ఎన్టీఆర్ బ‌ర్త్ డే… మూడు గిఫ్టులు

రేపు (బుధ‌వారం) ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా `ఆర్‌.ఆర్‌.ఆర్‌` నుంచి టీజ‌ర్ వ‌స్తుంద‌ని అంతా ఆశించారు. కానీ… అలాంటివేం లేద‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించేసింది. అయితే.. ఎన్ఠీఆర్ అభిమానులు డీలా ప‌డాల్సిన ప‌ని లేదు. ఎందుకంటే.. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` నుంచి ఎలాంటి స‌ర్‌ప్రైజులూ లేక‌పోయినా… ఎన్టీఆర్ బ‌ర్త్‌డే థూమ్ థామ్ గానే జ‌ర‌గ‌బోతోంది.

ఎన్టీఆర్ కోసం బిగ్ బాస్ 1 కంటెస్టెంట్లు ప్ర‌త్యేకంగా ఓ వీడియో రూపొందించారు. బిగ్ బాస్ 1కి ఎన్టీఆర్ హోస్ట్ అన్న సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి జ్ఞాప‌కాల‌నో, ఎన్టీఆర్ తో త‌మ అనుబంధాన్నో గుర్తు చేసుకుంటూ ఈ వీడియో ఉండ‌బోతోంద‌ని టాక్‌. ఈ వీడియోని బుధ‌వారం ఉద‌యం 9.30 ల‌కు సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ విడుద‌ల చేయ‌బోతున్నాడు. ఎన్టీఆర్ వ్య‌క్తిగ‌త ఫిట్‌నెస్‌ ట్రైన‌ర్ స్టిఫెన్స్ కూడా ఎన్టీఆర్ కి సంబంధించిన ఓ వీడియోని చూపించ‌బోతున్నాడు. బుధ‌వారమే ఈ వీడియో కూడా విడుద‌ల కానుంది. యువ క‌థానాయ‌కుడు ఫ‌ల‌క్‌నామా దాస్ హీరో విశ్వ‌క్ సేన్ ఎన్టీఆర్ పై ఓ రాప్ గీతాన్ని కంపోజ్ చేయించిన సంగ‌తి తెలిసిందే. ఈపాట కూడా రేపే బ‌య‌ట‌కు వ‌స్తోంది. మొత్తానికి ఎన్టీఆర్ పుట్టిన రోజున మూడు గిఫ్టులు సిద్ధం కాబోతున్నాయి. మ‌రి అవి ఎలా ఉంటాయో తెలియాలంటే ఇంకొన్ని గంట‌లు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓయ్ ద‌ర్శ‌కుడితో చిరు త‌న‌య‌

చిరంజీవి కుమార్తె సుస్మిత సైతం.. చిత్ర‌సీమ‌తో మ‌మేకం అవుతుంది. చిరు చిత్రాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా సేవ‌లు అందించింది. ఇప్పుడు నిర్మాత‌గానూ మారింది. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ ను స్థాపించి కొన్ని వెబ్...

గవర్నర్‌ను లైట్ తీసుకున్న తెలంగాణ అధికారులు..!

కరోనా వ్యాప్తి విషయంలో తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదు.. కాస్త పట్టించుకుందామనుకున్న గవర్నర్‌ను అధికార యంత్రాంగం లెక్క చేయడం లేదు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో.. సీఎం...

‘పుష్ష‌’ కోసం భారీ స్కెచ్‌

30 - 40 మందితో షూటింగులు జ‌రుపుకోండి... అంటూ ప్ర‌భుత్వాలు క్లియ‌రెన్స్ ఇచ్చేసినా - ఒక్క పెద్ద సినిమా కూడా ప‌ట్టాలెక్క‌లేదు. చిన్నా, చిత‌కా సినిమాలు, త‌క్కువ టీమ్ తో ప‌ని కానిచ్చేస్తున్నా,...

ఫ్లాష్ బ్యాక్‌: ఏఎన్నార్ డూప్ టూ‌ మూవీ మొఘ‌ల్‌!

1958 నాటి రోజులు. కారంచేడు అనే ఓ ఊరిలో 'న‌మ్మిన బంటు' సినిమా తీస్తున్నారు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు హీరో. ఆదుర్తి సుబ్బారావు ద‌ర్శ‌కుడు. ఊర్లో షూటింగ్ అంటే మామూలుగా ఉండేదా? ఆ హ‌డావుడే...

HOT NEWS

[X] Close
[X] Close