మాట మార్చిన ‘జిన్నా’

గాడ్ ఫాద‌ర్‌, ది ఘోస్ట్ సినిమాల‌తో పాటుగా… జిన్నా కూడా రిలీజ్ కానుంద‌ని ఓ వార్త చ‌క్క‌ర్లు కొట్టింది. ఏకంగా మెగాస్టార్‌పైనే పోటీగా దిగ‌డానికి మంచు విష్ణు సిద్ధ‌మ‌య్యాడ‌ని, అందుకే ఈ రిస్క్ తీసుకొన్నాడ‌ని అన్నారు. విష్ణు కూడా ‘అక్టోబ‌రు 5న వ‌స్తున్నా’ అంటూ ఓ హింట్ ఇచ్చాడు. అక్టోబ‌రు 5 ద‌గ్గ‌ర ప‌డుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌మోష‌న్లు ప్రారంభించ‌లేదు. స‌రిక‌దా.. ఇప్పుడు మాట మార్చాడు. “అక్టోబ‌రు 5న వ‌స్తున్నా అన్నా.. కానీ సినిమా రావ‌డం లేదు. ట్రైల‌ర్ వ‌స్తోంది. అక్టోబ‌రు 21న మా సినిమాని విడుద‌ల చేస్తామ‌“ని ఇప్పుడు క్లారిటీ ఇచ్చాడు విష్ణు. ఈరోజు… మీమర్స్‌, ట్రోల‌ర్స్ తో ఓ మీటింగ్ పెట్టుకొన్నాడు విష్ణు. త‌న‌ని ట్రోల్ చేసేవాళ్ల‌తో.. ఓ ప్రెస్ మీట్ పెట్ట‌డం బ‌హుశా.. విష్ణుకే సాధ్య‌మేమో..? ఈ సంద‌ర్భంగా కొత్త రిలీజ్ డేట్ ప్రక‌టించాడు. దాంతో పాటు.. ట్రోలర్స్‌కి ఓ విన్న‌పం అంటూ… త‌న మ‌న‌సులోని బాధని బ‌య‌ట‌పెట్టాడు.

“సినిమా బాగాలేక‌పోతే తిట్టండి.. విమ‌ర్శించండి. నేను ఏమీ అనుకోను. కానీ ఫ్యామిలీల‌ను మాత్రం ఇందులోకి లాక్కండి. ప్ర‌తీ ఒక్క‌రికీ కుటుంబాలు ఉన్నాయి. ఆ సంగ‌తి గుర్తు పెట్టుకోండి“ అని మీమ‌ర్స్‌ని కోరాడు విష్ణు. అన్న‌ట్టు ఈ సినిమా తెలుగు, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల అవుతోంది. క‌న్న‌డ‌, త‌మిళ సీమ‌ల్ని విష్ణు ఎందుకు వ‌దిలేశాడో మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజకీయాల్లో ఫెయిలయ్యా : పవన్ కల్యాణ్

రాజకీయాల్లో ఫెయిలయ్యానని.. కానీ మళ్లీ పట్టుదలగా ప్రయత్నిస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యామ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో చార్టెడ్ అకౌంటెంట్స్ విద్యార్థుల సమావేశంలో ప్రసంగించడానికి ఆయనకు నిర్వాహకులు ఆహ్వానం పంపారు. దానికి...

లొంగని వాళ్ల వ్యాపారాల్ని కూల్చలేదా .. మంత్రిగారూ !?

ఏపీ నుంచి పారిశ్రామికవేత్తలు పరారవుతున్న విషయం కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అయినా సరే చిత్ర, విచిత్ర వితండ వాదాలతో మంత్రులు తెర ముందుకు వస్తూనే ఉంటారు. అమరరాజా పెట్టుబడి తెలంగాణకు తరలి...

ప్లాన్ చేంజ్ .. ఎఫ్ఐఆర్ కాపీలివ్వాలని సీబీఐకి కవిత లేఖ !

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో కల్వకుంట్ల కవిత వ్యూహం మార్చినట్లుగా కనిపిస్తోంది. సీబీఐ నుంచి నోటీసు అందగానే... హైదరాబాద్‌లోని తమ ఇంట్లో విచారణకు సిద్ధమని ఆమె ప్రకటించారు. అయితే ఇప్పుడు ఫిర్యాదు...

నిర్మాతగా దశరధ్

సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి క్లాస్ ఎంటర్ ఎంటర్‌టైనర్‌లను అందించి దర్శకుడు కె దశరధ్. అయితే 2016లో మంచు విష్ణుతో చేసిన శౌర్య సినిమా తర్వాత మళ్ళీ మెగాఫోన్ పట్టుకోలేదు. అయితే చాలా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close