జర్నలిస్టు సాయికి తెలంగాణ సర్కార్ వార్నింగ్ !

యూబ్యూట్ చానల్ పెట్టుకుని వ్యూస్ కోసం అడ్డగోలుగా అబద్దాలు చెబుతూ వీడియోలు చేసే… జర్నలిస్టు సాయికి తెలంగాణ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. తప్పుడు ప్రచారాలు చేయవద్దని అధికారికంగానే హెచ్చరికలు జారీ చేసింది. అసలేమయిందంటే.. తెలంగాణలో కేసీార్ ప్రారంభించిన మెడికల్ కాలేజీలు అన్నీ కేంద్రం ఇచ్చినవేనని జర్నలిస్ట్ సాయి అనే వ్యక్తి యూట్యూబ్‌లో వీడియో పెట్టారు. అసలు కేంద్రం వాటిని ఇచ్చిందని. బీజేపీకి క్రెడిట్ ఇచ్చారు.

దీంతో తెలంగాణ సర్కార్‌కు మండిపోయింది. జర్నలిస్ట్ సాయి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపింది. ఆ వీడియోలో మెడికల్ కాలేజీలను కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించినట్లుగా చెప్పారని.. కానీ ఒక్క పైసా కూడా కేంద్రం ఇవ్వలేదని.. పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ నిధులతోనే నిర్మించినట్లుగా ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం, తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీని కూడా కేటాయించలేదు. అయినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు 12 మెడికల్ కాలేజీలు స్వంత నిధులతో ఏర్పాటు చేసింది. వీటికి కేంద్రప్రభుత్వం ఏలాంటి నిధులు మంజూరు చేయలేదని డాక్యుమెంట్లను ఫ్యాక్ట్ చెక్ విడుదల చేసింది.

తెలంగాణలో 8 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏమీ లేనప్పటికీ, కేవలం అనుమతులు మంజూరు చేయడాన్ని, కేంద్ర ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినట్టు అర్థం వచ్చేలా తప్పుదోవ పట్టించే విధంగా వీడియోలు చేయవద్దని జర్నలిస్ట్ సాయికి ఫ్యాక్ట్ చెక్ సూచించింది. ఏపీలోనూ ఈ జర్నలిస్ట్ సాయి నిర్వాకాలు అన్నీ ఇన్నీ కావు. ప్రముఖ జర్నలిస్టుగా చెలామణి ఫేక్ న్యూస్ ప్రచారం చేయడంలో రాటుదేలిపోయారు. ఎంతగా నిజాలు చెప్పినా.. కనీసం వివరణ ఇవ్వకపోవడం.. ఈ బరితెగింపు జర్నలిస్టు లక్షణం అన్న విమర్శలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అసెంబ్లీలో కేసీఆర్ రోల్‌లో కేటీఆర్ !

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ను కూడా ప్రవేశ పెట్టారు. గవర్నర్ ప్రసంగం రోజున ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ నుంచి ఆహ్వానించి.. వీడ్కోలు పలికేందుకు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. కానీ...

ఎన్నికల్లో పోటీపై ఆశలు పెంచుకుంటున్న అలీ !

సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు .. ఎక్కడెక్కడ పోటీ చేయాలో ఓ క్లారిటీకి వచ్చారు. టిక్కెట్లు ఇవ్వలేని వాళ్లకు సలహాదారు పదవులు ఇతర పదవులు ఇచ్చారు. అలా పదవులు పొందిన...

సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్‌కు పొంగులేటి సవాల్ !

పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి తిరుగుతున్నారని బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంత మంది నేతల్ని ఆ పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. అందరూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినవారే. వీరిలో కొంత మంది నామినేటెడ్...

విజయ్, దిల్ రాజు పై అల్లు అరవింద్ ప్రెస్ మీట్ కాన్సిల్ !

విజయ్ దేవరకొండ, పరశురాం, దిల్ రాజు సినిమా ప్రకటన వచ్చింది. విజయ్, పరశురాం ‘గీత గోవిందం’తో బ్లాక్ బస్టర్ కొట్టారు. దీంతో ఇది క్రేజీ కాంబినేషన్ అయ్యింది. అయితే ఈ కాంబినేషన్ లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close