రాయదుర్గంలో భూమల వేలంతో లభించిన ఆదాయంతో తెలంగాణ ప్రభుత్వం మరింత ఉత్సాహంగా ఇతర భూమలను వేలం వేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అత్యంత ఖరీదైన భూములుగా మారిన కోకాపేట నియోపొలిస్ ప్రాంతంలో ఉన్న 25 ఎకరాలను అమ్మేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ వేలం ద్వారా ప్రభుత్వ ఖజనాకు సుమారు రూ.3,000 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
గత ప్రభుత్వం రెండు దశల్లో ఇక్కడి భూములను వేలం వేసింది. అప్పట్లో రూ.5,300 కోట్లు వచ్చాయి. ఈ వేలం ఫేజ్-3గా జరగనుంది. నవంబర్ మొదటి వారంలో లేదా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత HMDA నోటిఫికేషన్ జారీ చేయనుంది. అనుకున్న ప్రకారం జరిగితే, నవంబర్ చివరి వారంలో ఈ-వేలం ప్రక్రియ పూర్తవుతుంది.
కనీస ధర నిర్ణయం విషయంలో ఈ సారి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరీ హక్కుగా నిర్ణయిస్తే మొదటికే మోసం వస్తుదని .. ఇటీవల తెలిసొచ్చింది.
గత వేలాల్లో ఎకరాకు రూ.35 కోట్లుగా నిర్ణయించారు. ఈ సారి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఇటీవల రాయదుర్గం భూమి వేలంలో ఎకరా ధర రూ.177 కోట్లు పలికినందున కోకాపేట్లో కూడా భారీ పోటీ ఉంటుందని అంచనా. హైదరాబాద్‌లో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి, ముఖ్యంగా పశ్చిమ భాగంలో రాయదుర్గం, కోకాపేట్ వంటి ప్రాంతాలు రియల్ ఎస్టేట్ బూమ్‌కు కేంద్రమవుతున్నాయి.
ఇటీవల నియోపోలిస్ లేఅవుట్‌ను మళ్లీ సర్వే చేశారు. గత బిడ్డర్లు కేటాయించిన దానికంటే ఎక్కువ భూమి ఆక్రమించినట్లు ఆరోపణలు రావడంతో, HMDA నోటీసులు జారీ చేసి సుమారు 5 ఎకరాలు తిరిగి స్వాధీనం చేసుకుంది.