గోపీచంద్ – శ్రీ‌నువైట్ల‌… ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌

చాలా కాలం నుంచి హిట్టు కోసం ప‌రిత‌పిస్తున్నాడు శ్రీ‌నువైట్ల‌. గోపీచంద్ ప‌రిస్థితి కూడా అంతే. ఇప్పుడు వీరిద్ద‌రూ జ‌ట్టు క‌ట్ట‌బోతున్నారు. `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ` త‌ర‌వాత ఓ స్క్రిప్టు ఓకే చేయించుకొని, హీరోని ప‌ట్టుకోవ‌డానికి తంటాలు ప‌డుతున్నాడు శ్రీ‌నువైట్ల‌. ఎట్ట‌కేల‌కు గోపీచంద్ ఈ క‌థ‌కు ఓకే చెప్పాడ‌ని టాక్ నడుస్తోంది. బివిఎస్ ర‌వి ఈ చిత్రానికి క‌థ అందించాడ‌ని స‌మాచారం. బీబీఎస్ ర‌వికీ… గోపీచంద్ కీ మ‌ధ్య ఓ చేదు జ్ఞాప‌కం ఉంది. అదే ‘వాంటెడ్‌’. ర‌చ‌యిత ర‌వి.. ద‌ర్శ‌కుడిగా మారి మెగా ఫోన్‌ప‌ట్టింది ‘వాంటెడ్‌’ సినిమాతోనే. అది ఫ్లాప్ అయ్యింది.

గోపీచంద్ కోసం శ్రీ‌నువైట్ల‌, బివిఎస్ ర‌వి ఇద్ద‌రూ క‌లిసి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థ‌ని రెడీ చేశారని తెలుస్తోంది. శ్రీ‌నువైట్ల బ‌లం కామెడీ. త‌న సినిమా ఫ్లాప్ అయినా ఎంట‌ర్‌టైన్‌మెంట్ బాగుంటుంది. లాజిక్కులు వెదుక్కోకుండా హాయిగా చూసుకొని న‌వ్వుకోవొచ్చు. అయితే.. ఎందుక‌నో.. శ్రీ‌నువైట్లకు ఎంట‌ర్‌టైన్‌మెంట్ అంటే మొహం మొత్తేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ‘అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ’ కూడా సీరియ‌స్‌గా సాగే క‌థే. అందులోనూ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఉండ‌దు. అద‌స‌లు శ్రీ‌నువైట్ల మార్క్ సినిమానే కాదు. అందుక‌నే బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఫెయిల్ అయ్యింది. శ్రీ‌ను మ‌ళ్లీ పాత స్కూలులోకి వెళ్లి సినిమాలు తీయాల‌ని అనుకొంటున్న స‌మ‌యంలో.. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ని ఎంచుకొన్నాడెందుకో మ‌రి..?!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అందుకే.. వంగలపూడి అనితకు హోంశాఖ!

ఏపీలో అత్యంత కీలకమైన హోంశాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా నేత వంగలపూడి అనితకు కేటాయించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. సీనియర్ సభ్యులను కూడా కాదని అనితకు హోంశాఖను కేటాయించడం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది....

విష్ణు క‌న్న‌ప్ప వెనుక కృష్ణంరాజు

రెబ‌ల్ స్టార్‌ కృష్ణంరాజు కెరీర్‌లో మ‌ర్చిపోలేని సినిమా 'క‌న్న‌ప్ప‌'. త‌న సొంత బ్యాన‌ర్‌లో బాపు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన ఈ చిత్రం కృష్ణంరాజుకు న‌టుడిగా, నిర్మాత‌గా మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాని ప్ర‌భాస్‌తో...

తీహార్‌ జైల్లో కవితను కలిసిన కేటీఆర్

తీహార్ జైల్లో ఉన్న కవితతో చాలా రోజుల తర్వాత కేటీఆర్ ములాఖత్ అయ్యారు. మార్చి 15న కవితను హైదరాబాద్ లో ఈడీ అధికారులు అరెస్టు చేసిన తర్వాత ఆమె కోసం...

సజ్జల ప్లేస్‌లో ఉండవల్లి కరెక్ట్ !

అబ్బా..అబ్బా.. ఏం మోటివేషన్ అండి. ఆయన గారు కార్పొరేట్ మోటివేషనల్ స్పీకర్ గా వెళ్తే ఆయన ఎక్కించే హైప్‌కి ఐటీ ఉద్యోగులు గాల్లో తేలిపోతారు. కానీ జగన్ రెడ్డికి ఎలా ఉందో ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close