మహేష్ బాబు – మురుగదాస్ కలయికలో ఓ చిత్రం ఈమధ్యే పట్టాలెక్కింది. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి హారీశ్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం నైట్ ఎఫెక్ట్లో ఓ ఫైటు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా చుట్టూ ఓ భయంకరమైన గాసిప్ తిరుగుతోంది. అదేంటంటే… ఇందులో నమ్రత కూడా ఓ కీలక పాత్ర పోషిస్తోందని, వంశీ తరవాత మహేష్, నమ్రతలు కలిసి నటిస్తున్నారన్నది ఆ గాసిప్ సారాంశం. వీటిపై ఆరా తీసింది తెలుగు 360.కామ్.
ఈ వార్త శుద్ద గాసిప్ అని తేలిపోయింది. నమ్రత మళ్లీ నటించే ఛాన్సే లేదని అదంతా ఒట్టిపుకారే అని కొట్టి పడేస్తున్నాయి మహేష్ కాంపౌండ్ వర్గాలు. ”మహేష్ – మురుగదాస్ సినిమాలో నమ్రతకు ఓ పాత్ర ఉన్నట్టు.. అందులో ఆమె నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అవేం నిజం కావు. అసలు ఈ టాపిక్కే ఇంత వరకూ రాలేదు. నమ్రతకూ నటించడం ఇష్టం లేదు..” అని మహేష్ సన్నిహిత వర్గాలు కొట్టిపరేస్తున్నాయి. సో.. ఇదంతా గాసిప్ రాయుళ్ల చలవే అన్నమాట.