ఒకప్పుడు రిటైరయ్యే నాటికి ఇల్లు కట్టుకోవాలనుకునేవాళ్లు.. కానీ ఇప్పుడు కొత్త తరం కొత్తగా మారుతోంది. వారు తమ ఆదాయాన్ని చాలా తెలివిగా పెట్టుబడులుగా మారుతున్నారు. హోమ్బైయర్ సెంటిమెంట్ సర్వే ప్రకారం, జెన్ Z ప్రొఫెషనల్స్ ఎక్కువ మంది తమ జీవితంలో ముందుగానే హోమ్ఓనర్స్గా మారాలని కోరుకుంటున్నారు. వారి ఇన్వెస్ట్మెంట్ లాభాలను ఉపయోగించుకుని ఆర్థిక స్వాతంత్ర్యం , దీర్ఘకాలిక స్థిరత్వాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా గుర్తించారు.
కొత్త తరం డిజిటల్-ఫస్ట్ కాన్సెప్టులతో ముందు ఉంది. సమాచారంతో లోతుగా తెలుసుకుని రియల్ ఎస్టేట్ లక్ష్యాలతో ఆధునిక ఇన్వెస్ట్మెంట్ టూల్స్‌ను మిళితం. చేసుకుంటున్నారు. టెక్నాలజీ మ, సమాచార విప్లవం వల్ల వారు డైవర్సిఫికేషన్ ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారని ఎనలిస్టులు చెబుతున్నారు. ఎంతో మంది యువ ఇన్వెస్టర్లకు, మెట్రోల్లో ₹1–2 కోట్ల విలువైన పూర్తి ప్రాపర్టీ కొనడం సాధారణంగా మారింది. ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటూ వీలైనంత వేగంగా లోన్ తీర్చేసే ఆలోచనలు చేస్తున్నారు. లే ఆఫ్‌ల గురించి భయపడేది కొంత మందే.
రియల్ ఎస్టేట్ ఇన్వెస్టింగ్లో రెండు ముఖ్య అంశాలు వారు చూస్తున్నారు. ఒకటి రెంటల్ ఆదాయం , రెండు క్యాపిటల్ అప్రిసియేషన్. స్మార్ట్ ఇన్వెస్ట్ మెంట్స్ లో సంప్రదాయ భయాలను వారు పట్టించుకోవడంలేదు. తెలివిగా రిస్క్ తీసుకుంటున్నారు. అందుకే రాబోయే రోజుల్లో మరింతగా రియల్ ఎస్టేట్ డిమాండ్ పెరుగుతుతుందని.. జెన్ Z మార్కెట్ ను ముందుకు తీసుకెళ్తారని అంచనా వేస్తున్నారు.