జి.హెచ్.ఎం.సి.కమీషనర్ సోమేశ్ పై బదిలీ వేటు

తెలంగాణాలో 22 మంది ఐ.ఏ.ఎస్‌. అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసారు. ప్రభుత్వాలు ఐ.ఏ.ఎస్. అధికారులను బదిలీ చేయడం సర్వసాధారణ విషయమే. అయితే నిన్న బదిలీ అయిన అధికారులలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ స్పెషల్‌ కమిషనర్లుగా వ్యవహరిస్తున్న నవీన్‌ మిట్టల్‌, జి.కిషన్‌లను కూడా ఉండటమే విశేషం.

జి.హెచ్.ఎం.సి.పరిధిలో పెరిగిన జనాభాకి అనుగుణంగా డివిజన్లను పునర్విభజన చేయాలంటూ తెలంగాణా ప్రభుత్వం ఇంతవరకు జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు వాయిదా వేస్తూ కాలక్షేపం చేస్తోంది. సుమారు 11 నెలలు గడిచినా సోమేశ్ కుమార్ ఆ ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు. పైగా అది సాధ్యం కాదని ప్రభుత్వానికి లేఖ వ్రాయడంతో ప్రభుత్వం పునర్విభజన ప్రక్రియను అర్ధాంతరంగా నిలిపివేయవలసి వచ్చింది. ఆ కారణంగా ప్రజలకు, ప్రతిపక్షాలకు చివరికి హైకోర్టుకి కూడా ప్రభుత్వం సంజాయిషీలు చెప్పుకొనే పరిస్థితి ఏర్పడింది.

ఇది కాక జి.హెచ్.ఎం.సి.పరిధిలో ఓటర్ల జాబితాలు సవరణ పేరిట 6.32 లక్షల మంది ఆంధ్రా ఓటర్ల పేర్లను తొలగించడం, మరికొన్ని లక్షల మంది పేర్లను తొలగించదానికి నోటీసులు పంపారు. అందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఆందోళన చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేయడంతో, డిల్లీ నుంచి పశ్చిమ బెంగాల్‌ సీఈవో సునీల్‌ గుప్తా నేతృత్వంలో ఉత్తరప్రదేశ్‌ అదనపు సి.ఈ.ఓ.,ఆరుగురు కార్యదర్శులు, ఆరుగురు సహాయ కార్యదర్శులతో కూడిన 14 మంది కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం హైదరాబాద్ వచ్చి క్షేత్ర స్థాయిలో విచారణ చేయడం మొదలుపెట్టింది. వారి ప్రాధమిక పరిశీలనలో ఓటర్ల జాబితా సవరణ పేరిట చాలా మంది పేర్లను అక్రమంగా తొలగించినట్లు గుర్తించినట్లు సమాచారం. దానిపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో తెరాస విజయం సాధించడం కోసమే ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమేశ్ కుమార్ ఇటువంటి పనులకు పూనుకొన్నారని ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసాయి. ఎన్నికల సంఘం ఆయనపై చర్యలు తీసుకొనే అవకాశం ఉండటంతో ప్రభుత్వం మిగిలిన ఐ.ఏ.ఎస్‌. అధికారులతో సహా సోమేశ్ కుమార్, జీహెచ్‌ఎంసీ స్పెషల్‌ కమిషనర్లు నవీన్‌ మిట్టల్‌, జి.కిషన్‌లను కూడా బదిలీ చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సోమేశ్ కుమార్ స్థానంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ప్రభుత్వం జనార్దన్‌ రెడ్డిని నియమించింది. కానీ మిగిలిన ఇద్దరి స్థానాలను వేరేవారితో భర్తీ చేయలేదు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే సోమేశ్ కుమార్ వ్యవహరించినప్పటికీ చివరికి ఆయనకు బదిలీ శిక్ష తప్పలేదు. ఆయనను అప్రధాన్య శాఖగా భావించే గిరిజన సంక్షేమ శాఖకు ముఖ్య కార్యదర్శిగా నియమించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరంజీవిని కలిసి ఆశీర్వాదం తీసుకున్న సోము వీర్రాజు..!

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా కొత్తగా నియమితులైన సోము వీర్రాజు మొదటగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. సాధారణంగా ఆయన...మొదట పవన్ కల్యాణ్‌ని కలుస్తారని భావించారు. అయితే.. పవన్ కల్యాణ్‌తో భేటీ కంటే...

అమరావతి నిధుల లెక్కలన్నీ అడిగిన హైకోర్టు..!

అమరావతిలో గత ప్రభుత్వం పెట్టిన రూ. వేల కోట్ల ప్రజాధనం వృధా పోతుందన్న పిటిషన్‌పై హైకోర్టు విచారమలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమరావతిలో రూ. 52 వేల కోట్ల రూపాయల...

జగన్‌కు గుడి కాదు చర్చి కట్టాలన్న ఆర్ఆర్ఆర్..!

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ముఖ్యమంత్రి జగన్ కు గుడి కట్టడానికి ఏర్పాట్లు చేయడం.. భూమి పూజ చేయడం వివాదాస్పదమవుతోంది. ఖచ్చితంగా అయోధ్య రామాలయానికి శంకుస్థాపన జరుగుతున్నప్పుడే.. తలారి...

మంచు వారి ‘ఓటీటీ’

ప్ర‌తీ సినీ కుటుంబానికీ ఓ నిర్మాణ సంస్థ ఉండ‌డం ఎంత స‌హ‌జంగా మారిందో, ఇప్పుడు ఓ ఓటీటీ సంస్థ ఉండ‌డం కూడా అంతే రివాజుగా మార‌బోతోంది. ఓటీటీ సంస్థ‌ల ప్రాధాన్యం క్ర‌మంగా పెరుగుతోంది....

HOT NEWS

[X] Close
[X] Close