రికార్డ్ స్థాయికి చేరుకున్న బంగారం ధరలు కొన్ని రోజులుగా దిగి వస్తున్నాయి. గురువారం ఒక్కరోజే పసిడి ధరల్లో భారీ పతనం నమోదైంది. దీంతో దేశీయ మార్కెట్ లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 2,180 తగ్గింది. ప్రస్తుతం తులం బంగారం ధర రూ.95,730 వద్ద కొనసాగుతోంది.
ఇటీవల బంగారం ధరలు అనూహ్యంగా పెరగడంతో ఇక ఇప్పట్లో దిగిరావని ఆ మధ్య దేశీయంగా ఆందోళన కనిపించింది. అంతర్జాతీయంగా వాణిజ్య రంగంలో యుద్ద వాతావరణం నెలకొనడంతో ఇప్పట్లో ధరల తగ్గింపు ఉండదని విశ్లేషకులు అంచనా వేశారు. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా సానుకూల వాతావరణం నెలకొంటుండంతో దేశీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 3,236.94 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. చైనా – అమెరికా మధ్య టారిఫ్ వార్ క్రమంగా తగ్గడం , రష్యా – ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలకు సానుకూలత ఏర్పడుతుండటం పసిడి ధరలపై ప్రభావం చూపాయని అంటున్నారు విశ్లేషకులు.