పూలూ, రాళ్ళూ ఆయనకే! గోదావరి పుష్కరాలపై విశ్లేషణ 2

గోదావరి పుష్కరాలలో శానిటేషన్ కోసం మనిషికి రోజుకి 425 రూపాయలు ప్రభుత్వం నుంచి వసూలుచేస్తున్న కాంటా్రక్టర్, తమకు 325 రూపాయలే ఇస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్న విషయం మీ దృష్టికి వచ్చిందా అన్న ప్రశ్నకు ”అలా జరగకూడదే ఎంక్వయిరీ చేయిస్తాము అని సమాచారశాఖ మంత్రి పల్లెరఘునాధ రెడ్డి అన్నారు. ”అది వేరేమంత్రి చూస్తున్నారు”అని జిల్లా ఇన్ చార్జ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ”పని కాంటా్రక్టుకి ఇచ్చేశాక మనకి సంబంధం ఏమిటి” అని మున్సిపల్ వ్యవహారాల మంత్రి నారాయణ ప్రశ్నించారు.

ప్రజల బాధ్యతల నుంచి సంక్షేమరాజ్యాన్ని తప్పింస్తున్న సరళీకృత ఆర్ధిక విధానాలు నేపధ్యంలో ప్రజాజీవనంలో లేని మంత్రి నారాయణ మాత్రమే ఉన్నది ఉన్నట్టు చెప్పారు. మిగిలిన ఇద్దరూ వాస్తవాన్ని ఒప్పుకోలేక కార్మికవర్గాలకు దూరం కాలేక నంగి నంగి మాటలతో విషయాన్ని దాటవేశారు. నిజానికి ఇది ముగ్గురు మంత్రుల మాటకాదు. ఓట్లుగానే కనబడే ప్రజలకు దూరంకాలేని పాలకపక్షాల అవస్ధ.

ఈ అవస్ధవల్లే అబద్దాలు చెప్పడమో, విరుద్దవైఖరులను ప్రదర్శించి విమర్శలపాలు కావడమో ముఖ్యమంత్రులకు కూడా తప్పడం లేదు. చంద్రబాబు ఇందుకు అతీతులు కారు. ఘాట్లలో, సర్వీసు రోడ్లలో, జనసమూహాలు వుండే ప్రతీ చోటా స్ధానిక స్వచ్ఛంద సంస్ధల వారిని సహాయకారులుగా నియమించడం వల్ల డ్యూటీలో వున్న వేర్వేరు శాఖలకు వీరు సహాయకారులై వుంటారు. తాగునీరు, టీకాఫీలు, భోజనం పొట్లాలలను ఈ సంస్ధలే సమకూర్చుకుని, సమీకరించుకుని యాత్రికులకు ఇబ్బందిలేకుండా చూస్తారు. క్యూలలో రద్దీని క్రమబద్ధం చేసేవారు.ఇది కొత్త ఆలోచన కాదు. ప్రతీ పుష్కరంలోనూ జరుగుగుతున్న పనే.
ఈ సారి అనుభవం లేని వారూ అహంకారులు కూడా అయిన స్ధానిక రెవిన్యూ, పోలీసు అధికారులు ప్రభుత్వోద్యోగులు, పోలీసులకు తప్ప ఇతర సంస్ధలను ఇన్వాల్వ్ చేయనవసరంలేదని నిర్ణయించేశారు.

విలేకరులు ముఖ్యమంత్రికి ఈ నిర్ణయాన్ని వివరించి స్వచ్చంద సంస్ధల్ని భాగస్వాములుగా చేయలేకపోతే యాత్రికులకు ముఖ్యంగా తాగునీరు, ఆహారం పంపిణీ తీవ్రమైన సమస్య కాగలదని మూడుసార్లు చెప్పారు. దీనిపై ఆయన ” నువ్వు ప్రతీసారీ ఇదే చెబుతున్నావు చిన్నచిన్న వాళ్ళను అనుమతించి పబ్లిక్ హెల్త్ తో రిస్క్ చెయ్యలేను ఇన్ ఎ బిగ్ వే నువ్వువచ్చినా పని ఇస్తాను” అని అసహనం ప్రదర్శించారు. స్వచ్చంద సేవకు బిగ్ వే అని స్కేల్ నిర్ణయించడం ఏమిటో ఆయనకే తెలియాలి. ఆప్రకారమే ‘బిగ్ వేలో’ వాటర్ సాచెట్స్ వచ్చేశాయి. వాటికి చెక్ అండ్ ఆడిట్ లేదు. యాత్రికుల నీటికటకటా తగ్గలేదు. చివరికి రాజమండ్రి ప్రజలందరూ యాత్రికులకు యధాశక్తి నీళ్ళూ, వీలైతే ఆహారము ఇవ్వండి అని ముఖ్యమంత్రి స్వయంగా పిలుపు ఇవ్వవలసి వచ్చింది. ఇదంతా యాత్రికులు నీళ్ళు లేక అవస్ధపడ్డారని చెప్పడానికి కాదు.ప్రజాహిత సంస్ధలకంటే, సొంత పార్టీ నాయకుల కంటే అధికారుల మీదే ఆధారపడే ధోరణిని చంద్రబాబు ఇంకా సాగిస్తున్నారని చెప్పడానికే .

చంద్రబాబు నాయుడు లో నాయకుడికంటే కార్పొరేట్ ఎగ్జిక్యూటివే ఎక్కువగా కనిపిస్తారు. కెసిఆర్ విమర్శలనో, జగన్ విమర్శలనో ఖండించవలసి వచ్చినపుడు ఆయనలో ఈజ్ అంతబాగా వుండదు. అదే ఒక యాక్షన్ ప్లాన్ ప్రస్తావన వస్తే చాలు కనుబొమలు ఎగరేస్తూ అతి సూక్ష్మమైన వివరాలను కూడా ఏకధాటిగా వివరించగలుగుతారు.

బెస్ట్ ప్రాక్టీస్, సింకర్నైజేషన్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ప్రొఫెషనలిజమ్ లాంటి మాటలు రాజకీయాల్లో తక్కువవినిపిస్తాయి. చంద్రబాబు సమీక్షా సమావేశాల్లో ఈ టెర్మినాలజీ మాత్రమే వినిపిస్తూంది. ముఖ్యమంత్రి మాట్లాడుతూ వుంటారు. యువ అధికారులు అతికొద్దిమంది నాయకులు స్మార్ట్ ఫోన్ లను ఉపయోగించుకుంటూ ఆయనకు సమాధానాలు, వివరణలు ఇస్తారు. తమ చేతిలో వున్న ఐపాడ్లు ముఖ్యమంత్రికి కనిపించేలా సర్దుకుని కూర్చునే పెద్ద వయసు అధికారుల మొహాలు గమనిస్తే వారు ఇలాంటి గాడ్జెట్టులను వినియోగించడంలో నిస్సహాయులని అర్ధమైపోతుంది.

ఐడి కార్డులు మెడలో వేసుకుని దిగువవారికి సూచనలిస్తూ హడావిడిగా కనబడిన గాడ్జెట్ బాబులే పుష్కరాలను నిర్వహించేశారు. ఇదంతా చూస్తూవుండటం తప్ప మాకు పెద్దగా పనేలేకుండా పోయింది. అని అనేక మంది సీనియర్ అధికారులు చెప్పుకొచ్చారు.

అయితే చంద్రబాబు నిర్విరామంగా చేసిన కృషి ఫలించలేదంటే అది పెద్ద తప్పు అవుతుంది. ఆయన స్వియ పర్యవేక్షణ వందలాదిమంది ఉద్యోగులను మోటివేట్ చేసింది. మోటివేషన్ చిన్న విషయంకాదు. పుష్కరాలు ముగిసిన మర్నాడు సభలో ఇందులో పాల్గొన్న 28 శాఖల ప్రతినిధులూ మాట్లాడారు. వారి అనుభవాలు చెబుతూ ఇతర శాఖల వారు ఎంత అద్భుతంగా పనిచేశారో కూడా వివరించారు. ఇది ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. చంద్రబాబు తరచు సూచించే టీమ్ వర్క, వర్క కల్చర్ ఇదే. అందరూ ఇన్వాల్వ్ అయ్యే వాతావరణం తీసుకు రాలేకపోవడం వల్ల ఈ విజయాన్ని అందరూ ఆస్వాదించలేకపోయారు. ఓటుకి నోటు కేసువల్ల చాలాకాలం చంద్రబాబు ఫోకస్ తప్పిపోయి మైక్రో ప్లానింగ్ ఆయన చేతుల్లో లేకుండా పోయింది. మొదటి రోజు తొక్కిసలాట మరణాల వల్ల ఏమి లోటనిపించినా ఆఘమేఘాల మీద రప్పించి సప్లయర్ల, అధికారుల జేబులు నిండటానికి కారకులయ్యారు.

ఏమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తశుద్దినీ, కష్టపడే స్వభావాన్నీ బేషరతుగా ప్రశంసిస్తున్నాకూడా, ప్రజాధనం ముడిపడి వున్న ఏ పనికైనా ఫలాతాల్నీ, పర్యావసానాల్నీ బేరీజు వేయకుండా వుండటం సాధ్యం కాదు. పుష్కరాలు విజయవంతం కావడానిక ఆయనే కారణం. అపశృతులకు కూడా ఆయనే బాధ్యత వహించాలి.

గోదావరి పుష్కరాల పూలూ చంద్రబాబుకే! రాళ్ళూ చంద్రబాబుకే!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు

ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయింది. ముందుగా ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టారు. కృష్ణా – గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ...

బ్యారేజీలో బోట్లు తీయడం పెద్ద టాస్కే !

ప్రకాశం బ్యారేజీలో బోట్లు బయటకు రావడం లేదు, ఎంత మంది నిపుణులు వచ్చినా రోజుల తరబడి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అనేక కోణాల్లో ప్రయత్నించారు కానీ ఇప్పటి వరకూ పెద్దగా ప్రయోజనం కలగలేదు....

బెల్లంకొండ‌తో అతిథి శంక‌ర్‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్‌, మంచు మ‌నోజ్‌, నారా రోహిత్ క‌లిసి ఓ సినిమా చేస్తున్నారు. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన 'గ‌రుడ‌న్`కి ఇది రీమేక్‌. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి 'వీర ధీర శూర‌'...

సిమ్లాలోనూ మత చిచ్చు !

హిమాచల్ ప్రదేశ్ మొత్తం మీద లక్షన్నర మంది ముస్లింలు ఉంటారు. ఇతర వర్గాలన్నీ కలిపి అరవై లక్షల వరకూ ఉంటారు. అయినా అక్కడ హేట్ పాలిటిక్స్ ప్రారంభమయ్యాయి. సిమ్లాలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close