మెలోడీకి.. ఇది మంచి డీలే!

వ‌రుస ప‌రాభ‌వాల దృష్ట్యా.. సినిమాల్ని కొనే విష‌యంలో ఓటీటీ సంస్థ‌లు ఆచి తూచి అడుగులేస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా చిన్న సినిమాల‌కు ఆమ‌డ దూరం ఉంటున్నాయి. అమేజాన్ లాంటి సంస్థ‌లైతే.. కొన్నాళ్ల పాటు చిన్న సినిమాల్ని కొనొద్ద‌ని గ‌ట్టిగా తీర్మాణించుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆనంద్ దేవ‌ర‌కొండ సినిమా `మిడిల్ క్లాస్ మెలోడీస్‌` ఇప్పుడు అమేజాన్‌లో విడుద‌ల అవుతోంది. చిన్న సినిమాల్ని పే ఫ‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిన (ఎంత‌మంది చూస్తే అన్ని డ‌బ్బులు) కొనుక్కునే అమేజాన్ ఈసినిమాకి మాత్రం మంచి రేటు ఇచ్చింది. రూ.4.5 కోట్ల‌కు `మిడిల్ క్లాస్‌..`ని కొనేసింది. ఆనంద్ సినిమాకి ఇది మంచి రేటే. త‌న తొలి సినిమా `దొర‌సాని` ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌క‌పోయినా, ఆ ప్ర‌భావం ఈ సినిమాపై ప‌డ‌లేదు.

పైగా ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ కి మంచి స్పంద‌న వ‌చ్చింది. కేవ‌లం 5 రోజుల్లోనే 10 మిలియ‌న్‌ వ్యూస్ ని సొంతం చేసుకుంది. చిన్న సినిమా ట్రైల‌ర్‌కి ఈ స్థాయి వ్యూస్ రావ‌డం శుభ సూచిక‌మే. పైగా `గుంటూరు` పాట కూడా జ‌నాల్లోకి వెళ్ల‌గ‌లిగింది. గుంటూరు ప్రాంత ప్రాముఖ్య‌త‌ని ఈ ఒక్క పాట‌లో చూపించారు. ఓ ర‌కంగా గుంటూరోళ్ల‌కు ఈ పాట ప్రాంతీయ గీతంగా చ‌లామ‌ణీ అయిపోతున్న‌ట్టే. ఇలా ఎటు చూసినా మిడిల్ క్లాస్‌కి అన్నీ మంచి శ‌కునాలే క‌నిపిస్తున్నాయి. మ‌రి ఓటీటీ బ‌రిలో.. ఈసినిమా ఎలా నిల‌బ‌డుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జనసైనికుల్ని రెచ్చగొట్టేందుకు వైసీపీ దింపుడు కళ్లెం ఆశలు !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం పూర్తయింది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఏ సీట్లలో పోటీ చేయాలో కూడా ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే పవన్ 24 సీట్లే తీసుకున్నారంటూ.....

విచారణకు రాను – సీబీఐకి కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు తాను హాజరు కావడం లేదని సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి...

మళ్లీ ఉద్యోగుల పోరాటం ప్రభుత్వానికి తాకట్టు !

ఎన్నికలకు ముందు ఉద్యోగ నేతలు ఆందోళనలు అంటూ హడావుడి చేశారు. కానీ అదంతా స్క్రిప్టెడ్ అని.. ఏమీ చేయకపోయినా ఏదో ఇచ్చినట్లుగా హడావుడి చేయడానికని మొదటి నుంచి అనుమానాలుననాయి. ఇప్పుడు అదే నిజం...

అభిప్రాయం : జనసేన శ్రేణుల అంతర్మధనం

2024 ఎన్నికల రాజకీయ వేడి రాజకుంది. తెలుగు దేశం పార్టీజనసేన కలిసి ఏర్పాటు చేసుకున్న పొత్తు లో భాగం గా జనసేన 24 ఎమ్మెల్యే సీట్ల లో పోటీ చేస్తుందని చంద్రబాబు -పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close