ఏపీ సీఎం చంద్రబాబును .. అదానీ గ్రూప్ చైర్మన్ అదానీ కలిశారు. సీఎం చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. ఆయన ఇవాళ చంద్రబాబును కలుస్తారని ముందస్తు సమాచారం బయటకు రాలేదు. అయితే వ్యక్తిగత శుభకార్యానికి ఆహ్వానం లేదా..పెట్టుబడుల అంశంపై చర్చించేందుకు వచ్చి ఉంటారని అంచనా వేస్తున్నారు.
గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం, పవర్ బాధ్యతల్ని అదానితో పాటు భారతి ఎయిర్ టెల్ తీసుకుంటున్నాయి. ఇప్పటికే గూగుల్ కు భూముల్ని బదిలీ చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో చంద్రబాబుతో భేటీ ఇదే అంశంపై జరిగి ఉటుందని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్టర్ సమ్మిట్లో అదానీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు ప్రకటించారు. ఈ క్రమంలో మరికొన్ని రంగాల్లో అదానీ పెట్టుబడులు కార్యరూపం దాల్చే అవకాశం ఉంది.
పోర్టులు, సిమెంట్, డేటా సెంటర్లు, ఎనర్జీ, అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్ వంటి రంగాల్లో అదానీ పెట్టుబడులు పెట్టాలని అనుకుంటోంది. అదానీ గ్రూప్ 2019 నుంచి ఆంధ్రప్రదేశ్లో కార్యకలాపాలు విస్తరిస్తోంది.