‘సింగం’ ద‌ర్శ‌కుడితో గోపీచంద్‌?

త‌మిళ ద‌ర్శ‌కుల‌పై తెలుగు హీరోల ప్రేమ ఇంకా త‌గ్గిపోలేదు. వాళ్లు క‌థ‌లు చెబుతానంటే, విన‌డానికీ, న‌చ్చితే చేయ‌డానికి రెడీనే. రామ్.. త‌మిళ ద‌ర్శ‌కుడు లింగుస్వామితో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు గోపీచంద్ కూడా ఓ త‌మిళ ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ‌కు ఓకే చెప్పిన‌ట్టు టాక్‌. సింగం సిరీస్‌తో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు హ‌రి. మాస్‌, యాక్ష‌న్ క‌థ‌ల‌కు ఆయ‌న పెట్టింది పేరు. ముఖ్యంగా పోలీస్ క‌థ‌లు. సింగం, సింగం 2, సింగం 3… త‌మిళంలోనే కాదు.. తెలుగులోనూ మంచి వ‌సూళ్లు అందుకున్నాయి. ఇప్పుడు హ‌రి ఓ క‌థ త‌యారు చేశాడ‌ని, అది గోపీచంద్ కి అయితే బాగుంటుంద‌ని అనుకుంటున్నాడ‌ని, ఈ క‌థ విష‌య‌మై.. గోపీచంద్ తో సంప్ర‌దింపులు కూడా మొద‌ల‌య్యాయ‌ని తెలుస్తోంది. గోపీచంద్ కూడా హ‌రితో సినిమా చేయ‌డానికి రెడీగానే ఉన్నాడ‌ని టాక్‌. ఇది కూడా పోలీస్‌స్టోరీనే అని తెలుస్తోంది. గోపీచంద్ న‌టించిన‌ `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఈలోగా… ఈ క‌థ సెట్ట‌యిపోతే, గోపీచంద్ చేసే త‌దుపరి సినిమా ఇదే అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close