనం సృస్తియించిన ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి ఈడీ అధికారులు ముందు వ్యక్తిగతంగా హాజరయ్యారు. విదేశాలకు తరలించిన వేల కోట్ల ధనం గురించి లెక్కలు చెప్పాలని.. ఆదేశించడంతో… ఆయన వచ్చినట్లు… ఈడీ వర్గాలు చెప్పాయి. కానీ ఆయన మాత్రం.. తానే.. ఈడీ అధికారుల సంగతి తేల్చడానికి వచ్చినట్లుగా మీడియాకు చెప్పుకున్నారు. కర్ణాటక , ఆంద్ర ప్రదేశ్ లో ఓబులాపురం మైనింగ్ కేసు పెను సంచలనం సృష్టించింది. జూన్ 21 2007 లో అక్రమంగా మైనింగ్ తరలిస్తున్నారన్న ఆరోపణలుతో సీబీఐ కేసు నమోదు చేసింది. 2007-09 మద్య లో ఫెమా చట్టాన్ని ఉల్లంఘంచి రూ. వేల కోట్ల మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ తో పాటు నిర్వాహకులు గాలి జనార్ధన్ రెడ్డి , అతని సతీమణి లక్ష్మి అరుణలకు నోటిసులు ఇచ్చారు.

నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా.. వేల కోట్ల ధనాన్ని దేశం దాటించారని ఈడీ అధికారులు గుర్తించారు. దీంతో 121B, 420,411,471,పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే ఈడీ ముందు గాలి జనార్ధన్ రెడ్డి విచారణ కి హాజరయ్యారు .. విదేశాలకు తరలించిన నగదు లావాదేవీల వివరాలతో పాటు తన ఆస్తులు గురించి జనార్థన్ రెడ్డిని ఈడీ ప్రశ్నించింది. అన్ని పత్రాలు తో సహా ఈడీ విచారణ కి హాజరైన గాలిని ఆరు గంటలు పాటు ప్రశ్నించారు. కానీ విచారణ తర్వతా బయటకు వచ్చిన గాలి…జప్తు చేసిన తన ఆస్తులను ఇవ్వాలని ఈడీ అధికారులను అడగడటానికి వచ్చినట్లు చెప్పుకున్నారు. ఈడీకి సంబంధించిన కేసులన్నీ హైకోర్టు కొట్టివేసిందని ప్రకటించుకున్నారు.

ఈడీ అటాచ్ చేసిన ఆస్తిపాస్తులను వెనక్కి తిరిగి ఇవ్వాలని కోర్టు ఆదేశించినట్లు కూడా చెప్పుకొచ్చారు. తిరిగివ్వకపోతే.. కోర్టు ధిక్కార పిటిషన్ వేస్తానని కూడా గాలి జనార్దన్ రెడ్డి మీడియా ముందు ఈడీ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈడీ ఆధీనంలో రూ. వెయ్యి కోట్లకు పైగా తన ఆస్తులు ఉన్నాయని గాలి జనార్ధన్ రెడ్డి చెబుతున్నారు. ఈడీ అధికారుల వద్దకు గాలి జనార్ధన్ రెడ్డి వచ్చిన హంగు.. ఆర్భాటం.. మామూలుగా లేదు. ఖరీదైన కార్ల కాన్వాయ్‌లో ఆయన వచ్చారు. కర్ణాటక పోలీసుల ప్రొటెక్షన్ కూడా తెచ్చుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close