గోపీచంద్ కెరీర్ తొలినాళ్లలో వచ్చిన ఆంధ్రుడు… అతని కెరీర్‌కి అంతో కొంత దోహదం చేసిందే. ఈ సినిమాతో పరుచూరి మురళి తన స్టామినా చూపించాడు. అయితే ఆ తరవాత మురళికి బాగా గ్యాప్ వచ్చింది. అధినాయకుడుతో మరో ప్రయత్నం చేసినా వర్కవుట్ అవ్వలేదు. ఇప్పుడు మళ్లీ గోపీచంద్ దగ్గరకే చేరాడు. గోపీచంద్ – పరుచూరి మురళి కాంబోలో మరో చిత్రం తెరకెక్కుతోంది. ఎస్.రవీందర్ రెడ్డి నిర్మాత. ప్రస్తుతం గోపీచంద్ ఆక్సిజన్ చిత్రంలో నటిస్తున్నాడు. బి.గోపాల్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ రెండు సినిమాలూ పూర్తయ్యాక.. పరుచూరి మురళి సినిమా పట్టాలెక్కుతోంది.
”ఏడాది క్రితమే పరుచూరి మురళి గోపీచంద్ కోసం ఓ కథ సిద్దం చేశారు. ఆ కథ గోపీచంద్‌కి బాగా నచ్చింది. అయితే గా గోపీచంద్ కి చాలా కమిట్మెంట్స్ ఉండడం వల్ల ఆ కథ హోల్ట్‌లో పెట్టారు. ఇప్పుడు దాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాం” అని గోపీచంద్ సన్నిహితులు చెబుతున్నారు. గోపీచంద్ – వి.వి.వినాయక్ కాంబోలో ఓ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుందని ప్రచారం మొదలైంది. అదంతా.. ఉట్టి రూమరే అని తేలింది.