గౌత‌మ్ నంద‌… స్టైలీష్‌గా ఉన్నాడు

త‌న సినిమాలోని క‌థ‌లు, క్యారెక్ట‌రైజేష‌న్లు మారుతున్నా.. త‌న గెట‌ప్ మాత్రం ఏమాత్రం మార్చుకోవ‌డానికి ఇష్ట‌ప‌డని క‌థానాయ‌కుడు గోపీచంద్‌. అందుకే గోపీచంద్ లుక్ ప్ర‌తీ సినిమాలోనూ దాదాపుగా ఒకేలా క‌నిపిస్తుంది. గోపీచంద్ స్టిల్స్ అన్నీ సోలోగా రిలీజ్ చేసి ఏ స్టిల్ ఏ సినిమాలోనిదో చెప్పుకోమంటే చాలా చాలా క‌ష్టం. అలాంటి గోపీచంద్ ఇప్పుడు గెట‌ప్ మార్చి షాక్ ఇచ్చాడు. గెడ్డం పెంచి స్టైలీష్ గా క‌నిపిస్తున్నాడు. గోపీచంద్ క‌థానాయ‌కుడిగా సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. హ‌న్సిక, కేథ‌రిన్ క‌థానాయిక‌లు. జె. భ‌గ‌వాన్‌, జె.పుల్లారావు నిర్మాత‌లు. ఈ చిత్రానికి గౌత‌మ్ నందా అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కూడా విడుద‌లైంది. ఈ పోస్ట‌ర్‌లో గోపీ లుక్ చూస్తే ఎవ్వ‌రైనా షాక్ అవ్వాల్సిందే. చాలా స్టైలీష్ క‌నిపిస్తున్నాడు ఈ లుక్‌లో. సినిమా కూడా అంతే స్టైలీష్‌గా ఉంటుంద‌ని, గోపీచంద్ కెరీర్‌లో బెస్ట్ మూవీ అవుతుంద‌ని చిత్ర‌బృందం చెబుతోంది.

ఈనెలాఖ‌రు వ‌ర‌కూ గౌత‌మ్ నందా షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌బోతోంది. మార్చిలో పాట‌ల్ని విడుద‌ల చేస్తారు. ఏప్రిల్‌లో సినిమానీ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తారు. బెంగాల్ టైగ‌ర్ త‌ర‌వాత సంప‌త్ నంది నుంచి వ‌స్తున్న సినిమా ఇదే. ఆ హిట్‌ని ఈ సినిమాతో ఎంత వ‌ర‌కూ కాపాడుకొంటాడో చూడాలి. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ల్యాణ్ సెంటిమెంట్‌ని ఈ సినిమాతోనూ కొన‌సాగించాడు సంప‌త్‌. త‌ను ప‌వ‌న్‌కి వీరాభిమాని. ప‌వ‌న్‌తో ఓ సినిమా చేద్దామ‌నుకొన్నాడు కుద‌ర్లేదు. ప‌వ‌న్ కోసం అట్టిపెట్టుకొన్న బెంగాల్ టైగ‌ర్ అనే టైటిల్ తోనే ర‌వితేజ‌తో సినిమా తీశాడు. అత్తారింటికి దారేదిలో ప‌వ‌న్ క్యారెక్ట‌ర్ పేరు.. గౌత‌మ్ నందా. దాన్ని ఇప్పుడు టైటిల్ గా మార్చుకొన్నాడు. ఈ సెంటిమెంట్ ఎంత వ‌ర‌కూ వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరంజీవి ని కలవడం పై వివరణ ఇచ్చిన సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడిగా ఈరోజు అధికారికంగా పగ్గాలు చేపట్టారు సోము వీర్రాజు. పార్టీని 2024లో అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంలో విలేకరులతో మాట్లాడుతూండగా, ఇటీవల చిరంజీవిని...

జగన్ “స్టే” ఆశల్ని వమ్ము చేసిన తప్పుల పిటిషన్..!

మూడు రాజధానుల బిల్లుల అమలుపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌కోపై స్టే తెచ్చుకుందామనుకున్న ఏపీ సర్కార్‌కు.. కాలం కలసి రావట్లేదు. సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తున్న ఏపీ ప్రభుత్వ న్యాయ నిపుణులు తప్పుల తడకలుగా వేయడంతో.....

మాకు మహానగరాల్లేవ్.. సాయం చేయండి : జగన్

కేంద్రం నుంచి సాయం పొందాలంటే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసే విజ్ఞప్తులు కాస్త భిన్నంగా ఉంటాయి. కరోనా వైరస్ ఎక్కువ ప్రభావం చూపుతున్న పది రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో...

ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం అవసరం  : రామ్మాధవ్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని..  దాన్ని భర్తీ చేయాలని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి రామ్‌మాధవ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోము వీర్రాజు.. ఏపీ  బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు...

HOT NEWS

[X] Close
[X] Close