వాట్ ఈజ్ దిస్‌… గోపీ?!

పాపం… గోపీచంద్ టైమ్ మ‌రీ బ్యాడ్ గా ఉంది. ఆర‌గ‌డుగుల బుల్లెట్ ఆగిపోయింది. ఎన్నో ఆశ‌లు పెట్టుకొన్న గౌత‌మ్ నంద ఫ్లాప్ అయ్యింది. `ఆక్సిజ‌న్‌` వ‌ద్దామా, రావొద్దా?? అనేది తేల్చుకోక తంటాలు ప‌డుతోంది. జ్యోతి కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాపై ఇప్ప‌టికే భారీ ఎత్తున ఖ‌ర్చు పెట్టారు. సినిమా షూటింగ్ పూర్తి కావొస్తుంద‌ని అన‌గా.. ఆర్థిక కార‌ణాల వ‌ల్ల ఆగిపోయింది. ఎట్ట‌కేల‌కు ఈ సినిమాని పూర్తి చేశారు. అక్టోబ‌రు 12న ఈ సినిమాని విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది కూడా. ఇప్పుడు ఈ సినిమా మ‌రో సారి వాయిదా ప‌డింది. రెండు వారాలు ఆల‌స్యంగా అంటే… అక్టోబ‌రు 27న ఈ సినిమాని విడుద‌ల చేయాల‌నుకొంటోంది చిత్ర‌బృందం. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి తెర‌కెక్కించిన సినిమా ఇది. రెండు చోట్లా ఒకేసారి విడుద‌ల చేద్దామ‌నుకొంటున్నారు. అందుకే…. ఇంత ఆల‌స్యం అవుతోంద‌న్న‌ది చిత్ర‌బృందం మాట‌. అయితే గోపీచంద్‌కి త‌మిళంలో మార్కెట్ లేదు. త‌మిళ డేట్ల కోసం ఈ సినిమాని వాయిదా వేశార‌న‌డం కేవ‌లం ఒట్టిమాట‌. మ‌రోసారి ఈ సినిమా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకొంద‌ని, అందుకే విడుద‌ల ఆల‌స్యం అవుతోంద‌ని తెలుస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిచిన ఈ చిత్రంలో రాశి ఖన్నా, అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్లుగా నటించారు. క‌థ‌లు, రిలీజ్ డేట్ల విష‌యంలో ప‌క్కా ప్లానింగ్‌తో వ్య‌వ‌హ‌రించే గోపీచంద్ ఈసారి ఇలా బుక్క‌యిపోతున్నాడేంటో..??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com