నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న సెంచరీ సినిమా.. గౌతమి పుత్ర శాతకర్ణి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రియ కథానాయిక. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. ట్రైలర్, ఆడియో రిలీజ్ డేట్లు కూడా ఫిక్సయ్యాయి. డిసెంబరు 9న ట్రైలర్‌నీ, 16న పాటల్నీ విడుదల చేద్దామనుకొన్నారు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్లో పడినట్టు సమాచారం. దానికి కారణం…. అదే రోజున ధృవ విడుదల కావడమే అని టాక్.
గౌతమి పుత్ర సినిమా ట్రైలర్‌ని ఒకేసారి వంద థియేటర్లలో ప్రదర్శించాలన్నది చిత్రబృందం ఆలోచన. అందుకోసం థియేటర్ల ఎంపిక కూడా జరుగుతోంది. అదే అదే రోజున ధృవ విడుదల కావడంతో ఈ ఆలోచన పక్కన పెట్టినట్టు సమాచారం. 9కి ముందుగానీ, లేదంటే తరవాత గానీ.. ట్రైలర్నిచూపించే అవకాశం ఉంది. ఆడియో రిలీజ్ లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ధృవ విడుదల రోజునే.. గౌతమి పుత్ర ట్రయిలర్ ప్రదర్శించడం అంత కిక్ ఉండదని, ధృవ హడావుడిలో గౌతమి ట్రైలర్ విడుదల చేయకపోవడమే మంచిదని చిత్రబృందం ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది. పైగా సౌండ్ క్వాలిటీ, విజువల్ ఇంపాక్ట్ బాగున్న థియేటర్లలోనే ట్రయిలర్ చూపించాలనుకొంది చిత్ర బృందం. అలాంటి థియేటర్లన్నీధృవకు బుక్ అయిపోయే అవకాశాలున్నాయి. అందుకే.. ట్రైలర్ విడుదల తేదీ వాయిదా పడుతోందని టాక్.