రాజధాని రైతులకు కౌలు బకాయిల జీవో రిలీజ్..!

రాజధాని రైతులు కౌలు కోసమే ఆందోళన చేస్తున్నారని చెప్పిన పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ మాటలను..ఏపీ సర్కార్ నిజం చేసింది. రాజధాని రైతుల కౌలు బకాయిలు.. రూ.187.40 కోట్లను విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. ఈ మొత్తాన్ని రైతులకు చెల్లించేందుకు.. సీఆర్డీఏ, మునిసిపల్‌ శాఖ ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చినందుకు ఏపీ సీఆర్‌డీఏ ప్రతి ఏడాది కౌలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. రాజధాని పరిధిలోని 29గ్రామాల్లో 33వేల ఎకరాలను 27 వేల మంది రైతులు అమరావతి నిర్మాణానికి ఇచ్చారు. పదేళ్ల పాటు మెట్టభూమికి ఎకరానికి రూ.30వేలు, జరీబు భూములకు రూ.50వేల చొప్పున ప్రభుత్వం కౌలు చెల్లిస్తోంది.

ప్రతి సంవత్సరం 10శాతం పెంచుతూ పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఏడాది జూన్‌ నెలలో కౌలు నగదు చెల్లిస్తున్నారు. 2019-20 సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆగస్టు వచ్చినా.. కౌలు అందకపోవడం… రాజధానిపై భిన్నమైన ప్రకటనలు చేస్తూండటంతో.. రైతులు ఆందోళనకు గురయ్యారు. అయితే..రైతుల ఆందోళనను వీలైనంతగా తగ్గించడానికి కౌలు బకాయిల్ని ప్రభుత్వం విడుదల చేస్తూ జీవో జారీ చేసినట్లుగా తెలుస్తోంది. మామూలుగా రైతులకు ఈ బకాయిలు అందించడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాల్సిన పని లేదు. నేరుగా బ్యాంక్ అకౌంట్లలో ప్రతీ ఏటా పడుతుంది. కానీ ఈ సారి మాత్రం మరో విభిన్నమైన ప్రక్రియ ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది.

కౌలు విషయాన్ని రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టే.. విడుదల చేశామని.. జీవో విడుదల తర్వాత మంత్రి బొత్స ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించుకున్నారు. రాజధాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాజధానిపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ప్రకటించారు. కరకట్టపై ఇల్లు మునుగుతుందని తెలిసే… చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్ వెళ్లిపోయారని బొత్స ఆరోపించారు. మొత్తానికి రాజాధాని రైతుల విషయంలో.. ఇప్పటికి కౌలు జీవో రిలీజ్ చేసిన సర్కార్… అసలు రాజధానిపై ఏం నిర్ణయం తీసుకోబోతోందో మాత్రం త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close