సావిత్రి, శ్రీదేవి, విజయశాంతి లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ అనుష్క. ఇప్పుడు సినిమాలు తగ్గించినప్పటికీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. స్వీటీపై అభిమానమూ, ఆదరణా అలానే ఉన్నాయి. అనుష్కకు ఒడిశాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఘాటీ నిర్మాత రాజీవ్ రెడ్డి ఓ సంఘటన చెప్పారు.
ఘాటీలో కొంత భాగం ఒడిశాలో షూట్ చేశారు. షూటింగ్లో అనుష్కను చూడటానికి వేలాది మంది ప్రజలు వచ్చేవారు. ఆ సమూహాన్ని కంట్రోల్ చేయడానికి సెక్యూరిటీ సిబ్బంది కొన్ని సార్లు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చిందట. ఒడిశాలో కూడా అనుష్క అభిమానులను చూసి తాను సర్ప్రైజ్ అయ్యానని చెప్పారు రాజీవ్.
ఘాటీ సినిమా సెప్టెంబర్ 5న వస్తోంది. అయితే ఇప్పటికీ అనుష్క ఈ సినిమా ప్రమోషన్లలో కనిపించలేదు. దీనిపై కూడా రాజీవ్ క్లారిటీ ఇచ్చారు. “ప్రమోషన్స్ విషయంలో అనుష్క మాకు ముందే ఒక అవగాహన ఉంది. ప్రమోషన్లలో ఆమె పాత్రని ముందే మాకు చెప్పారు. ఆమె నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం” అన్నారు. అలాగే “ఘాటీ అనుష్క కోసమే తయారు చేసిన కథ. తప్పకుండా ఈ సినిమా ఆమె కెరీర్లో ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు.