రివ్యూ : గాడ్ ఫాదర్

GodFather Movie Telugu Review

తెలుగు360 రేటింగ్: 3/5

రీమేకులు అంత సులువు కాదు. ఒక భాషలో విజయం సాధించిన సినిమాని మరో భాషలో తీస్తే ఆడాలని రూలు లేదు. అయితే రీమేక్స్ లో వున్న సౌలభ్యం ఏమిటంటే.. ఆల్రెడీ జనామోదం పొందిన కథ వుండటం. కథ ఏభాషలో వున్నా.. బావుంటే వినడానికి, చూడాటానికి సహజంగానే ఇష్టపడతాం. అందుకే రీమేక్ సినిమాలపై ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఓటీటీ అరచేతికి వచ్చేసిన ఈ రోజుల్లో కూడా ఇంకా రీమేక్ సినిమాలకు మనుగడ వుందా ? అనే చర్చ ఓ వైపు నడుస్తుంది. ఇలాంటి సమయంలో చిరంజీవి లూసిఫర్ ని గాడ్ ఫాద‌ర్‌ గా రిమేక్ చేశారు. సల్మాన్ ఖాన్ ఈ ప్రాజెక్ట్ లోకి రావడం మరింత ఆసక్తిని పెంచింది. రీమేక్ రాజాగా పేరు తెచ్చుకున్న మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకుడు. లూసిఫర్ లో లేని పది సర్ ప్రైజ్ గాడ్ ఫాదర్ లో వున్నాయి, స్క్రీన్ ప్లే మార్చేశామని చెప్పాడు మోహన్ రాజా. అటు మెగాస్టార్ కూడా లూసీఫర్ చూశాక చిన్న వెలితి క‌నిపించింది, కానీ దర్శకుడు మోహన్ రాజా ఆ వెలితిని తొలిగించి సరికొత్తగా గాడ్ ఫాదర్ ని ఆవిష్కరించాడని చెప్పారు. దీంతో లూసిఫర్ చూసేసిన ప్రేక్షకుల్లో కూడా గాడ్ ఫాదర్ కొంత పై ఆసక్తిని రేపారు. ఇంతకీ గాడ్ ఫాదర్ కోసం చేసిన మార్పులు ఏమిటి ? లూసిఫర్ మ్యాజిక్ ని గాడ్ ఫాదర్ రిక్రియేట్ చేయగలిగిందా ?

జన జాగృతి పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి పీకెఆర్ (సర్వదమన్ బెనర్జీ ) ఆకస్మికంగా కన్నుమూస్తాడు. ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీలో చైర్ వార్ మొదలౌతుంది. పిఆర్ కె కుమార్తె సత్యప్రియ (నయనతార) అల్లుడు జైదేవ్ (సత్యదేవ్ ). జైదేవ్ క్రూరుడు. అతనికి ముఖ్యమంత్రి పై పదవి ఆశ వుంటుంది. డ్రగ్స్ దందా కూడా చేస్తుంటాడు. మరో వైపు పార్టీలో నెంబర్ టూ చెలామణి అవుతున్న వర్మ (మురళి శర్మ )కి కూడా ముఖ్యమంత్రి పదవి కన్ను వుంటుంది. సత్యప్రియకి మాత్రం ఎలాంటి రాజకీయా ఆలోచనలు వుండవు. ఎక్కడో మారుమూల అనాధాశ్రామాన్ని నడుపుతుంటాడు బ్రహ్మ(చిరంజీవి). చనిపోయిన పికెఆర్ కి బ్రహ్మకి ప్రపంచానికి తెలియని ఒక అనుబంధం వుంటుంది. కానీ సత్యప్రియకి బ్రహ్మ అంటే గిట్టదు. అతడ్ని తీవ్రంగా ద్వేషిస్తుంటుంది. ముఖ్యమంత్రి పదవి కోసం పికెఆర్ కుటుంబాన్నే అంతం చేయాలని జైదేవ్ కుట్రపన్నుతాడు. బ్రహ్మ, జైదేవ్ చేస్తున్న కుట్రని పసిగడతాడు. పికెఆర్ కుటుంబాన్నీ, ఆయన రాజకీయ వారసత్వాన్నీ నిలబెట్టేందుకు ముందుకు వస్తాడు. అసలు ఎవరీ బ్రహ్మ‌ ? అతని నేపథ్యం ఏమిటి ? పికేఆర్ కి అతనికి వున్న అనుబంధం ఏమిటి ? అనేది మిగతా కథ.

లూసిఫర్ గొప్ప కథ కాదు కానీ మంచి కథ. పదవి కోసం ఒక రాజకీయ కుట్ర, కుటుంబం కోసం నిలబడిన హీరో .. ఇలాంటి కథలు చాలా వచ్చాయి. అయితే లూసిఫర్ లో ప్రత్యేకత.. మోహన్ లాల్, ఆ పాత్రని డిజైన్ చేసిన విధానం. చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్. పాసివ్ గా వుంటూనే హైలీ ఇంటెన్స్ తో వుంటుంది. లూసిఫర్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో, ఏం ఆలోచిస్తుంటాడనేది ప్రేక్షకులకు ఆస‌క్తి క‌లిగిస్తుంది. గాడ్ ఫాదర్ దర్శకుడు మోహన్ రాజా..,ఆ పాత్రని, కథని ఎలాంటి మార్పులు చేయలేదు. ఆ పాత్రలో వున్న పవర్ ని రీ క్రియేట్ చేయడానికి ప్రత్నించాడు. ఈ రిక్రియేషన్ తెరపై కనిపించినప్ప‌టికీ .. చిరంజీవి కి లూసిఫర్ చూసినప్పుడు ఎలాంటి వెలితి అనిపించిందో.. గాడ్ ఫాదర్ చూస్తున్నప్పుడు కూడా అదే వెలితి అనిపిస్తుంది.

స్క్రీన్ ప్లే లో చాలా మార్పులు చేశానని చెప్పాడు మోహన్ రాజు. కొన్ని మార్పులు వున్నాయి కానీ కథా గమనం మాత్రం లూసిఫర్ లానే వుంటుంది. పికేఆర్ మరణం, కుటుంబంలోని పాత్రల పరిచయం, పార్టీలో నాయకుల ఎత్తుగడలు,.. ఇవన్నీ లూసిఫర్ లానే యధాతదంగా తీశారు. అయితే గాడ్ ఫాదర్ పాత్రని మాత్రం త్వరగానే ప్రేక్షకులకు పరిచయం చేయగలిగాడు దర్శకుడు. అయితే లూసిఫర్ పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా కాదు. ‘’లూసిఫర్’’ పాత్ర నేపధ్యంలో ఒక డీప్ ఫిలాసఫీ వుంటుంది. కానీ ఇందులో మాత్రం ప్రజల కోసం బ్రతికే వాడే గాడ్ ఫాదర్ అని అర్ధం వచ్చేట్లు బ్రహ్మ తల్లి పాత్రతో చెప్పించి ఫిలాసఫీ జోలికి పోకుండా సింపుల్ గా తేల్చేశారు. జైదేవ్ క్రూరత్వాన్ని ఇంపాక్ట్ ఫుల్ గానే చూపించారు. బ్రహ్మ, జైదేవ్ ల మీటింగ్ తర్వాత కథలో కొంత వేగం వస్తుంది. అయితే లూసిఫర్ చాలా నింపాదిగా నడిచే కథ. మోహన్ రాజా కథనం వేగం తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ మెగా అభిమానులు కోరుకునే వేగం మాత్రం ఇందులో వుండదు. ఇది కొంచెం ఓపిక తెచ్చుకొని చూడాల్సిన కథ. పార్టీ అధినేతగా సత్యప్రియని ఎంపిక చేయడం, బ్రహ్మ జైల్లో వున్నపుడు తన పవర్ ఏంటో జైదేవ్ కి చూపించే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

సల్మాన్ పాత్రని ఇంటర్వెల్ బాంగ్ గా వాడుకోవడం ఫ్యాన్స్ కి నచ్చుతుంది. లూసిఫర్ చూడని ప్రేక్షకులు విరామం తర్వాత సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తాడని అనుకోని థియేటర్లో కి మళ్ళీ అడుగుపెడితే నిరాశతప్పదు. సల్మాన్ మళ్ళీ కనిపించేది క్లైమాక్స్ లోనే. సత్యప్రియ, బ్రహ్మతో కలిసిన తర్వాత కథ క్లైమాక్స్ కివచ్చేసినట్లే. సత్యదేవ్ ని ఫినిష్‌ చేయడమే బ్రహ్మకి మిగిలిన లక్ష్యం. అయితే అప్పటికే బ్రహ్మ పవర్ ఏంటో తెలియడంతో బ్రహ్మ , జైదేవ్ ని ఫినిష్ చేయడం పెద్ద సవాల్ కాదనే ఫీలింగ్ ప్రేక్షకుడిలో వుంటుంది. దీంతో క్లైమాక్స్ అంత ఎక్సయిటింగా వుండదు. అయితే సల్మాన్ ఖాన్ స్క్రీన్ పైకి వచ్చి యాక్షన్ చేయడం కాస్త రిలీఫ్.క్లైమాక్స్ ప్రేక్షకుడు ఊహించినట్లే వుంటుంది. అయితే సత్యప్రియ పాత్రని మోహన్ రాజా చాలా మార్చాడు. లూసిఫర్ లోని తమ్ముడు పాత్రని తీసేసి ఆ స్పేస్ కూడా సత్యప్రియకే ఇచ్చాడు. దీని వలన కథలో ఎలాంటి మార్పు జరగలేదు కానీc పికెఆర్ వారసురాలిగా సత్యప్రియని చేయడం కథకి కొంత హుందాతనాన్ని జోడించింది.

బ్రహ్మ పాత్రలో చిరంజీవి కొత్తగా కనిపిస్తారు. ఫవర్ ఫుల్ పాత్రలని పాసివ్ ఇంటన్సిటీ తో ప్లే చేయడం చిరంజీవికి అరుదు. ఆయన సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ కూడా బావుంది. కళ్ళతోనే నటించే కొన్ని సన్నివేశాలు వున్నాయి. జైల్లో చిరు కళ్ళతో చేసే ఒక సీన్ అభిమానుల‌కు `వావ్` అనిపిస్తుంది. చెల్లి సత్యప్రియని కలసినప్పుడు చిరు చూపించిన ఎమోషన్స్ కూడా అభిమానుల‌కు న‌చ్చే అంశ‌మే. యాక్షన్ సీన్ లో కూడా చాలా ఎనర్జిటిక్గా కనిపించారు. చివర్లో వచ్చిన థార్ మార్ పాటలో లో
కూడా బ్రహ్మ పాత్రకి కట్టుబడిపోయి పెద్దగా గ్రేస్ చూపించలేదు. సల్మాన్ పాత్ర ఒక సర్ ప్రైజ్ గా వుంటుంది.

జైదేవ్ పాత్ర లో సత్యదేవ్ విలనిజం పండించాడు. చిరుకి ఎదురుగా విలన్ గా నిలబడటం అంత ఈజీ కాదు., ఐతే సత్యదేవ్ తన ఈజ్ చూపించాడు. తన ప్రతిభతో ఆపాత్రకి న్యాయం చేశాడు. సత్యప్రియ పాత్రలో నయనతార హుందాగా కనిపించింది.ఎమోషనల్ సీన్స్ లో నయన్ ఆకట్టుకుంది. మురళి శర్మకి పెద్ద పాత్రే పడింది. వర్మ ఆయన అనుభవం చూపించారు. పూరిది చిన్న పాత్రే. కానీ గుర్తుంటుంది. సునీల్ , బ్రహ్మజీ, షఫీ, సముద్రఖని, గెటప్ శ్రీను .. పాత్రలు పరిధిమేర వున్నాయి. సినిమా సాంకేతికంగా ఉన్నతంగా వుంది. తమన్ నేపధ్య సంగీతంలో మరోసారి తన మార్క్ చూపించాడు. చాలా ఎనర్జిటిక్ స్కోర్ చేశాడు. ఎలివేషన్ లోఅదరగొట్టాడు. పాటలకు పెద్ద స్కోప్ లేదు. నిరవ్ షా కెమెరాపని తనం ఆకట్టుకుంది. లక్ష్మీ భూపాల మాటలు కొన్ని మెరుస్తాయి. క‌థ‌కు, స‌న్నివేశాల‌కు త‌గిన‌ట్టు మాట‌లు రాశారాయ‌న‌. ముఖ్యంగా రాజ‌కీయ నేప‌థ్యంలో ఆయ‌న రాసిన మాట‌లు థియేట‌ర్లో పేలాయి. మీడియాపై కూడా కొన్ని సెటైర్లు ప‌డ్డాయి. నిర్మాణ విలువలకు ఏమాత్రం వంకపెట్టలేం. లూసిఫర్ చూసిన ప్రేక్షకులకు మోహన్ లాల్ స్థానంలో చిరంజీవి కనిపిస్తారు. ఒకవేళ లూసిఫర్ చూడనివారు గాడ్ ఫాదర్ ని చూస్తే మాత్రం.. చిరంజీవి పాటలు హీరోయిన్ లేకుండా ఎదో కొత్తగా ప్రయత్నించారనే భావన కలుగుతుంది. అయితే అందులోనూ ఎక్కడో ఎదో చిన్న వెలితి మాత్రం వుంటుంది.

ఫినిషింగ్ ట‌చ్‌: `గుడ్‌’ ఫాద‌ర్‌

తెలుగు360 రేటింగ్: 3/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close