చిరు బ‌ర్త్ డే గిఫ్టులు.. ఓ రేంజ్‌లో!

ఆగ‌స్టు 22న చిరంజీవి పుట్టిన రోజు. అందుకోసం చిరు ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈసారి బ‌ర్త్ డే గిఫ్టులు ఓ రేంజ్‌లో ఉండ‌బోతున్నాయి. చిరు న‌టిస్తున్న మూడు సినిమాలు ఇప్పుడు చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్నాయి. ‘భోళా శంక‌ర్‌’, ‘వాల్తేరు వీర‌య్య‌’ శ‌ర వేగంగా షూటింగ్ జ‌రుపుకొంటున్నాయి. ‘గాడ్ ఫాద‌ర్‌’ షూటింగ్ దాదాపుగా పూర్త‌యిపోయింది. వీటికి సంబంధించిన లుక్కులూ, టీజ‌ర్లూ… చిరు పుట్టిన రోజునే వ‌స్తున్నాయి.

21న ‘గాడ్ ఫాద‌ర్‌’ టీజ‌ర్ వ‌స్తోంది. ‘వాల్తేరు వీర‌య్య‌’ ఫ‌స్ట్ లుక్ ని 22న విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో చిరు మాస్ అవ‌తార్‌లో ద‌ర్శ‌నమివ్వ‌బోతున్నాడ‌ని, ఫ‌స్ట్ లుక్‌తోనే ఫ్యాన్స్ ని మెస్మ‌రైజ్ చేయాల‌న్నంత క‌సితో ఈ లుక్ ని డిజైన్ చేశార‌ని టాక్‌. ఈ సినిమా టైటిల్ ‘వాల్తేరు వీర‌య్య‌’ అని జ‌నం అనుకోవ‌డ‌మే త‌ప్ప‌… చిత్ర‌బృందం అధికారికంగా ఫిక్స్ చేయ‌లేదు. పుట్టిన రోజు సంద‌ర్భంగా టైటిల్ కూడా కూడా అఫీషియ‌ల్ గా ప్ర‌క‌టిస్తారు. ఇక `భోళా శంక‌ర్‌`కి సంబంధించి ఓ పాట గానీ, చిన్న టీజ‌ర్ గానీ వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అంటే చిరు బ‌ర్త్ డేకి.. మూడు గిఫ్టులు గ్యారెంటీ అన్న‌మాట‌. ఇక చిరు కొత్త సినిమా సంగ‌తులేమైనా ఆ రోజు బ‌య‌ట‌కు వ‌స్తాయేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలిచ్చిన రేవంత్ రెడ్డి !

జర్నలిస్టులు సుదీర్ఘంగా చేస్తున్న పోరాటం ఫలించింది . జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ కింద గతంలో కేటాయించిన భూమిని ఇప్పుడు రేవంత్ రెడ్డి హ్యాండోవర్ చేశారు. ఈ భూమికి ఒక్కో జర్నలిస్టు...

కూల్చివేతలపై హైడ్రా కీలక నిర్ణయం!

ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా వరుసగా కొరడా ఝులిపిస్తోంది. ఓ వైపు హైడ్రా పనితీరుపై ప్రశంసల జల్లు కురుస్తున్నా..మరోవైపు ఉన్నపళంగా భవనాలను కూల్చివేస్తుండటంపై తీవ్ర విమర్శలు...

జయభేరీది కార్ సర్వీసింగ్ సెంటర్ !

జయభేరీ మూడున్నర దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉంది కానీ ఇప్పటి వరకూ ఆ సంస్థపై చిన్న ఆరోపణ రాలేదు. క్లీన్ ఇమేజ్ తో వినియోగదారుల నమ్మకాన్ని చూరగొన్న సంస్థ. అయితే...

దివ్వెలకు ఇల్లు రాసిచ్చేసిన దువ్వాడ !

దివ్వెల మాధురీ పది రోజులు సైలెంట్ గా ఉంటానంటే.. అందరూ ఏంటో అనుకున్నారు. ఈ పది రోజుల్లో ఆమె సైలెంట్ గా తన పని తాను పూర్తి చేసుకుంది. టెక్కలిలో ఉన్న దువ్వాడ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close